iDreamPost
android-app
ios-app

LSG vs MI: పూరన్ క్రేజీ రికార్డ్.. IPL హిస్టరీలోనే ఫస్ట్ ప్లేయర్​గా..!

  • Published May 17, 2024 | 9:40 PM Updated Updated May 17, 2024 | 9:40 PM

లక్నో పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ మాస్ హిట్టింగ్​తో రెచ్చిపోయాడు. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు.

లక్నో పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ మాస్ హిట్టింగ్​తో రెచ్చిపోయాడు. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ముంబై బౌలర్లను ఊచకోత కోశాడు.

  • Published May 17, 2024 | 9:40 PMUpdated May 17, 2024 | 9:40 PM
LSG vs MI: పూరన్ క్రేజీ రికార్డ్.. IPL హిస్టరీలోనే ఫస్ట్ ప్లేయర్​గా..!

లక్నో సూపర్ జెయింట్స్ పించ్ హిట్టర్ నికోలస్ పూరన్ మాస్ బ్యాటింగ్​తో రెచ్చిపోయాడు. సిక్సులు కొట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ముంబై ఇండియన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. వాంఖడే స్టేడియంలో మినీ సునామీని సృష్టించాడు. 19 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ మార్క్​ను చేరుకున్నాడు పూరన్. మొత్తంగా 29 బంతుల్లో 75 పరుగులు చేశాడు. ఇందులో 5 బౌండరీలతో పాటు 8 భారీ సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్​తో ఓ అరుదైన ఘనతను అందుకున్నాడతను.

పూరన్ చరిత్ర సృష్టించాడు. 19 బంతుల్లో అర్ధశతకం మార్క్​ను చేరుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2024లో లక్నో తరఫున ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన ప్లేయర్​గా నిలిచాడు. ఓవరాల్ లీగ్ హిస్టరీలో చూసుకుంటే.. ఎల్​ఎస్​జీ తరఫున ఆడుతూ ఒకసారి 15 బంతుల్లో, మరోమారు 20 బంతుల్లో ఫిఫ్టీలు బాదాడు పూరన్. ఈ మ్యాచ్​లో 19 బంతుల్లోనే ఆ మార్క్​ను చేరుకున్నాడు. దీంతో ఎల్​ఎస్​జీ తరఫున మూడుసార్లు ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ కొట్టిన బ్యాటర్​గానూ అతడు నిలిచాడు. ఇక, పూరన్​తో పాటు కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బంతుల్లో 55) రాణించడంతో లక్నో ఓవర్లన్నీ ఆడి 6 వికెట్లకు 214 పరుగుల భారీ స్కోరు చేసింది. మరి.. పూరన్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.