Nidhan
ఒక్కో విజయంతో జోరు మీదున్న రెండు టాప్ టీమ్స్ మధ్య మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. రెండో విక్టరీతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తున్నాయా జట్లు. అవే బెంగళూరు, కోల్‌కతా. ఈ మ్యాచ్‌లో గెలుపెవరిదంటే..
ఒక్కో విజయంతో జోరు మీదున్న రెండు టాప్ టీమ్స్ మధ్య మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. రెండో విక్టరీతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తున్నాయా జట్లు. అవే బెంగళూరు, కోల్‌కతా. ఈ మ్యాచ్‌లో గెలుపెవరిదంటే..
Nidhan
ఒక్కో విజయంతో జోరు మీదున్న రెండు టాప్ టీమ్స్ మధ్య మ్యాచ్‌కు అంతా రెడీ అయింది. రెండో విక్టరీతో ప్రత్యర్థులకు డేంజర్ సిగ్నల్స్ పంపాలని చూస్తున్నాయా జట్లు. అవే బెంగళూరు, కోల్‌కతా. ఆడిన తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మీద థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది కేకేఆర్. అదే జోరును కంటిన్యూ చేస్తూ ఆర్సీబీని కూడా చిత్తు చేయాలని చూస్తోంది. అయితే రెండో మ్యాచ్‌లో గెలుపుతో ట్రాక్ మీదకు వచ్చిన డుప్లెసిస్ సేన సెకండ్ విన్ నమోదు చేయాలని చూస్తోంది. ఈ ఇరు టీమ్స్ మధ్య శుక్రవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ సీజన్‌ను ఓటమితో స్టార్ట్ చేసింది ఆర్సీబీ. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయింది. అయితే వెంటనే తేరుకున్న డుప్లెసిస్ సేన.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. ఈ టీమ్‌కు అతిపెద్ద బలం విరాట్ కోహ్లీ. బ్యాటర్‌గా అదరగొట్టడమే గాక.. సీనియర్ ప్లేయర్‌గా ఫీల్డింగ్ టైమ్‌లోనూ అతడు కీలకంగా మారుతున్నాడు. పంజాబ్‌తో మ్యాచ్‌లో 77 పరుగుల సూపర్బ్ నాక్‌తో మెరిశాడు కింగ్. అదే మ్యాచ్‌లో 10 బంతుల్లో 28 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్. అతడితో పాటు మహిపాల్ లోమ్రోల్ రాణిస్తుండటం టీమ్‌కు కలిసొచ్చే అంశం.
కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ఫామ్‌ను అందుకోవాల్సి ఉంది. అయితే యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్ ఆర్సీబీకి పెద్ద మైనస్‌గా తయారయ్యాడు. అతడితో పాటు కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ టీమ్‌ను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్‌లో సిరాజ్, దయాల్ రాణిస్తున్నారు. మాక్సీ కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అయితే గ్రీన్, డగర్, జోసెఫ్ వికెట్లు తీయకపోగా.. భారీగా పరుగులు ఇచ్చుకోవడం వీక్నెస్గా చెప్పుకోవచ్చు.
కోల్‌కతాకు అతిపెద్ద బలం ఆ టీమ్ బ్యాటింగ్ యూనిట్. ఫిల్ సాల్ట్, శ్రేయస్ అయ్యర్, నితీష్ రానా, రింకూ సింగ్, అండ్రీ రస్సెల్ రూపంలో స్ట్రాంగ్ బ్యాటింగ్ యూనిట్ ఆ జట్టు సొంతం. తొలి మ్యాచ్‌లో సాల్ట్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. రింకూ, రమణ్‌దీప్ కూడా ఆకట్టుకున్నాడు. రస్సెస్ 25 బంతుల్లో 64 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. మిగిలిన బ్యాటర్లు కూడా ఫామ్‌లోకి వస్తే కేకేఆర్‌కు తిరుగుండదు. అయితే రూ.25 కోట్ల ఆటగాడైన మిచెల్ స్టార్క్ ఫస్ట్ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయాడు. వికెట్ తీయకపోగా 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు. వరుణ్ చక్రవర్తి కూడా భారీగా రన్స్ లీక్ చేస్తున్నాడు. వీళ్లిద్దరూ టీమ్‌కు మైనస్‌గా మారారు. అయితే రస్సెల్, హర్షిత్ రానా, సునీల్ నరైన్ బాగా బౌలింగ్ చేస్తున్నారు.
ఈ రెండు టీమ్స్ మధ్య ఇప్పటిదాకా 32 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 14 సార్లు బెంగళూరు నెగ్గగా.. 18 సార్లు కోల్‌కతా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ గెలవడం ఖాయం. ఆ జట్టు ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్, సొంత గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుండటం, భారీ ఇన్నింగ్స్‌లు ఆడే విరాట్ కోహ్లీ ఊపు మీద ఉండటం చూస్తుంటే బెంగళూరును అడ్డుకోవడం కేకేఆర్‌కు కష్టమే.
బెంగళూరు:
ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కామెరాన్ గ్రీన్, రజత్ పాటిదార్, గ్లెన్ మాక్స్వెల్, అనూజ్ రావత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మహ్మద్ సిరాజ్, యష్ దయాల్.
ఇంపాక్ట్ ప్లేయర్లు: మహిపాల్ లోమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్, స్వప్నిల్ సింగ్, వైషల్ విజయ్‌కుమార్, ఆకాశ్‌దీప్.
కోల్‌కతా:
ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రానా, రమణ్‌దీప్ సింగ్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ట్ ప్లేయర్లు: సుయాష్ శర్మ, వైభవ్ అరోరా, అంగ్ర్కిష్ రఘువంశీ, మనీష్ పాండే, రెహ్మానుల్లా గుర్బాజ్.
ఇదీ చదవండి: SRH గెలిచినా MIదే అరుదైన రికార్డు.. హార్దిక్ సేనను మెచ్చుకోవాల్సిందే!