iDreamPost
android-app
ios-app

మయాంక్​ను గెలికిన స్మిత్.. ఇక ఆసీస్​ను పోయించే దాకా వదలడు!

  • Published Apr 03, 2024 | 1:36 PM Updated Updated Apr 03, 2024 | 1:36 PM

రెండే రెండు మ్యాచులతో ఫేస్ ఆఫ్ ది ఐపీఎల్​గా మారిపోయాడు మయాంక్ యాదవ్. పదునైన పేస్​తో బ్యాటర్లను వణికిస్తున్నాడీ లక్నో ఎక్స్​ప్రెస్​. అలాంటోడ్ని గెలికాడు ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్.

రెండే రెండు మ్యాచులతో ఫేస్ ఆఫ్ ది ఐపీఎల్​గా మారిపోయాడు మయాంక్ యాదవ్. పదునైన పేస్​తో బ్యాటర్లను వణికిస్తున్నాడీ లక్నో ఎక్స్​ప్రెస్​. అలాంటోడ్ని గెలికాడు ఆసీస్ స్టార్ స్టీవ్ స్మిత్.

  • Published Apr 03, 2024 | 1:36 PMUpdated Apr 03, 2024 | 1:36 PM
మయాంక్​ను గెలికిన స్మిత్.. ఇక ఆసీస్​ను పోయించే దాకా వదలడు!

మయాంక్ యాదవ్.. ఐపీఎల్​లో బ్యాటర్లు అందర్నీ భయపెడుతున్న బౌలర్. ఆడిన రెండు మ్యాచుల్లో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పేస్ బౌలింగ్​కు కొత్త డెఫినిషన్ ఇస్తున్నాడు మయాంక్. ఒక బాల్ లేదా ఒక ఓవర్ కాదు.. స్పెల్ మొత్తం 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో నిలకడగా బంతుల్ని సంధిస్తూ బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతున్నాడు. స్పీడ్​ను తట్టుకోవడమే కష్టం అంటే.. పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​ను పట్టుకొని బౌలింగ్ చేస్తుండటంతో ధావన్, బెయిర్​ స్టో, మాక్స్​వెల్, గ్రీన్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు కూడా అతడ్ని ఎదుర్కోలేకపోయారు. అలాంటోడ్ని ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ గెలికాడు. అసలు మయాంక్​ను ఉద్దేశించి స్మిత్ ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ ఏడాది ఆఖర్లో భారత్-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో మయాంక్​ ఆ టోర్నీలో ఆడాలని స్మిత్ అన్నాడు. అతడి బౌలింగ్​ను ఫేస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గెలికాడు. ఐపీఎల్​లో మయాంక్ బౌలింగ్ వేస్తున్న తీరు అద్భుతంగా ఉందని మెచ్చుకున్నాడు స్మిత్. అతడు మంచి ఏరియాల్లో బంతుల్ని హిట్ చేస్తున్నాడని, షార్ట్ బాల్స్​ వేయడంలోనూ ఆరితేరాడని ప్రశంసించాడు. అయితే అంత కచ్చితత్వంతో మంచి ఏరియాల్లో నిలకడగా బంతులు సంధించడం ఈజీ కాదని.. కానీ మయాంక్ సుసాధ్యమని నిరూపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు స్మిత్. 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేసే బౌలర్​ను ఎదుర్కోవాలంటే మంచి బంతులకు కూడా రిస్క్ తీసుకోక తప్పదని.. కానీ ఇది చాలా కష్టమైన పని అని పేర్కొన్నాడు.

మయాంక్​ను ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నానంటూ స్మిత్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అతడ్ని రెచ్చగొట్టొద్దని.. ఇక, ఆసీస్​ను పోయించే దాకా వదలడని కామెంట్స్ చేస్తున్నారు. మయాంక్ జోరు మీదున్నాడని బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే కాదు.. త్వరలో జరిగే టీ20 ప్రపంచ కప్​లోనూ అతడు కంగారూల మీద విరుచుకుపడటం ఖాయమని చెబుతున్నారు. కాగా, స్మిత్​ కామెంట్స్ కంటే ముందే మయాంక్ గురించి అతడ్ని హెచ్చరించాడు ఇంగ్లండ్ లెజెండ్ స్టువర్ట్ బ్రాడ్. అతడి పేస్, లైన్ అండ్ లెంగ్త్​, బాల్​పై కంట్రోల్ చాలా గొప్పగా ఉన్నాయని మెచ్చుకున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతడి బౌలింగ్ నుంచి స్మిత్​తో పాటు మిగిలిన ఆసీస్ బ్యాటర్లు జాగ్రత్తగా ఉండాల్సిందేనని సూచించాడు బ్రాడ్. మరి.. మయాంక్​ను స్మిత్ ఆపగలడా? ఈ విషయం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: అతనికి విరాట్‌ కోహ్లీ వికెట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు! ఎవరీ సిద్థార్ధ్‌?