Somesekhar
దినేష్ కార్తిక్ పై సొంత జట్టు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే డీకేపై ఫ్యాన్స్ ఫైరింగ్ కు కారణం ఓటమి కాదు. మరింకేంటి? అని అనుకుంటున్నారా? ఆ కారణం తెలుసుకుందాం పదండి.
దినేష్ కార్తిక్ పై సొంత జట్టు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే డీకేపై ఫ్యాన్స్ ఫైరింగ్ కు కారణం ఓటమి కాదు. మరింకేంటి? అని అనుకుంటున్నారా? ఆ కారణం తెలుసుకుందాం పదండి.
Somesekhar
అట్టహాసంగా ప్రారంభమైన ఐపీఎల్ 2024 సీజన్ లో తొలి విజయాన్ని నమోదు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్. చెపాక్ వేదికగా ఆర్సీబీతో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది చెన్నై. దీంతో నిరాశలో కూరుకుపోయారు ఆర్సీబీ ఫ్యాన్స్. ఈ క్రమంలోనే దినేష్ కార్తిక్ పై ఫైర్ అవుతున్నారు సొంత టీమ్ ఫ్యాన్స్. అయితే అభిమానుల ఆగ్రహానికి ఓటమి కారణం కాదు. మరింకేంటి? అని అనుకుంటున్నారా? ఆ రీజన్ తెలుసుకుందాం పదండి.
దినేష్ కార్తిక్.. వరల్డ్ బెస్ట్ ఫినిషర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. చివర్లో వచ్చి మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి టీమ్ విజయాలు అందించడంలో సిద్ధహస్తుడు డీకే. ఇక ఈ సీజన్ లో ఆడిన తొలి మ్యాచ్ లో మాత్రం మెరుపులు మెరిపించలేదు కానీ.. ఓ మెస్తారు ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడికి తోడు యంగ్ ప్లేయర్ అనుజ్ రావత్ కేవలం 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 48 రన్స్ చేసి ఇన్నింగ్స్ చివరి బంతికి రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
అయితే ఈ మ్యాచ్ లో డీకే చేసిన ఓ పనికి ఆర్సీబీ ఫ్యాన్స్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందరూ మ్యాచ్ ఓడిపోయిందుకు అతడిని తిడుతున్నారని అనుకుంటున్నారు. కానీ రీజన్ వేరే ఉంది. ఇంతకీ ఆ కారణం ఏంటంటే? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ చివరి ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నారు అనుజ్ రావత్-డీకే. యువ ఆటగాడు అనుజ్ అద్భుతమై బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 25 బంతుల్లో 48 రన్స్ చేసి ఫిప్టీ కంప్లీట్ చేసుకోవాలని చూస్తున్నాడు. ఈ క్రమంలో చివరి ఓవర్ వేయడానికి వచ్చిన తుషార్ దేశ్ పాండే 5వ బంతిని వైడ్ గా సంధించాడు. అప్పుడు అవసరం లేకున్నా.. సింగిల్ కు పరిగెత్తుకు వచ్చాడు దినేష్ కార్తిక్. అదృష్టవశాత్తు రనౌట్ అయితే కాలేదు.
ఇక నెక్ట్స్ బాల్ ను ఫోర్ కొట్టిన డీకే.. ఇన్నింగ్స్ చివరి బాల్ ను మిస్ చేశాడు. ఆ బంతికి పరుగుతీద్దామని ప్రయత్నించారు. కానీ ధోని మెరుపువేగంతో అనూజ్ ను రనౌట్ చేశాయి. దీంతో ఫిఫ్టీకి 2 రన్స్ దూరంలో అవుట్ అయ్యాడు యంగ్ బ్యాటర్. కాగా.. వైడ్ కు డీకే అనవసరంగా సింగిల్ కు వచ్చాడు. అతడు రాకపోయి ఉంటే.. నెక్ట్స్ బాల్ కు అనూజ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకునేవాడే. కానీ డీకే అత్యుత్సాహంతో అతడి హాఫ్ సెంచరీని అడ్డుకున్నాడని ఆర్సీబీ ఫ్యాన్స్ అతడిపై ఫైర్ అవుతున్నారు. అనూజ్ కు ఛాన్స్ ఇచ్చి ఉంటే.. పాపం ఫిఫ్టీ పూర్తి చేసుకునేవాడు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ జోడీ ఆరో వికెట్ కు 50 బంతుల్లో 95 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అనూజ్ గతంలో రాజస్తాన్ రాయల్స్ టీమ్ కు ప్రాతినిథ్యం వహించాడు. మరి అనూజ్ విషయంలో డీకే చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
THE ANUJ RAWAT & DINESH KARTHIK SHOW AT CHEPAUK…!!!! 🔥
– They Made a brilliant comeback by RCB in death overs in this match. pic.twitter.com/g1dEHBfE52
— CricketMAN2 (@ImTanujSingh) March 22, 2024