KKR vs RR: వీడియో: క్యాచ్ పట్టి ఆవేవ్ ఖాన్ వెరైటీ సెలబ్రేషన్స్.. అలా ఎందుకు చేశాడంటే?

రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆవేశ్ ఖాన్ వెరైటీ సెలబ్రేషన్​తో వైరల్ అవుతున్నాడు. కోల్​కతా బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్ పట్టాక అతడు ఎందుకలా చేశాడో ఎవరికీ అర్థం కావడం లేదు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆవేశ్ ఖాన్ వెరైటీ సెలబ్రేషన్​తో వైరల్ అవుతున్నాడు. కోల్​కతా బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్ పట్టాక అతడు ఎందుకలా చేశాడో ఎవరికీ అర్థం కావడం లేదు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కోల్​కతా నైట్ రైడర్స్​తో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆవేశ్ ఖాన్ సూపర్ క్యాచ్ పట్టాడు. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (10) ఇచ్చిన రిటర్న్ క్యాచ్​ను అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు ఆవేశ్. అతడు వేసిన బంతి ఆఫ్ సైడ్ పడి కాస్త ఇన్​ స్వింగ్ అయి లోపలికి వచ్చింది. పుల్​ షాట్​తో దాన్ని సిక్సర్​గా మలచుదామని సాల్ట్ భావించాడు. అయితే షాట్ సరిగ్గా మిడిల్ కాకపోవడంతో బంతి అక్కడే పైకి లేచింది. బౌలింగ్ వేసి ఫాలో త్రూ పూర్తయ్యే లోపే బాల్ దూసుకురావడంతో తన ఎడమ వైపునకు డైవ్ చేసి లెఫ్టాండ్​తో బంతిని ఒడిసిపట్టాడు ఆవేశ్ ఖాన్. అయితే క్యాచ్ పట్టాక అతడి వెరైటీ సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

సాల్ట్ క్యాచ్ అందుకున్నాక వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు ఆవేశ్ ఖాన్. క్యాచ్ అంటే ఇలా పట్టాలంటూ కెప్టెన్ సంజూ శాంసన్​కు చూపిస్తూ జోక్ చేశాడు. దీంతో టీమ్​మేట్స్ అందరూ వచ్చి అతడ్ని హగ్ చేసుకున్నారు. సూపర్బ్ క్యాచ్ అంటూ మెచ్చుకున్నారు. లేచి నిల్చున్న ఆవేశ్ ఖాన్.. అక్కడే ఉన్న సంజూ చేతుల్లో నుంచి ఒక గ్లవ్​ తీసుకున్నాడు. అందులో బంతిని వేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపించాడు. ఆవేశ్ ఇలా చేయడానికి ఓ రీజన్ ఉంది. గత మ్యాచ్​ తర్వాత సంజూ క్యాచుల గురించి మాట్లాడుతూ.. గ్లవ్స్​తో క్యాచులు పట్టడం ఈజీ అని చెప్పాడు.

సంజూ వ్యాఖ్యల్ని గుర్తుపెట్టుకున్న ఆవేశ్.. సాల్ట్ క్యాచ్ పట్టాక ఆ బాల్​ను గ్లవ్స్​లో వేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపించాడు. తాను గ్లవ్స్​తో పట్టలేదని, సింగిల్ హ్యాండ్​తో క్యాచ్​ను అందుకున్నానని సరదాగా జోక్ చేశాడు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. ఫస్ట్ బ్యాటింగ్​కు దిగిన కేకేఆర్ ప్రస్తుతం 12 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఉంది. ఓపెనర్ సునీల్ నరైన్ (39 బంతుల్లో 70 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2 బంతుల్లో 4 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. ఆవేశ్ ఖాన్ రిటర్న్ క్యాచ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments