కోహ్లీ-రోహిత్ కంటే విధ్వంసకర ఆటగాడు ఉన్నాడు.. మర్చిపోవద్దు: గవాస్కర్

కోహ్లీ-రోహిత్​ను మించిన విధ్వంసకర ఆటగాడు ఉన్నాడని అంటున్నాడు లెజెండ్ సునీల్ గవాస్కర్. అతడ్ని మర్చిపోవద్దని భారత సెలెక్టర్లను కోరాడు.

కోహ్లీ-రోహిత్​ను మించిన విధ్వంసకర ఆటగాడు ఉన్నాడని అంటున్నాడు లెజెండ్ సునీల్ గవాస్కర్. అతడ్ని మర్చిపోవద్దని భారత సెలెక్టర్లను కోరాడు.

ఈ ఏడాది జూన్​లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడంతా ఐపీఎల్-2024ను ఎంజాయ్ చేస్తున్నారు. క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ప్రపంచ కప్ హవావుడి మొదలైపోతుంది. ఇప్పటికే చాలా దేశాలు మెగా టోర్నీకి వెళ్లే తమ టీమ్ కాంబినేషన్స్ మీద డిసైడ్ అయిపోయాయి. త్వరలో స్క్వాడ్​లను ప్రకటించనున్నాయి. టీమిండియా విషయంలోనూ ఈ ప్రాసెస్ ఇప్పటికే మొదలైంది. టీమ్​లో ఎవరెవరు ఉండాలనే దానిపై సెలెక్టర్లు ఈపాటికే ఓ అంచనాకు వచ్చేశారు. అయితే తమ రాడార్​లో ఉన్న ప్లేయర్ల పెర్ఫార్మెన్స్​ను ఐపీఎల్-2024లో దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారని తెలిసింది. దీంతో సెలెక్టర్ల పరిధిలో లేని కొందరు యంగ్​స్టర్స్​ కూడా తమ ఆటతీరుతో వాళ్లను ఇంప్రెస్ చేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో భారత లెజెండ్ సునీల్ గవాస్కర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

డాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను మించిన ఓ విధ్వంసక బ్యాటర్ ఉన్నాడని గవాస్కర్ అన్నాడు. అతడ్ని మర్చిపోవద్దని సెలెక్టర్లకు సూచించాడు. ఆ ప్లేయరే రియాన్ పరాగ్. రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతూ దుమ్మురేపుతున్నాడు పరాగ్. ఆరెంజ్ క్యాప్ లిస్ట్​లో సెకండ్ ప్లేస్​లో ఉన్న ఈ యంగ్ బ్యాటర్ మీద గవాస్కర్ ప్రశంసల జల్లులు కురిపించాడు. పరాగ్ మీద సెలెక్షన్ కమిటీ ఓ కన్నేసి ఉంచాలన్నాడు. యంగ్ బ్యాటర్ తన పనిని తాను ఇలాగే చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించాడు. పరాగ్ తన బ్యాట్​కు పనిచెబుతూ దూసుకోవాలని ఆకాంక్షించాడు. కోహ్లీ, రోహిత్​ను మించిన విధ్వంసక ఇన్నింగ్స్​లు ఆడే సత్తా అతడికి ఉందని చెప్పుకొచ్చాడు.

పరాగ్ నమ్మశక్యం కాని రీతిలో బ్యాటింగ్ చేస్తున్నాడని గవాస్కర్ మెచ్చుకున్నాడు. ఐపీఎల్ మాత్రమే కాదు.. గత ఏడాది కాలంగా డొమెస్టిక్ క్రికెట్​లోనూ అతడు అద్భుతంగా ఆడుతున్నాడని తెలిపాడు. సెలెక్షన్ కమిటీ అతడి మీద ఓ కన్నేసి ఉంచాలని సూచించాడు. ఫీల్డింగ్​లోనూ రియాన్ తన టాలెంట్​ను ప్రూవ్ చేసుకుంటున్నాడని.. స్పిన్ బౌలింగ్​తో బ్రేక్ త్రూలు కూడా ఇచ్చే సత్తా కూడా అతడి సొంతమని పేర్కొన్నాడు. ఇక, ఈ ఐపీఎల్​లో ఆడిన 5 మ్యాచుల్లో 158 స్ట్రయిక్​ రేట్​తో 261 పరుగులు చేశాడు పరాగ్. ఆరెంజ్ క్యాప్ లిస్ట్​లో టాప్​లో ఉన్న విరాట్ కోహ్లీ (316) తర్వాతి స్థానంలో ఉన్నాడతను. మ్యాచ్​ మ్యాచ్​కు మరింత మెరుగవుతూ అందర్నీ ఇంప్రెస్ చేస్తున్నాడు. ఈ తరుణంలో పరాగ్ గురించి గవాస్కర్ పైవిధంగా కామెంట్స్ చేశాడు. త్వరలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సర్​ప్రైజ్ ప్యాకేజ్​గా పరాగ్​కు సెలెక్టర్లు ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. మరి.. పరాగ్ టీమిండియా ఎంట్రీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments