Nidhan
చేజారిందనుకున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆ టీమ్ విజయానికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
చేజారిందనుకున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జియాంట్స్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆ టీమ్ విజయానికి గల 5 కారణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
Nidhan
మరో సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌కు ఐపీఎల్-2024 వేదికగా నిలిచింది. గెలుపు ఖాయం అనుకున్న టీమ్ ఓటమి మూటగట్టుకుంది. చేజేతులా ఓడిపోయింది. మ్యాచ్ పోయిందని అనుకున్న టైమ్‌లో ఓ ప్లేయర్ చేసిన మ్యాజిక్ వల్ల మరో టీమ్ విక్టరీ కొట్టింది. అదే లక్నో సూపర్ జియాంట్స్‌కు పంజాబ్ కింగ్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ ఓవర్లన్నీ ఆడి 5 వికెట్లకు 178 పరుగులే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో విజయానికి గల 5 ప్రధాన కారణాలు ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 199 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (38 బంతుల్లో 54) తిరిగి ఫామ్‌ను అందుకున్నాడు. కొత్త కెప్టెన్ నికోలస్ పూరన్ (21 బంతుల్లో 42) మెరుపు బ్యాటింగ్‌తో అలరించాడు. ఉన్నంత సేపు బౌండరీలు, సిక్సులతో పంజాబ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఆఖర్లో కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 43 నాటౌట్) కూడా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతడి వల్లే స్కోరు 200కు చేరువైంది. దీంతో ఛేజింగ్‌కు దిగిన పంజాబ్ మీద ఒత్తిడి మొదలైంది.
ఈ మ్యాచ్‌లో లక్నో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కూడా ఆకట్టుకుంది. మొదటి 10 ఓవర్ల వరకు ఆ టీమ్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చుకున్నారు. అయితే ఆ తర్వాత కొత్త బౌలర్ మయాంక్ యాదవ్ ఫాస్టెస్ట్ డెలివరీస్‌తో పంజాబ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. దీంతో మిగిలిన బౌలర్లు కూడా పుంజుకున్నారు. డాట్ బాల్స్‌తో ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి పెంచారు. మయాంక్ 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. మోసిన్ ఖాన్ 2 వికెట్లతో అతడికి మంచి సహకారం అందించాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో విజయానికి ప్రధాన కారణం స్పీడ్‌స్టర్ మయాంక్. 150 కిలోమీటర్లకు తగ్గని వేగంతో నిలకడగా బంతులు వేస్తూ పంజాబ్ బ్యాటర్లకు ఓ రేంజ్లో పోయించాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు బెయిర్‌స్టో లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ కూడా భయపడ్డాడు. బెయిర్‌స్టో, ప్రభుసిమ్రన్ సింగ్, జితేష్ శర్మను ఔట్ చేసి మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పాడు మయాంక్. 11 ఓవర్లకు 102 స్కోరుతో ఉన్న పంజాబ్.. ఓవర్లన్నీ ముగిసేసరికి విజయానికి 21 పరుగుల దూరంలో ఆగిపోయింది. దానికి ప్రధాన కారణం మయాంక్ వేసిన అద్భుతమైన స్పెల్ అనే చెప్పాలి.
గాయం తర్వాత కమ్‌బ్యాక్ ఇస్తున్న రెగ్యులర్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు రెస్ట్ ఇచ్చే ఉద్దేశంతో అతడ్ని బ్యాటింగ్‌కే పరిమితం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించారు. అతడి ప్లేస్‌లో నికోలస్ పూరన్ కెప్టెన్ అవతారం ఎత్తాడు. బ్యాటింగ్‌లో 42 పరుగులతో అదరగొట్టిన పూరన్.. ఆ తర్వాత బౌలింగ్ ఛేంజెస్, ఫీల్డింగ్ పొజిషన్స్తోనూ ఆకట్టుకున్నాడు. కొత్త బౌలర్ మయాంక్‌ను అతడు వాడుకున్న తీరు బాగుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గడం లక్నోకు కలిసొచ్చింది. టాస్ గెలిచాక బ్యాటింగ్ ఎంచుకొని భారీ స్కోరు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగారు కాబట్టి వాళ్ల మీద అంత ప్రెజర్ లేదు. అదే ఒకవేళ ఛేజింగ్ చేయాల్సి వస్తే ఇబ్బంది పడేవాళ్లు.
LSG BEATS PUNJAB KINGS IN LUCKNOW…!!!! pic.twitter.com/VFigo4QtVk
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 30, 2024