Nidhan
ఆర్సీబీ-సీఎస్కే పోరు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే న్యూస్. ఇక వాళ్లందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఆర్సీబీ-సీఎస్కే పోరు కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అదిరిపోయే న్యూస్. ఇక వాళ్లందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
Nidhan
ఐపీఎల్-2024 ఫైనల్ మ్యాచ్‌కు ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లే పూర్తవలేదు. ఇవి జరగాలి, ఆ తర్వాత ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు.. ఆఖర్లో ఫైనల్ జరుగుతుంది. కానీ ఇవాళ బెంగళూరు, చెన్నై మధ్య జరిగే పోరుకు టైటిల్ ఫైట్ కంటే కూడా ఎక్కువ క్రేజ్ నెలకొంది. లీగ్‌లోని టాప్ టీమ్స్ మధ్య జరిగే మ్యాచ్ అవడం, ప్లేఆఫ్స్ క్వాలిఫికేషన్ నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాల్సి రావడంతో ఈ ఫైట్‌కు ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే వర్షం వల్ల అసలు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.
ఆర్సీబీ-సీఎస్కే మ్యాచ్‌కు సంబంధించిన బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ ఫైట్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు కర్ణాటక వెదర్ మ్యాన్ సూపర్ న్యూస్ చెప్పారు. ఇంకొన్ని నిమిషాల్లో మొదలయ్యే ఈ నాకౌట్ మ్యాచ్‌కు వాన ముప్పు లేదని తెలిపారు. ప్రస్తుతానికి వర్ష సూచనలు లేవని, రాత్రి వరకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని కర్ణాటక వెదర్ మ్యాన్ ట్వీట్ చేశారు. దీంతో అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. హమ్మయ్య.. ఇక నో టెన్షన్, మ్యాచ్‌ను ఎంజాయ్ చేయాల్సిందేనని ఫిక్స్ అయ్యారు. మరోవైపు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న చిన్నస్వామి స్టేడియం దగ్గర అభిమానుల కోలాహలం నెలకొంది.
#RCBvsCSK #RCBvCSK #RCB #CSK #BengaluruRains #BangaloreRains#IPL2024 match at Chinnaswamy Stadium, Bengaluru
In the last 45 minutes the sky has cleared up with sun peeping out & the covers of the outfield have been cleared in the stadium https://t.co/p8NmHrPY2M pic.twitter.com/ceWm6S6CTy
— Karnataka Weather (@Bnglrweatherman) May 18, 2024
CSK fans outside Chinnaswamy stadium. 🔥🤯 pic.twitter.com/zUWzYN8x08
— Johns. (@CricCrazyJohns) May 18, 2024