Nidhan
పించ్ హిట్టింగ్తో బౌలర్లకు పీడకలగా మారాడు సూర్యకుమార్ యాదవ్. అతడికి ఎలా బౌలింగ్ చేయాలో తెలియక టాప్ బౌలర్స్ కూడా గుడ్లు తేలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటోడికి ఓ బౌలర్ అంటే చచ్చేంత భయమట.
పించ్ హిట్టింగ్తో బౌలర్లకు పీడకలగా మారాడు సూర్యకుమార్ యాదవ్. అతడికి ఎలా బౌలింగ్ చేయాలో తెలియక టాప్ బౌలర్స్ కూడా గుడ్లు తేలేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటోడికి ఓ బౌలర్ అంటే చచ్చేంత భయమట.
Nidhan
సూర్యకుమార్ యాదవ్.. ఈ పేరు వింటే ఎంతటి బౌలర్లు అయినా వణుకుతారు. క్రికెట్ బుక్‌లోని అన్ని షాట్స్‌ను ఆడే నైపుణ్యం కలిగిన మిస్టర్ 360.. ఇంకొన్ని వైవిధ్యమైన షాట్లతోనూ ఆకట్టుకుంటున్నాడు. తనకు మాత్రమే సాధ్యమైన సుప్లా షాట్‌తో మంచి బంతుల్ని కూడా బౌండరీలు, సిక్సులుగా మలచడం సూర్య భాయ్ స్టైల్. క్రీజులోకి వచ్చిందే ఆలస్యం దొరికిన బాల్‌ను దొరికినట్లు స్టాండ్స్‌లోకి పంపిస్తూ ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా మారాడు స్కై. గాయం తర్వాత రీఎంట్రీలో ఆడిన రెండో మ్యాచ్‌లోనే ఆర్సీబీ మీద విరుచుకుపడ్డాడు. 19 బంతుల్లోనే 52 పరుగుల విధ్వంసక ఇన్నింగ్స్‌తో పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అలాంటోడు ఓ బౌలర్ అంటే తనకు చచ్చేంత భయమని అన్నాడు.
టాప్ బౌలర్లను కూడా ఓ ఆటాడుకునే సూర్యకుమార్ యాదవ్‌కు ఒక పేసర్‌ను చూస్తే వణుకు పుడుతుందట. అతడి బౌలింగ్‌లో ఆడాలంటేనే వెనుకంజ వేస్తాడట. ఎక్కడ కాలు విరగ్గొడతాడోనని టెన్షన్ పడతాడట. మిస్టర్ 360ని అంతగా భయపడెతున్న ఆ బౌలర్ మరెవరో కాదు.. పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా. ఇప్పటికే పలుమార్లు నెట్స్‌లో బుమ్రా వేసిన బంతులకు తన కాలి పాదానికి గాయాలు అయ్యాయని సూర్య తెలిపాడు. ఆర్సీబీతో మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో మాట్లాడిన ఈ స్టార్ బ్యాటర్ బుమ్రా పెర్ఫార్మెన్స్ను మెచ్చుకున్నాడు. అలాంటి బౌలర్ తమ టీమ్‌లో ఉండటం అదృష్టమని చెప్పాడు. అయితే గత 2 నుంచి 3 ఏళ్లుగా బుమ్రా బౌలింగ్‌లో ఆడటమే మానేశానని తెలిపాడు. బ్యాట్ లేదా కాలు విరగ్గొడతాడేమోననే భయమే దీనికి కారణమని పేర్కొన్నాడు.
బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం కష్టమని.. మరీ ముఖ్యంగా అతడి యార్కర్లను ఎదుర్కోవడం అసాధ్యమన్నాడు సూర్యకుమార్. దీనిపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. వరల్డ్ నంబర్ వన్ టీ20 బ్యాటర్ అయిన సూర్యనే ఇలా అంటున్నాడంటే.. బుమ్రా బౌలింగ్‌లో మిగతా బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక, ఆర్సీబీతో మ్యాచ్‌లో అటు బౌలింగ్‌లో బుమ్రా, ఇటు బ్యాటింగ్‌లో సూర్యకుమార్ రఫ్ఫాడించారు. 4 ఓవర్లు వేసిన పేసుగుర్రం 21 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు మహిపాల్ లోమ్రోర్, సౌరవ్ చౌహాన్, వైశాఖ్ విజయ్ కుమార్‌ను అతడు ఔట్ చేశాడు. కాగా, ముంబై ఇన్నింగ్స్‌లో సూర్య బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. 19 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 52 పరుగులు చేశాడతను. మరి.. బుమ్రా బౌలింగ్ అంటే భయమంటూ సూర్య చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Welcome back, Suryakumar Yadav. pic.twitter.com/XoqgvL5Q4f
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024
🗣️ “It is always good to have Jasprit Bumrah by your side. It has been 2 to 3 years, have never batted Jasprit in the nets. Either he breaks my bat or my foot.”
said Suryakumar Yadav pic.twitter.com/GUiLkb8Ssj
— Mumbai Indians FC (@MIPaltanFamily) April 12, 2024