iDreamPost

CSKను ఓడించిన ధోని.. ఒక్క తప్పుతో జట్టు కొంప ముంచాడు!

  • Published May 19, 2024 | 11:25 AMUpdated May 19, 2024 | 11:25 AM

ప్లేఆఫ్స్ చేరాలంటే నెగ్గి తీరాల్సిన మ్యాచ్​లో ఓడి బయటకు వెళ్లిపోయింది చెన్నై సూపర్​కింగ్స్. ఓ దశలో సీఎస్​కే విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ ఎంఎస్ ధోని చేసిన ఒక్క తప్పుతో ఆ టీమ్ పుట్టి మునిగింది.

ప్లేఆఫ్స్ చేరాలంటే నెగ్గి తీరాల్సిన మ్యాచ్​లో ఓడి బయటకు వెళ్లిపోయింది చెన్నై సూపర్​కింగ్స్. ఓ దశలో సీఎస్​కే విజయం దిశగా సాగుతున్నట్లు కనిపించింది. కానీ ఎంఎస్ ధోని చేసిన ఒక్క తప్పుతో ఆ టీమ్ పుట్టి మునిగింది.

  • Published May 19, 2024 | 11:25 AMUpdated May 19, 2024 | 11:25 AM
CSKను ఓడించిన ధోని.. ఒక్క తప్పుతో జట్టు కొంప ముంచాడు!

ప్లేఆఫ్స్ చేరాలంటే నెగ్గి తీరాల్సిన మ్యాచ్​లో ఆర్సీబీ చేతుల్లో ఓడి బయటకు వెళ్లిపోయింది చెన్నై సూపర్​కింగ్స్. చిన్నస్వామి స్టేడియం వేదికగా నిన్న జరిగిన ఉత్కంఠ పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన డుప్లెసిస్ సేన ఓవర్లన్నీ ఆడి 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. భారీ టార్గెట్​ను ఛేజ్ చేయడంలో విఫలమైన సీఎస్​కే.. ఓవర్లన్నీ ఆడి 7 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. ఈ ఓటమితో గ్రూప్ స్టేజ్ నుంచే రుతురాజ్ సేన బయటకు వచ్చేసింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్​లోకి దర్జాగా అడుగు పెట్టింది ఆర్సీబీ. ఈ మ్యాచ్​లో ఒక దశలో చెన్నైదే విజయమని అంతా అనుకున్నారు. కానీ ఆ టీమ్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని చేసిన ఒక్క మిస్టేక్ వల్ల అంతా తారుమారైంది.

భారీ స్కోరు ఛేజింగ్​లో చెన్నై తడబడింది. 13.4 ఓవర్లకు 119 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అప్పటికే రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నాడు. ఆ టైమ్​లో ధోని బ్యాటింగ్​కు దిగుతాడని అంతా భావించారు. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోనందున సీజన్ మొత్తం ఆఖర్లో బ్యాటింగ్​కు వస్తున్నాడు మాహీ. అయితే చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ కావడం, అప్పటికి టీమ్ కష్టాల్లో ఉండటం, తాను బ్యాటింగ్​కు దిగితే ఛేజింగ్ చేయడం సాధ్యమవుతుంది కాబట్టి ధోని వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ తాను రాకుండా స్పిన్ ఆల్​రౌండర్ మిచెల్ శాంట్నర్​కు పంపించాడు ధోని. అతడు వచ్చి 4 బంతులు ఆడి 3 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అప్పుడు బ్యాటింగ్​కు దిగాడు మాహీ. శాంట్నర్ ఔట్ అయ్యాక ఇంకా ప్రెజర్ పెరగడంతో కొన్ని బంతులు జడ్డూ, ధోని స్లోగా ఆడారు. దీంతో రిక్వైర్డ్ రన్ రేట్ మరింత పెరిగింది.

శాంట్నర్ ప్లేస్​లో ధోని బ్యాటింగ్​కు దిగి ఉంటే ఛేజింగ్ మరింత ఈజీ అయ్యేది. డాట్ బాల్స్ పడేవి కాదు. రిక్వైర్డ్ రన్ రేట్ కూడా కాస్త తగ్గేది. ఆఖర్లో 9 పరుగుల తేడాతో ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్​కు దూరంగా ఉండిపోయింది చెన్నై. ధోని ముందుగా బ్యాటింగ్​కు వచ్చి ఉంటే ఆ పరుగులు చేయడం పెద్ద లెక్కే కాదు. కఠిన పరిస్థితులు ఉన్నా, సీఎస్​కే ఓటమి దిశగా సాగుతున్నా మాహీ ఆలస్యంగా బ్యాటింగ్​కు వచ్చాడు. 13 బంతుల్లో 25 పరుగులు చేసి పెవిలియన్​కు చేరుకున్నాడు. అతడు ఉన్న ఫామ్​కు ముందు వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్​లో పైకి రాకుండా ధోని చేసిన ఈ తప్పే చెన్నై కొంప ముంచిందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. మరి.. ధోని లోయరార్డర్​లో రావడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి