Nidhan
సీఎస్కే మ్యాచ్ ఉంటే ఎంఎస్ ధోని కోసం వచ్చే వాళ్లు ఎక్కువ. మాహీ బ్యాటింగ్ చూసేందుకే వేలాది మంది స్టేడియాలకు తరలి వస్తారనేది తెలిసిందే. వారిలో సెలబ్రిటీలు కూడా ఉంటారు. అలా వచ్చిన ఓ హీరోయిన్ మాహీ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు.
సీఎస్కే మ్యాచ్ ఉంటే ఎంఎస్ ధోని కోసం వచ్చే వాళ్లు ఎక్కువ. మాహీ బ్యాటింగ్ చూసేందుకే వేలాది మంది స్టేడియాలకు తరలి వస్తారనేది తెలిసిందే. వారిలో సెలబ్రిటీలు కూడా ఉంటారు. అలా వచ్చిన ఓ హీరోయిన్ మాహీ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు.
Nidhan
టీ20 అంటేనే ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్ లాంటిది. ఇక్కడ క్లాసికల్ షాట్స్ లేదా బుక్ క్రికెట్ ఆడేవాళ్లు తక్కువ. ధనాధన్ షాట్లు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తించడమే ధ్యేయంగా ఆడుతుంటారు. ఈ ఫార్మాట్లో ఎందరో గ్రేట్ బ్యాటర్లు ఉన్నారు. అయితే అందరిలోకెల్లా మహేంద్ర సింగ్ ధోని చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఆఖర్లో వస్తూ భారీ షాట్లు బాదడం అతడి ప్రత్యేకత. ఉన్నంత సేపు బిగ్ సిక్సెస్, బౌండరీస్తో విరుచుకుపడే మాహీ.. చూస్తుండగానే అవతలి జట్టు చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. బెస్ట్ ఫినిషర్‌గా పేరు మోసిన అతడి గేమ్‌ను చూసేందుకు వేలాది మంది స్టేడియాలకు పోటెత్తుతారు. నిన్న ముంబై ఇండియన్స్‌తో చెన్నై మ్యాచ్‌కూ ఇలాగే వచ్చారు. అందులో ఇద్దరు ఫిల్మ్ సెలబ్రిటీ కూడా ఉన్నారు. సీఎస్కే ఇన్నింగ్స్ టైమ్‌లో ధోని చివర్లో వచ్చి సిక్సులు బాదాడు. అది చూసి వాళ్లు నోరెళ్లబెట్టారు.
ముంబైతో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో బ్యాటింగ్‌కు దిగాడు ధోని. హార్దిక్ పాండ్యా వేసిన ఆ ఓవర్లో ఆడిన 4 బంతుల్లో 20 పరుగులు చేశాడు మాహీ. వరుసగా 3 సిక్సులు కొట్టిన సీఎస్కే బ్యాటర్.. చివరి బాల్‌కు డబుల్ తీశాడు. దీంతో 180 పరుగులు చేస్తుందనుకున్న చెన్నై కాస్తా 206 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ముంబై ఓవర్లన్నీ ఆడి 186 పరుగులే చేయగలిగింది. 20 పరుగుల తేడాతో ఎంఐ ఓడిపోయింది. ఆఖర్లో వచ్చి ధోని బాదిన రన్స్ కూడా అన్నే కావడం విశేషం. అయితే మాహీ వరుస సిక్సులకు వాంఖడే స్టేడియం దద్దరిల్లింది. ఆ సమయంలో స్టేడియంలో ఉన్న బాలీవుడ్ హీరోయిన్లు కరీనా కపూర్, నేహా ధూపియా ధోని బ్యాటింగ్ చూసి నోరెళ్లబెట్టారు.
ధోని షాట్‌కు ఆశ్చర్యపోయిన నేహా ధూపియా దాన్ని చూస్తూ నోరెళ్లబెట్టారు. పక్కనే కూర్చున్న కరీనా కూడా షాక్‌కు గురయ్యారు. నేహా ధూపియా నమ్మశక్యం కానట్లు చూస్తూ ఉండిపోగా.. కరీనా ఆ సీన్‌ను తన ఫోన్లో బంధించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ధోని షాట్ అంటే మజాకానా? అంటున్నారు. మాహీ తన బ్యాటింగ్‌తో హీరోయిన్లను కూడా నోరెళ్లబెట్టేలా చేశాడని.. అతడి బ్యాటింగ్‌కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందేనని కామెంట్స్ చేస్తున్నారు. వయసు మీద పడుతున్న కొద్దీ ధోని మరింత యంగ్ అవుతున్నాడని.. యంగ్ బ్యాటర్స్‌తో పోటీపడి భారీ షాట్లు బాదుతున్నాడని చెబుతున్నారు. మరి.. ముంబైతో మ్యాచ్‌లో మాహీ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Neha Dhupia’s reaction on MS Dhoni’s sixes. 💥 pic.twitter.com/4U8Ercv4i6
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2024