గెలుపు జోష్​లో ఉన్న లక్నోకు ఊహించని షాక్.. ఇక నెగ్గడం కష్టమే!

గెలుపు జోష్​లో ఉంది లక్నో సూపర్ జియాంట్స్. గుజరాత్ టైటాన్స్​పై నెగ్గిన ఆనందంతో మిగిలిన మ్యాచ్​లకు సిద్ధమవుతోంది. అయితే ఆ టీమ్​కు ఊహించని షాక్ తగిలింది.

గెలుపు జోష్​లో ఉంది లక్నో సూపర్ జియాంట్స్. గుజరాత్ టైటాన్స్​పై నెగ్గిన ఆనందంతో మిగిలిన మ్యాచ్​లకు సిద్ధమవుతోంది. అయితే ఆ టీమ్​కు ఊహించని షాక్ తగిలింది.

లక్నో సూపర్ జియాంట్స్ వరుస విజయాలతో ఫుల్ జోష్​లో ఉంది. రాహుల్ సేన హ్యాట్రిక్ విక్టరీస్​తో ఐపీఎల్-2024లో దూసుకుపోతోంది. ఫస్ట్ మ్యాచ్​లో ఓటమి ఎదురైనా దాని నుంచి త్వరగా కోలుకొని సక్సెస్ ట్రాక్ పట్టేసింది లక్నో. గుజరాత్ టైటాన్స్​తో నిన్న జరిగిన మ్యాచ్​లో 33 పరుగుల తేడాతో నెగ్గింది. ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్​లో 3వ స్థానానికి ఎగబాకింది. జీటీతో మ్యాచ్​లో ఎల్​ఎస్​జీ నెగ్గడం కష్టమేనని అంతా అనుకున్నారు. ఎందుకంటే టార్గెట్ 163నే ఉండటంతో ఓటమి తప్పదని భావించారు. కానీ లో స్కోర్​ను కూడా రాహుల్ సేన అద్భుతంగా డిఫెండ్ చేసి విజయం సాధించింది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో రెడ్ హాట్ ఫామ్​లో ఉన్న లక్నోకు ఊహించని షాక్ తగిలింది.

లక్నో ఎక్స్​ప్రెస్ మయాంక్ యాదవ్ నెక్స్ట్ మ్యాచ్​కు దూరమయ్యాడని తెలుస్తోంది. గుజరాత్​తో మ్యాచ్​లో అతడు గాయపడ్డాడు. ఇంజ్యురీ కారణంగా ఒక ఓవర్ వేశాక అతడు గ్రౌండ్​ను వీడాడు. పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న పేసర్.. మళ్లీ ఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నారు. కానీ గాయం మానకపోవడంతో అతడు తిరిగి మైదానంలోకి అడుగు పెట్టలేదు. డాక్టర్స్ అతడికి ట్రీట్​మెంట్ అందించారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మయాంక్ ఇంకా కోలుకోలేదట. తర్వాతి మ్యాచ్​కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. మయాంక్ తనతో మాట్లాడాడని, బాగానే ఉన్నట్లు అనిపించిందని లక్నో ఆల్​రౌండర్ కృనాల్ పాండ్యా తెలిపాడు. అయితే మయాంక్ ఇంజ్యురీ, అవేలబిలిటీ మీద టీమ్ మేనేజ్​మెంట్ నుంచి ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.

నెక్స్ట్ మ్యాచ్​కు మయాంక్ అందుబాటులో ఉండకపోవచ్చనే వార్తలు లక్నో అభిమానులను భయపెడుతున్నాయి. 150కి పైగా స్పీడ్​తో నిలకడగా బంతులు వేస్తూ తొలి రెండు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్​గా నిలిచాడు మయాంక్. అతడు లేకపోతే టీమ్ గెలుపు మీద తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం మయాంక్​కు రెస్ట్ ఇవ్వాలని, కంప్లీట్​ ఫిట్ అయ్యాక బరిలోకి దింపాలని సూచిస్తున్నారు. ఒకవేళ గాయం తిరగబెడితే ప్లేఆఫ్స్ టైమ్​లో పెద్ద సమస్యగా మారుతుందని అంటున్నారు. దీంతో మయాంక్ విషయంలో లక్నో మేనేజ్​మెంట్ ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది. ఏదేమైనా అతడి రికవరీ, కమ్​బ్యాక్​పై ఫ్రాంచైజీ అఫీషియల్​గా రియాక్ట్ అయ్యే వరకు ఏదీ చెప్పలేం.

Show comments