Nidhan
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నిఖార్సయిన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.
పేసుగుర్రం జస్ప్రీత్ బుమ్రా ఆర్సీబీ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. నిఖార్సయిన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు.
Nidhan
జస్ప్రీత్ బుమ్రా.. ఈ పేరు వింటే టాప్ బ్యాటర్స్ కూడా వణుకుతారు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కోలేక బ్యాట్లు ఎత్తేసిన వాళ్లు ఎందరో ఉన్నారు. యార్కర్లు, ఇన్‌స్వింగ్, ఔట్‌స్వింగ్, బౌన్సర్, స్లో డెలివరీస్, రివర్స్ స్వింగ్.. ఇలా అతడి అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలెన్నో. బుమ్రా గనుక బంతి పట్టుకొని బౌలింగ్‌కు దిగాడా ఎంతటి బ్యాటర్‌కైనా చెమటలు పట్టాల్సిందే. ఇదే ఆర్సీబీతో నిన్నటి మ్యాచ్‌లోనూ రిపీట్ అయింది. విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ సహా బెంగళూరు బ్యాటర్లను బెంబేలెత్తించాడీ పేసుగుర్రం. బ్యాటింగ్‌కు సహకరించే పిచ్ మీద 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకున్నాడు బుమ్రా. దీంతో అందరూ అతడ్ని అభినందిస్తున్నారు. అయితే నిన్నటి మ్యాచ్‌లో లైవ్‌లో చాలా మంది ఆడియెన్స్ ఓ బ్యూటిఫుల్ మూమెంట్‌ను మిస్సయ్యారు.
బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్ మీద నిప్పులు చెరిగే బంతులతో బుమ్రా చెలరేగడాన్ని చూసి అందరూ షాకయ్యారు. టీ20 మ్యాచ్‌లో ఫ్లాట్ వికెట్లో ఇలాంటి బౌలింగ్‌ను ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అతడి బౌలింగ్ స్పెల్‌ను చూస్తూ ఉండిపోయారు అభిమానులు. అయితే ఈ మ్యాచ్ ముగిశాక ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు కూడా బుమ్రాను మెచ్చుకున్నారు. ముఖ్యంగా ఆర్సీబీ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ అతడ్ని ప్రశంసల్లో ముంచెత్తాడు. అంతేగాక అద్భుతమైన ప్రదర్శనకు గానూ బుమ్రా ముందు తల వంచి నమస్కరించాడు సిరాజ్. నీ బౌలింగ్ సూపర్బ్ అంటూ అభినందించాడు. ఈ ఊహించని చర్యకు షాకైన బుమ్రా.. వెంటనే తేరుకొని అతడ్ని హగ్ చేసుకున్నాడు. ఆ సమయంలో ముంబై-ఆర్సీబీ ప్లేయర్లు అంతా అక్కడే ఉన్నారు.
బుమ్రాను సిరాజ్ గౌరవించిన తీరు, అభినందించిన విధానం మీద సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఈ ఒక్క సీన్‌తో బుమ్రా విలువ ఏంటో చెప్పొచ్చని అంటున్నారు. వరల్డ్ క్రికెట్లో అతడ్ని మించిన పేసర్ లేడని కామెంట్స్ చేస్తున్నారు. బుమ్రాతో కలసి టీమిండియాకు ఆడుతున్నప్పటికీ, తాను కూడా స్టార్ బౌలరే అయినప్పటికీ ఎలాంటి ఈగో లేకుండా అతడ్ని సిరాజ్ ప్రశంసించిన తీరు అద్భుతమని చెబుతున్నారు. ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చెప్పేందుకు ఈ సీన్ ఒక ఎగ్జాంపుల్ అని అంటున్నారు. ఇక, ఆర్సీబీ మీద 5 వికెట్లు తీసిన బుమ్రా.. మొత్తంగా ఐదు మ్యాచుల్లో 10 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు. మరి.. బుమ్రాను సిరాజ్ మెచ్చుకున్న తీరుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
– Rohit and Bumrah handshake. 🤝
– Virat Kohli hugging Hardik. 🫂
– Siraj bowed down to Bumrah. 🙇♂️MI DEFEATED RCB IN MUMBAI. 💥 pic.twitter.com/UCAMxQRjaS
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 11, 2024