iDreamPost
android-app
ios-app

KKR క్రేజీ రికార్డ్.. ఇన్నేళ్ల IPL హిస్టరీలో తొలి జట్టుగా అరుదైన ఘనత!

  • Published May 20, 2024 | 9:43 AM Updated Updated May 20, 2024 | 9:43 AM

కోల్​కతా నైట్ రైడర్స్ క్రేజీ రికార్డ్​ను క్రియేట్ చేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపించింది అయ్యర్ సేన.

కోల్​కతా నైట్ రైడర్స్ క్రేజీ రికార్డ్​ను క్రియేట్ చేసింది. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కానిది చేసి చూపించింది అయ్యర్ సేన.

  • Published May 20, 2024 | 9:43 AMUpdated May 20, 2024 | 9:43 AM
KKR క్రేజీ రికార్డ్.. ఇన్నేళ్ల IPL హిస్టరీలో తొలి జట్టుగా అరుదైన ఘనత!

ఐపీఎల్-2024 సీజన్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా నిలిచింది. ముఖ్యంగా ఈసారి ప్లేఆఫ్స్ రేసు చాలా ఆశ్చర్యకరంగా సాగింది. ప్లేఆఫ్స్​ బెర్త్ పక్కా అనుకున్న చెన్నై సూపర్ కింగ్స్ గ్రూప్ దశ నుంచే వైదొలిగింది. నెల కింద వరకు రేసులో లేని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు దర్జాగా ప్లేఆఫ్స్ గడప తొక్కింది. వరుస ఓటములతో అడ్రెస్ లేకుండా పోయిన ఆ జట్టు.. ఆ తర్వాత ఆడిన 6 మ్యాచుల్లోనూ విజయాలతో ప్లేఆఫ్స్​కు క్వాలిఫై అయింది. ఎలాంటి అంచనాలు లేని సన్​రైజర్స్ హైదరాబాద్ కూడా అద్భుతంగా ఆడుతూ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది. వీటి కంటే ముందు రాజస్థాన్ రాయల్స్, కోల్​కతా నైట్ రైడర్స్ ప్లేఆఫ్స్​లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ప్లేఆఫ్స్​లోకి అందరి కంటే ముందు అడుగు పెట్టిన కోల్​కతా చరిత్ర సృష్టించింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లు ముగిసేసరికి ఆ టీమ్ నెట్ రన్ రేట్ +1.428గా ఉంది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఇంత బాగా నెట్ రన్ రేట్ ఏ టీమ్​కూ లేదు. ఒక సీజన్​లో బెస్ట్ రన్ రేట్ కలిగిన జట్టుగా కేకేఆర్ అరుదైన ఘనతను అందుకుంది. 5 సార్లు కప్పులు గెలిచిన చెన్నై, ముంబై వంటి టాప్ టీమ్స్​ కూడా ఇంత మంచి నెట్ రన్ రేట్ ఎప్పుడూ సాధించలేదు. కానీ అయ్యర్ సేన ఈ సీజన్​లో అటాకింగ్ గేమ్​తో అద్భుత విజయాలు సాధిస్తూ గ్రూప్ దశ ముగిసేసరికి ఈ ఫీట్​ను నమోదు చేసింది. నిన్న రాజస్థాన్ రాయల్స్​తో కేకేఆర్ ఆడాల్సిన మ్యాచ్ రద్దయిది.

kkr creates history 1

వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే కేకేఆర్-ఆర్ఆర్ మ్యాచ్ రద్దయింది. వాన ఎంతకీ ఆగకపోవడంతో గేమ్​ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు అంపైర్లు. ఒకవేళ మ్యాచ్ జరిగి ఉంటే అందులో గెలుపోటములను బట్టి కోల్​కతా నెట్ రన్​ రేట్​ మెరుగయ్యేది లేదా తగ్గేదేమో. కానీ మ్యాచ్ రద్దవడంతో 1 పాయింట్ ఖాతాలో చేరడంతో అరుదైన ఘనతను అందుకుంది. ఈ మ్యాచ్ రద్దయినా కానీ మిగిలిన మ్యాచుల్లో టీమ్ ప్లేయర్లు ఆడిన తీరు వల్లే ఇన్ని విజయాలు, రికార్డులు నమోదు చేసింది కోల్​కతా. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి సూపర్ పెర్ఫార్మెన్స్​కు అయ్యర్ కెప్టెన్సీ, గంభీర్ మెంటార్​షిప్ తోడవడంతో ఆ టీమ్​ సక్సెస్ బాటలో నడుస్తోంది. మరి.. కేకేఆర్ రేర్ ఫీట్​పై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.