iDreamPost

RCB vs CSK: కోహ్లీ క్రేజీ రికార్డ్.. IPL హిస్టరీలో ఫస్ట్ ప్లేయర్​గా అరుదైన ఘనత!

  • Published May 18, 2024 | 8:32 PMUpdated May 18, 2024 | 8:32 PM

ఆర్సీబీ సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డును క్రియేట్ చేశాడు. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఐపీఎల్-2024లో భీకర ఫామ్​లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. ఎలాగైనా ఆర్సీబీకి కప్పు అందించాలని పట్టుదలతో ఉన్న కింగ్.. ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాడు. దాదాపుగా ప్రతి మ్యాచ్​లోనూ తన బ్యాట్​తో గర్జిస్తున్నాడు. సాధారణ మ్యాచుల్లోనే అంత భీకరంగా ఆడిన కోహ్లీ.. ఇంక ప్లేఆఫ్స్​కు చేరాలంటే గెలవక తప్పని మ్యాచ్​లో ఊరుకుంటాడా? చెన్నైతో జరుగుతున్న నాకౌట్​ మ్యాచ్​లో కింగ్ జూలు విదిల్చాడు. 9 బంతుల్లో 1 బౌండరీ, 2 సిక్సులతో 19 పరుగులు చేశాడు. ఇంకా క్రీజులోనే ఉన్న ఆర్సీబీ స్టార్.. ఈ మ్యాచ్​లో క్రేజీ రికార్డును క్రియేట్ చేశాడు.

రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు చేరింది. సీఎస్​కే మ్యాచ్​తో చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్​తో చిన్నస్వామి స్టేడియంలో 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు విరాట్. ఐపీఎల్ హిస్టరీలో ఒక వెన్యూలో 3 వేలు ప్లస్ పరుగులు చేసిన తొలి బ్యాటర్​గా కింగ్ నిలిచాడు. ఇప్పటిదాకా క్యాష్​ రిచ్ లీగ్ చరిత్రలో ఏ బ్యాటర్ కూడా ఇలా ఒకే వేదికలో ఇన్ని పరుగులు చేయలేదు. మరి.. కోహ్లీ అరుదైన ఘనతపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి