Nidhan
ఒక్క బాల్‌తో రిజల్ట్ మారిపోయే టీ20 క్రికెట్లో నెగ్గాలంటే గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది ఉండబట్టే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది ఆర్సీబీ. ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు ప్లేయర్ల పెర్ఫార్మెన్స్తో పాటు లక్ కూడా కలిసొచ్చింది.
ఒక్క బాల్‌తో రిజల్ట్ మారిపోయే టీ20 క్రికెట్లో నెగ్గాలంటే గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది ఉండబట్టే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది ఆర్సీబీ. ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు ప్లేయర్ల పెర్ఫార్మెన్స్తో పాటు లక్ కూడా కలిసొచ్చింది.
Nidhan
ఒక్క బాల్‌తో రిజల్ట్ మారిపోయే టీ20 క్రికెట్లో నెగ్గాలంటే గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఒక బౌండరీ, ఓ వికెట్.. ఒక రనౌట్, ఓ క్యాచ్.. పొట్టి ఫార్మాట్లో మ్యాచ్ స్వరూపం మార్చేయడానికి ఇలా చిన్న మూమెంట్ చాలు. అయితే ఇది జరగాలంటే లక్ ఉండాలి. అది ఉండబట్టే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది ఆర్సీబీ. ఈ మ్యాచ్‌లో బెంగళూరుకు ప్లేయర్ల పెర్ఫార్మెన్స్తో పాటు లక్ కూడా కలిసొచ్చింది. గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా తోడవడంతో డీసీని 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది డుప్లెసిస్ సేన. నిన్న మ్యాచ్‌లో ఆ ఒక్కటీ జరగకపోతే ఆర్సీబీ ఓడిపోయేదనే చెప్పాలి. మరి.. మ్యాచ్‌ను మార్చేసిన ఆ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
నిన్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ఓవర్లన్నీ ఆడి 187 పరుగులు చేసింది. చిన్నస్వామి పిచ్‌పై ఇది ఛేజ్ చేయడం ఈజీనే. కానీ ఆర్సీబీ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకోకుండా చేశారు. ఎక్కడికక్కడ పార్ట్నర్షిప్స్ నెలకుండా చేయడంతో భారీ స్కోరు ఛేదనలో 140 పరుగులకే డీసీ పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అంటే మాత్రం జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్ రనౌట్ అనే చెప్పాలి. అది ఢిల్లీ ఇన్నింగ్స్ 3వ ఓవర్. అప్పటికే 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 21 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు ఫ్రేజర్. అతడి జోష్ చూస్తుంటే ఈజీగా ఇంకో ఫిఫ్టీ రన్స్ చేసేలా కనిపించాడు. కానీ బ్యాడ్ లక్ వల్ల అతడు వెనుదిరిగాడు.
ఫ్రేజర్ ఊపు మీదున్న టైమ్‌లో ఆర్సీబీకి లక్ కలిసొచ్చింది. 3వ ఓవర్లో అతడు ఔట్ అయ్యాడు. యశ్ దయాల్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని షై హోప్ స్ట్రయిట్ షాట్ ఆడాడు. ఫాలో త్రూలో బాల్‌ను ఆపేందుకు ప్రయత్నించాడు దయాల్. అయితే అది అతడి చేతి కొసకు తగిలి దిశను మార్చుకుంది. వికెట్లకు దూరంగా వెళ్లాల్సిన బాల్ కాస్తా దయాల్ చేతికి తగలడంతో డైరెక్షన్ ఛేంజ్ అయి స్టంప్స్ వైపు దూసుకొచ్చింది. ఆ టైమ్‌లో నాన్‌స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న ఫ్రేజర్ అప్పటికే క్రీజును వీడాడు. బాల్ రావడం వికెట్లను ముద్దాడటం రెప్పపాటులో జరిగాయి. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు క్రీజులో బ్యాట్‌ను పెట్టినా అప్పటికే ఆలస్యమైంది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. దురదృష్టవశాత్తూ ఔట్ అవడంతో ఫ్రేజర్ పెవిలియన్ దిశగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దయాల్ చేతికి బాల్ తగలకపోతే ఫ్రేజర్ బతికిపోయేవాడు. అతడు మరింత సేపు బ్యాటింగ్ చేస్తే డీసీకి ఛేజింగ్ ఈజీ అయ్యేది. కాబట్టి ఈ మ్యాచ్‌లో లక్ ఫ్యాక్టర్ ఆ టీమ్‌కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.
ICYMI‼️
Yash Dayal’s reflexes were on point 👌
Jake Fraser-McGurk went back just when he was getting a move on!
Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #RCBvDC | @RCBTweets pic.twitter.com/UQxck6UDLt
— IndianPremierLeague (@IPL) May 12, 2024