Nidhan
టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని అందరూ ఫియర్లెస్ క్రికెటర్ అని అంటుంటారు. డేరింగ్‌గా డిసిషన్స్ తీసుకుంటాడని చెబుతుంటారు. కానీ మాహీ మాత్రం తనకు భయం ఎక్కువని అంటున్నాడు.
టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనీని అందరూ ఫియర్లెస్ క్రికెటర్ అని అంటుంటారు. డేరింగ్‌గా డిసిషన్స్ తీసుకుంటాడని చెబుతుంటారు. కానీ మాహీ మాత్రం తనకు భయం ఎక్కువని అంటున్నాడు.
Nidhan
ఎంఎస్ ధోని.. ఈ పేరు చెప్పగానే అతడి కెప్టెన్సీనే అందరికీ గుర్తుకొస్తుంది. బ్యాటర్‌గా కూడా ఎన్నో అద్భుతమైన రికార్డులను తన పేరు మీద రాసుకున్నాడు మాహీ. అయితే అతడి సారథ్యానికే ఎక్కువ మార్కులు పడ్డాయి. భారత జట్టుకు 2 వరల్డ్ కప్స్ అందించడం, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ విజేతగా నిలపడంతో క్రికెట్ వరల్డ్‌లో అతడి పేరు మార్మోగిపోయింది. ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపి ఆల్‌టైమ్ గ్రేట్ కెప్టెన్స్‌లో ఒకడిగా నిలిచాడు మాహీ. కెప్టెన్‌గా దేనికీ భయపడకపోవడం, డేరింగ్ డిసిషన్స్ తీసుకోవడం వల్లే ఇవన్నీ అతడు సాధించాడని అంతా అంటుంటారు. అయితే ధోని మాత్రం తనకు భయం ఎక్కువన్నాడు. ఫియర్ వల్లే తాను ఈ స్టేజ్‌లో ఉన్నానని చెప్పాడు.
‘ఎవరికైనా సరే భయం ఉండటం చాలా ముఖ్యం. భయపడటం మంచిదే. ఫియర్ లేకపోతే నాలోని తెలివితేటలు బయటకు రావు. భయపడతా కాబట్టే నేను తెలివిగా, మరింత ధైర్యంగా ఉండగలుగుతున్నా. భయం, ఒత్తిడిని నేను ఆస్వాదిస్తా. నా మటుకు ఆ రెండూ ఉండటం చాలా ముఖ్యం. కరెక్ట్ డిసిషన్స్ తీసుకోవడంలో ఇవి నాకు ఉపయోగపడతాయి. నాకు భయం లేదని చాలా మంది అంటుంటారు. నేను ఫియర్లెస్నని అనుకుంటారు. కానీ నాకు భయం ఎక్కువే. అది లేకపోతే మనం నిర్లక్ష్యంగా ఉంటాం. భయం లేకపోతే మనం దేన్నీ గౌరవించం. ఇలాంటి విషయాలన్నీ వ్యక్తిగతంగా మెరుగవ్వడానికి ఎంతో ఉపయోగపడతాయి’ అని ధోని చెప్పుకొచ్చాడు. సీఎస్కే ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో అతడీ కామెంట్స్ చేశాడు.
ఇక, ఐపీఎల్-2024లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది చెన్నై సూపర్‌కింగ్స్. సీజన్ ఫస్టాఫ్‌లో వరుస విజయాలతో జోరు మీద కనిపించింది డిఫెండింగ్ ఛాంపియన్. దీంతో ఈసారి కూడా ఆ టీమ్‌దే కప్పు అని అంతా అనుకున్నారు. అయితే సెకండాఫ్‌లో సీన్ మారింది. గాయం కారణంగా కీలక ఆటగాళ్లు దూరమవడం, టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్స్ వల్ల మరికొందరు వెళ్లిపోవడంతో సీఎస్కే బలహీనపడింది. దీంతో ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. అయినా ఆఖర్లో పలు విజయాలతో రేసులోకి దూసుకొచ్చింది రుతురాజ్ సేన. కానీ నాకౌట్ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతుల్లో ఓడి ఇంటిదారి పట్టింది. మరోసారి సీఎస్‌ను గెలిపిస్తాడని లెజెండ్ ధోనీపై అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ మాహీ ఎంత పోరాడినా టీమ్‌ను కాపాడలేకపోయాడు.
When Dhoni speaks, everyone hears. 👌 pic.twitter.com/87iO3fGPYb
— Johns. (@CricCrazyJohns) May 23, 2024