iDreamPost
android-app
ios-app

నంబర్ 18 మీదే RCB ఆశలన్నీ.. కానీ ఇది CSKకు కూడా వరమని తెలుసా?

  • Published May 18, 2024 | 3:05 PMUpdated May 18, 2024 | 3:05 PM

ఆర్సీబీ-సీఎస్​కే మధ్య డూ ఆర్ డై మ్యాచ్​కు అంతా రెడీ అయింది. దీంతో ఇప్పుడు అందరూ నంబర్ 18 గురించి మాట్లాడుకుంటున్నారు. బెంగళూరుకు ఇది లక్కీ నంబర్ కావడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ దీని మీదే ఆశలు పెట్టుకున్నారు.

ఆర్సీబీ-సీఎస్​కే మధ్య డూ ఆర్ డై మ్యాచ్​కు అంతా రెడీ అయింది. దీంతో ఇప్పుడు అందరూ నంబర్ 18 గురించి మాట్లాడుకుంటున్నారు. బెంగళూరుకు ఇది లక్కీ నంబర్ కావడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ దీని మీదే ఆశలు పెట్టుకున్నారు.

  • Published May 18, 2024 | 3:05 PMUpdated May 18, 2024 | 3:05 PM
నంబర్ 18 మీదే RCB ఆశలన్నీ.. కానీ ఇది CSKకు కూడా వరమని తెలుసా?

ఐపీఎల్​-2024లో మోస్ట్ అవేటింగ్ మ్యాచ్​కు అంతా రెడీ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మరికొన్ని గంటల్లో యుద్ధం మొదలవనుంది. ఐపీఎల్​ ప్లేఆఫ్స్, ఫైనల్స్​కు కూడా ఉండనంత హైప్ దీనికి ఉంది. కారణం ఇందులో గెలిచిన జట్టు తుది దశకు వెళ్తుంది. గ్రూప్ స్టేజ్ నుంచి వెళ్లిపోతుందనుకున్న దశ నుంచి ప్లేఆఫ్స్​ రేసులోకి దూసుకొచ్చింది ఆర్సీబీ. ఈజీగా నెక్స్ట్ స్టేజ్​కు క్వాలిఫై అవడం పక్కా అనుకున్న దశ నుంచి వరుస ఓటములతో డీలా పడింది రుతురాజ్ సేన. మళ్లీ కోలుకొని క్వాలిఫికేషన్ వైపు పరుగులు పెడుతోంది. ఈ తరుణంలో అందరూ నంబర్ 18 గురించి మాట్లాడుకుంటున్నారు.

నంబర్ 18.. బెంగళూరుకు ఇది లక్కీ నంబర్ కావడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ దీని మీదే ఆశలు పెట్టుకున్నారు. దీని గురించి తెగ డిస్కస్ చేస్తున్నారు. 2013, మే 18వ తేదీన సీఎస్​కేతో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ నెగ్గింది. తర్వాతి ఏడాది అదే నెల, ఆ రోజున మళ్లీ చెన్నైని ఓడించింది. 2016 మే 18న కింగ్స్ ఎలెవన్ పంజాబ్​ను చిత్తు చేసింది బెంగళూరు. గతేడాది ఇదే తేదీన సన్​రైజర్స్ హైదరాబాద్​ మీద నెగ్గింది. మే 18వ తేదీన ఏనాడూ ఓడిపోని రికార్డు ఆ జట్టుది. ఈ రోజున ఒకసారి హాఫ్ సెంచరీ, ఇంకోసారి సెంచరీ బాదాడు కోహ్లీ. ఇలా మే 18 అంటే చాలు.. విరాట్, ఆర్సీబీ చెలరేగిపోతాయి. దీంతో తమ గెలుపు పక్కా అని బెంగళూరు ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఇది ఆర్సీబీకే కాదు.. చెన్నైకి కూడా లక్కీ నంబర్ అని చాలా మందికి తెలియదు.

18 నంబర్​లోని రెండు అంకెల్ని తీసివేస్తే వచ్చేది 7. 8-1 చేస్తే ఏడు వస్తుంది. ఇది ధోని జెర్సీ నంబర్. మాహీ లక్కీ నంబర్, అతడి పుట్టిన తేదీ కూడా ఇదే. అందుకే సీఎస్​కే అభిమానులు కూడా తమకు ఈ నంబర్ కలిసొస్తుందని, ఇది చెన్నైకి వరమని అంటున్నారు. ఇవాళ తమదే విజయమని.. రుతురాజ్ సేనను ఆపడం ఎవరి వల్లా కాదని చెబుతున్నారు. తాము ప్లేఆఫ్స్​కే కాదు.. ఫైనల్​కు కూడా వెళ్లి కప్పు కొడతామని సీఎస్​కే ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరును తమ జట్టు చిత్తు చేయడం గ్యారెంటీ అని ఆశాభావం వ్యక్తం చేస్తన్నారు. మరి.. నంబర్ 18 సెంటిమెంట్ రెండింట్లో ఏ జట్టుకు కలిసొస్తుందని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి