iDreamPost
android-app
ios-app

వీడియో: అదృష్టం అంటే RCBదే.. ఇది జరగకపోతే నిన్న మ్యాచ్​లో ఓడేది!

  • Published May 13, 2024 | 2:47 PMUpdated May 13, 2024 | 2:47 PM

ఒక్క బాల్​తో రిజల్ట్ మారిపోయే టీ20 క్రికెట్​లో నెగ్గాలంటే గుమ్మడికాయంత టాలెంట్​తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది ఉండబట్టే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​ను ఓడించింది ఆర్సీబీ. ఈ మ్యాచ్​లో బెంగళూరుకు ప్లేయర్ల పెర్ఫార్మెన్స్​తో పాటు లక్ కూడా కలిసొచ్చింది.

ఒక్క బాల్​తో రిజల్ట్ మారిపోయే టీ20 క్రికెట్​లో నెగ్గాలంటే గుమ్మడికాయంత టాలెంట్​తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. అది ఉండబట్టే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​ను ఓడించింది ఆర్సీబీ. ఈ మ్యాచ్​లో బెంగళూరుకు ప్లేయర్ల పెర్ఫార్మెన్స్​తో పాటు లక్ కూడా కలిసొచ్చింది.

  • Published May 13, 2024 | 2:47 PMUpdated May 13, 2024 | 2:47 PM
వీడియో: అదృష్టం అంటే RCBదే.. ఇది జరగకపోతే నిన్న మ్యాచ్​లో ఓడేది!

ఒక్క బాల్​తో రిజల్ట్ మారిపోయే టీ20 క్రికెట్​లో నెగ్గాలంటే గుమ్మడికాయంత టాలెంట్​తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి. ఒక బౌండరీ, ఓ వికెట్.. ఒక రనౌట్, ఓ క్యాచ్.. పొట్టి ఫార్మాట్​లో మ్యాచ్ స్వరూపం మార్చేయడానికి ఇలా చిన్న మూమెంట్ చాలు. అయితే ఇది జరగాలంటే లక్ ఉండాలి. అది ఉండబట్టే నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​ను ఓడించింది ఆర్సీబీ. ఈ మ్యాచ్​లో బెంగళూరుకు ప్లేయర్ల పెర్ఫార్మెన్స్​తో పాటు లక్ కూడా కలిసొచ్చింది. గుమ్మడికాయంత టాలెంట్​తో పాటు ఆవగింజంత అదృష్టం కూడా తోడవడంతో డీసీని 47 పరుగుల తేడాతో చిత్తు చేసింది డుప్లెసిస్ సేన. నిన్న మ్యాచ్​లో ఆ ఒక్కటీ జరగకపోతే ఆర్సీబీ ఓడిపోయేదనే చెప్పాలి. మరి.. మ్యాచ్​ను మార్చేసిన ఆ ఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

నిన్న మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు ఓవర్లన్నీ ఆడి 187 పరుగులు చేసింది. చిన్నస్వామి పిచ్​పై ఇది ఛేజ్ చేయడం ఈజీనే. కానీ ఆర్సీబీ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఢిల్లీ బ్యాటర్లను క్రీజులో నిలదొక్కుకోకుండా చేశారు. ఎక్కడికక్కడ పార్ట్​నర్​షిప్స్​ నెలకుండా చేయడంతో భారీ స్కోరు ఛేదనలో 140 పరుగులకే డీసీ పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్​లో టర్నింగ్ పాయింట్ అంటే మాత్రం జేక్ ఫ్రేజర్ మెక్​గర్క్ రనౌట్ అనే చెప్పాలి. అది ఢిల్లీ ఇన్నింగ్స్ 3వ ఓవర్. అప్పటికే 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 21 పరుగులు చేసి మంచి ఊపు మీద ఉన్నాడు ఫ్రేజర్. అతడి జోష్​ చూస్తుంటే ఈజీగా ఇంకో ఫిఫ్టీ రన్స్ చేసేలా కనిపించాడు. కానీ బ్యాడ్ లక్​ వల్ల అతడు వెనుదిరిగాడు.

ఫ్రేజర్ ఊపు మీదున్న టైమ్​లో ఆర్సీబీకి లక్ కలిసొచ్చింది. 3వ ఓవర్​లో అతడు ఔట్ అయ్యాడు. యశ్ దయాల్ వేసిన ఆ ఓవర్ తొలి బంతిని షై హోప్ స్ట్రయిట్ షాట్ ఆడాడు. ఫాలో త్రూలో బాల్​ను ఆపేందుకు ప్రయత్నించాడు దయాల్. అయితే అది అతడి చేతి కొసకు తగిలి దిశను మార్చుకుంది. వికెట్లకు దూరంగా వెళ్లాల్సిన బాల్ కాస్తా దయాల్ చేతికి తగలడంతో డైరెక్షన్ ఛేంజ్ అయి స్టంప్స్​ వైపు దూసుకొచ్చింది. ఆ టైమ్​లో నాన్​స్ట్రయికింగ్ ఎండ్​లో ఉన్న ఫ్రేజర్ అప్పటికే క్రీజును వీడాడు. బాల్ రావడం వికెట్లను ముద్దాడటం రెప్పపాటులో జరిగాయి. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు క్రీజులో బ్యాట్​ను పెట్టినా అప్పటికే ఆలస్యమైంది. దీంతో ఆర్సీబీ ఆటగాళ్లు సంబురాలు చేసుకున్నారు. దురదృష్టవశాత్తూ ఔట్ అవడంతో ఫ్రేజర్ పెవిలియన్​ దిశగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. దయాల్ చేతికి బాల్ తగలకపోతే ఫ్రేజర్ బతికిపోయేవాడు. అతడు మరింత సేపు బ్యాటింగ్ చేస్తే డీసీకి ఛేజింగ్ ఈజీ అయ్యేది. కాబట్టి ఈ మ్యాచ్​లో లక్ ఫ్యాక్టర్ ఆ టీమ్​కు బాగా కలిసొచ్చిందనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి