iDreamPost
android-app
ios-app

ఇషాన్.. నీ ఆటకో దండం, ఇలా ఆడితే టీమిండియాలోకి వస్తావా?

  • Published Mar 25, 2024 | 4:04 PM Updated Updated Mar 25, 2024 | 4:04 PM

ఇషాన్ కిషన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో డకౌట్ కావడంతో.. తమ నోటికి పనిచెప్పారు. ఈ ఆటకే ఇంత పొగరా? అంటూ కడిగిపారేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇషాన్ కిషన్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు నెటిజన్లు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో డకౌట్ కావడంతో.. తమ నోటికి పనిచెప్పారు. ఈ ఆటకే ఇంత పొగరా? అంటూ కడిగిపారేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇషాన్.. నీ ఆటకో దండం, ఇలా ఆడితే టీమిండియాలోకి వస్తావా?

ఐపీఎల్ 2024 సీజన్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ కేవలం 6 పరుగుల తేడాతో పటిష్ట ముంబై ఇండియన్స్ టీమ్ ను చిత్తుచేసింది. ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురుచూశారు. దానికి కారణం మనందరికి తెలిసిందే. హార్దిక్ పాండ్యా-రోహిత్ శర్మ మధ్య కోల్డ్ వార్ ఎలా నడుస్తుందో చూద్దామని వారు ఆత్రుతగా ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు తగ్గట్లే ఇద్దరి మధ్య కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ జరిగాయి. వీటన్నింటి మధ్య ఓ ఆటగాడి వైఫల్యాన్ని ప్రేక్షకులు మర్చిపోయారు. కానీ నెటిజన్లు మాత్రం గుర్తుపెట్టుకోవడమే కాక.. గట్టిగా ట్రోల్స్ చేస్తున్నారు. అతడెవరో కాదు.. పాకెట్ డైనమెట్ గా టీమిండియాలో పేరుగాంచిన ఇషాన్ కిషన్.

ఇషాన్ కిషన్.. మానసిక ఒత్తిడి కారణంగా దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా వెనుదిరిగాడు. ఇషాన్ పరిస్థితిని అర్ధం చేసుకున్న బీసీసీఐ అతడికి కావాల్సినంత రెస్ట్ ఇచ్చింది. కానీ దాన్ని నిరుపయోగం చేసుకున్నాడు. రెస్ట్ తీసుకోకుండా.. దుబాయ్ లో పార్టీలో ధోని, పంత్ తో కలిసి కనిపించాడు. దీంతో బీసీసీఐకి చిర్రెత్తుకొచ్చింది. జట్టులో చోటు కోల్పోవడమే కాక.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి కూడా తొలగించింది. అదీకాక డొమెస్టిక్ క్రికెట్ లో ఆడాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఎట్టకేలకు దిగొచ్చి డీవై పాటిల్ టీ20 కప్ లో ఆడాడు ఇషాన్. ఇలాంటి పరిస్థితుల మధ్య ఐపీఎల్ లో తొలి మ్యాచ్ లో బరిలోకి దిగాడు. టీమ్ లో చోటు లేకపోవడం, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోవడం లాంటి ఒత్తిడుల మధ్య చిత్తైపోయాడు ఈ చిచ్చరపిడుగు.

లాంగ్ గ్యాప్ తర్వాత ఓపెనర్ గా బరిలోకి దిగిన ఇషాన్ 4 బంతులు ఎదుర్కొని డకౌట్ గా వెనుదిరిగాడు. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్ లో కీపర్ కు క్యాచ్ ఇచ్చి.. తొలి ఓవర్ లోనే పెవిలియన్ చేరాడు. ఇక అంతే సంగతులు ఓ రేంజ్ లో ఆటాడుకుంటున్నారు నెటిజన్లు. ఇప్పటికే టీమిండియాలో చోటు, సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయావు.. ఇలాగే ఆడితే, నీ జన్మలో కూడా ఇండియా టీమ్ లోకి రాలేవు అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. ఈ మాత్రం నీ ఆటకో దండం.. దీనికే ఇంత పొగరా? అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నాడు ఇషాన్. అందుకే ఇలా తొలి మ్యాచ్ లో దారుణంగా విఫలం అయ్యాడని క్రీడా నిఫుణులు విశ్లేషిస్తున్నారు. మరి ఇషాన్ డకౌట్ అయిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: హార్దిక్ పాండ్యా తెలివితక్కువ నిర్ణయం! నిన్న మ్యాచ్ లో పెద్ద పొరపాటు ఇదే!