iDreamPost

SRH గెలిచినా MIదే అరుదైన రికార్డు.. హార్దిక్ సేనను మెచ్చుకోవాల్సిందే!

  • Published Mar 28, 2024 | 6:15 PMUpdated Mar 28, 2024 | 6:27 PM

ఉప్పల్ వేదికగా ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడింది. అయితే ఓ విషయంలో మాత్రం హార్దిక్ సేనను అందరూ మెచ్చుకోవాల్సిందే.

ఉప్పల్ వేదికగా ఆఖరి బాల్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ చేతిలో ముంబై ఇండియన్స్ ఓడింది. అయితే ఓ విషయంలో మాత్రం హార్దిక్ సేనను అందరూ మెచ్చుకోవాల్సిందే.

  • Published Mar 28, 2024 | 6:15 PMUpdated Mar 28, 2024 | 6:27 PM
SRH గెలిచినా MIదే అరుదైన రికార్డు.. హార్దిక్ సేనను మెచ్చుకోవాల్సిందే!

ఐపీఎల్ హిస్టరీలో ఎప్పటికీ నిలిచిపోయే మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ సూపర్బ్ బ్యాటింగ్​తో అదరగొట్టింది. ఒకడు ఉరుమైతే, మరొకడు మెరుపు అన్నట్లు మన జట్టు బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలారు. దీంతో క్యాష్ రిచ్ లీగ్​లో రికార్డు స్కోరుతో సత్తా చాటింది ఎస్​ఆర్​హెచ్. ఉప్పల్ స్టేడియంలో ముంబై ఇండియన్స్​తో జరిగిన ఈ మ్యాచ్​లో 31 పరుగుల తేడాతో కమిన్స్ సేన విక్టరీ కొట్టింది. ఈ సీజన్ ఐపీఎల్​లో సన్​రైజర్స్​కు ఇదే తొలి విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్​హెచ్ 277 పరుగుల రికార్డు స్కోరు నమోదు చేసింది. ఛేజింగ్​కు దిగిన ఎంఐ 20 ఓవర్లలో 246 పరుగులు చేయగలిగింది. అయితే ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ గెలిచినా గానీ ఓ అరుదైన రికార్డును మాత్రం ముంబై ఇండియన్స్ నమోదు చేసింది.

చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్​లో ముంబైని హైదరాబాద్ ఓడించింది. కానీ ఓ అరుదైన రికార్డును తన అకౌంట్​లో వేసుకుంది ఎంఐ. ఈ మ్యాచ్​లో మొత్తంగా 38 సిక్సులు నమోదయ్యాయి. టీ20 క్రికెట్ హిస్టరీలో అత్యధిక సిక్సులు నమోదైన మ్యాచ్​గా ఇది రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ బ్యాటర్లు నెక్స్ట్ లెవల్​లో హిట్టింగ్ చేశారు. వాళ్లు ఏకంగా 18 సిక్సులు బాదారు. అయితే మన జట్టు బ్యాటర్ల కంటే ముంబై ఆటగాళ్లే ఎక్కువ సిక్సులు కొట్టారు. ఎంఐ బ్యాట్స్​మెన్ ఏకంగా 20 సిక్సులు కొట్టారు. ఆ రకంగా చూసుకుంటే విజయం సన్​రైజర్స్​ను వరించినా అత్యధిక సిక్సుల రికార్డులో మేజర్ షేర్, క్రెడిట్​ను ఆ టీమే కొట్టేసింది. అందుకే ఈ విషయంలో హార్దిక్ సేనను అందరూ మెచ్చుకుంటున్నారు. ఓడినా చివరి వరకు పోరాడటం, సిక్సులతో ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేయడం సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు.

ఇక, ఎస్ఆర్​హెచ్​-ఎంఐ మ్యాచ్ చాలా రికార్డులకు వేదికగా నిలిచింది. ఈ మ్యాచ్​లో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ కలిపి మొత్తం 523 పరుగులు నమోదయ్యాయి. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్​గా ఇది రికార్డులకెక్కింది. 16 బంతుల్లో 50 పరుగుల మార్క్​ను చేరుకొని సన్​రైజర్స్​ తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ కొట్టిన బ్యాటర్​గా అభిషేక్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. ఇదే మ్యాచ్​లో ట్రావిస్ హెడ్ (18 బంతుల్లో 50), హెన్రిచ్ క్లాసెన్ (23 బంతుల్లో 50) కూడా వేగంగా హాఫ్ సెంచరీలు బాదారు. ఎంఐ బ్యాటర్ తిలక్ వర్మ (24 బంతుల్లో 50) కూడా క్విక్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్​లో ఛేజింగ్​లో అత్యధిక స్కోరు, టీ20ల్లో అత్యధిక సిక్సులు.. ఇలా చాలా రికార్డులు ఈ మ్యాచ్​లో నమోదయ్యాయి. మరి.. ఎస్ఆర్​హెచ్ గెలిచినా గానీ సిక్సుల విషయంలో ముంబై ముందుండటంపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: SRHతో మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్​లో పాండ్యా స్పీచ్.. వింటే ఆశ్చర్యపోతారు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి