iDreamPost

KKR సక్సెస్‌కి గంభీర్‌ ఒక్కడే కారణం కాదు.. అతన్ని మించిన శక్తి ఇంకోటి ఉంది!

  • Published May 23, 2024 | 5:52 PMUpdated May 27, 2024 | 11:18 AM

Chandrakant Pandit, KKR, IPL 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ను కప్పు కొట్టకుండా ఆపడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ టీమ్‌ అలా ఆడుతోంది. అయితే.. కేకేఆర్‌ ఈ రేంజ్‌లో స్ట్రాంగ్‌ అవ్వడానికి కారణం ఓ వ్యక్తి. అతను గంభీర్‌ కాదు. గంభీర్‌ను మించిన శక్తి. ఆ శక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Chandrakant Pandit, KKR, IPL 2024: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో కేకేఆర్‌ను కప్పు కొట్టకుండా ఆపడం కష్టంగానే కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ టీమ్‌ అలా ఆడుతోంది. అయితే.. కేకేఆర్‌ ఈ రేంజ్‌లో స్ట్రాంగ్‌ అవ్వడానికి కారణం ఓ వ్యక్తి. అతను గంభీర్‌ కాదు. గంభీర్‌ను మించిన శక్తి. ఆ శక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 23, 2024 | 5:52 PMUpdated May 27, 2024 | 11:18 AM
KKR సక్సెస్‌కి గంభీర్‌ ఒక్కడే కారణం కాదు.. అతన్ని మించిన శక్తి ఇంకోటి ఉంది!

ఐపీఎల్‌ 2024 ఛాంపియన్‌గా కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ నిలిచింది. ఒక తిరుగులేని శక్తిగా ఫైనల్‌కు దూసుకెళ్లింది.  14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, 3 పరాజయాలతో పాటు రెండు ఫలితం తేలని మ్యాచ్‌లతో మొత్తం 20 పాయింట్ల సాధించి.. టేబుల్‌ టేపర్‌గా ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించిన కేకేఆర్‌.. తొలి క్వాలిఫైయర్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి.. మూడో సారి ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. గతంలో 2012, 2014 సీజన్స్‌లో కూడా కేకేఆర్‌ గంభీర్‌ కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలిచింది.  అయితే.. కేకేఆర్‌ ఛాంపియన్‌గా నిలవడానికి కారణం గంభీర్‌ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, గంభీర్‌ను మించిన మరో శక్తి కేకేఆర్‌ను నడిపించింది. ఆ శక్తి పేరు చంద్రకాంత్‌ పండిట్‌. కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్రకాంత్‌ ట్రాక్‌ రికార్డ్‌ తెలిస్తే.. వామ్మో గంభీర్‌ని మించిన మాస్టర్‌ మైండ్‌ అని అనాల్సిందే.

ఐపీఎల్‌ 2024 కోసం చంద్రకాంత్‌ పండిట్‌.. కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌గా నియమింతులు అయ్యారు. అలాగే.. గంభీర్‌ సైతం మెంటర్‌గా బాధ్యతలు చేపట్టాడు. ప్రస్తుతం కేకేఆర్‌ కనబరుస్తున్న ప్రదర్శన, సక్సెస్‌లో గంభీర్‌కు కచ్చితంగా భాగం ఉంటుంది. కానీ, అతన్ని మించి చంద్రకాంత్‌ పండిట్‌ టీమ్‌ను తీర్చిదిద్దుతున్నాడు. 1961 సెప్టెంబర్‌ 30న జన్మించిన చంద్రకాంత్ పండిట్‌ పూర్తి పేరు.. చంద్రకాంత్‌ సీతారాం పండిట్. 1986 నుంచి 1992 వరకు టీమిండియా తరఫున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, 36 వన్డేలు ఆడాడు. చంద్రకాంత్‌ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ . 1986 ఏప్రిల్ 10న షార్జాలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో చంద్రకాంత్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 1986 జూన్ 19న ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుతో సంప్రదాయల క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

Gabhir

క్రికెట్‌గా రిటైర్‌ అయిపోయిన తర్వాత.. చంద్రకాంత్‌ పండిట్‌ కోచ్‌గా తన సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఆల్మా మేటర్ హన్స్‌రాజ్ మొరార్జీ పబ్లిక్ స్కూల్‌లో తన క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు. రంజీ క్రికెట్‌లో కోచ్‌గా చంద్రకాంత్‌కు తిరుగులేని రికార్డ్ ఉంది. 2002, 2003, 2015, 2016 సీజన్స్‌లో ముంబై జట్టు చంద్రకాంత్‌ కోచింగ్‌లోనే రంజీ ఛాంపియన్‌గా అవతరించింది. అలాగే విదర్భను 2018, 2019 సీజన్స్‌లో రంజీ ఛాంపియన్‌గా నిలిపాడు చంద్రకాంత్‌. చంద్రకాంత్‌ కోచింగ్‌లోనే మధ్యప్రదేశ్‌ 2022లో రంజీ గెలిచింది. ఇలా కోచ్‌గా రంజీల్లో చంద్రకాంత్‌కు ఉన్న ట్రాక్‌ రికార్డును గుర్తించిన కేకేఆర్‌.. ఆయనను ఐపీఎల్‌ 2023లో హెడ్ కోచ్‌గా నియమించింది. ఇప్పుడు ఆయన కోచింగ్‌లోనే కేకేఆర్‌ ఐపీఎల్‌ 2024 ఛాంపియన్‌గా నిలిచింది. మరి కేకేఆర్‌ సక్సెస్‌లో చంద్రకాంత్‌ పాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి