Nidhan
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ ఏడాది ఐపీఎల్లో అంతగా రాణించడం లేదు. బ్యాటర్లను భయపెట్టి ఆర్సీబీని గెలిపిస్తాడని అనుకుంటే.. భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. అలాంటోడు కరెక్ట్ టైమ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు.
హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ ఏడాది ఐపీఎల్లో అంతగా రాణించడం లేదు. బ్యాటర్లను భయపెట్టి ఆర్సీబీని గెలిపిస్తాడని అనుకుంటే.. భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. అలాంటోడు కరెక్ట్ టైమ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు.
Nidhan
మహ్మద్ సిరాజ్.. అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనలతో తక్కువ సమయంలోనే టీమిండియాలో కీలక సభ్యుడిగా మారాడు. టీమ్‌లో ప్లేస్ కష్టమనే స్థాయి నుంచి.. అన్ని ఫార్మాట్లలోనూ రెగ్యులర్ ప్లేయర్ రేంజ్‌కు ఎదిగాడు. వన్డే వరల్డ్ కప్-2023లో భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అలాంటోడు ఈ మధ్య కాస్త డల్ అయ్యాడు. ఈ హైదరాబాదీ పేసర్ ఐపీఎల్-2024లో అంతగా రాణించడం లేదు. బ్యాటర్లను భయపెట్టి ఆర్సీబీని గెలిపిస్తాడని అనుకుంటే.. భారీగా పరుగులు సమర్పించుకుంటూ జట్టుకు భారంగా మారాడు. దీంతో కొన్ని మ్యాచుల్లో అతడ్ని బెంచ్ మీద కూర్చోబెట్టారు. అలాంటోడు కరెక్ట్ టైమ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లతో ఓ రేంజ్లో ఆడుకుంటున్నాడు సిరాజ్. పవర్‌ప్లే బీస్ట్‌గా తనను ఎందుకు పిలుస్తారో ఈ మ్యాచ్‌తో అతడు ప్రూవ్ చేసుకున్నాడు. పవర్‌ప్లేలో 2 ఓవర్లు వేసిన సిరాజ్ మియా కేవలం 9 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. జీటీ ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా (1), శుబ్‌మన్ గిల్ (2)ను అతడు వెనక్కి పంపాడు. సిరాజ్ పేస్‌కు అపోజిషన్ బ్యాటర్లు వణికిపోయారు. ఈ హైదరాబాదీ బౌలింగ్ చూసిన అభిమానులు.. కరెక్ట్ టైమ్‌కు అతడు ఫామ్‌లోకి వచ్చాడని అంటున్నారు. టీ20 ప్రపంచ కప్‌కు ముందు తిరిగి లయను అందుకున్నాడని.. ఇంక భారత జట్టుకు తిరుగుండదని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. సిరాజ్ బౌలింగ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
RCB has conceded the lowest score in Powerplay in IPL 2024. 🌟
– Siraj, the main man. pic.twitter.com/9KyP4dcDqr
— Johns. (@CricCrazyJohns) May 4, 2024