Nidhan
రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆవేశ్ ఖాన్ వెరైటీ సెలబ్రేషన్‌తో వైరల్ అవుతున్నాడు. కోల్‌కతా బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్ పట్టాక అతడు ఎందుకలా చేశాడో ఎవరికీ అర్థం కావడం లేదు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆవేశ్ ఖాన్ వెరైటీ సెలబ్రేషన్‌తో వైరల్ అవుతున్నాడు. కోల్‌కతా బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఇచ్చిన క్యాచ్ పట్టాక అతడు ఎందుకలా చేశాడో ఎవరికీ అర్థం కావడం లేదు. దీని వెనుక ఉన్న మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్ ఆవేశ్ ఖాన్ సూపర్ క్యాచ్ పట్టాడు. కేకేఆర్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ (10) ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అద్భుతంగా డైవ్ చేసి అందుకున్నాడు ఆవేశ్. అతడు వేసిన బంతి ఆఫ్ సైడ్ పడి కాస్త ఇన్ స్వింగ్ అయి లోపలికి వచ్చింది. పుల్ షాట్‌తో దాన్ని సిక్సర్‌గా మలచుదామని సాల్ట్ భావించాడు. అయితే షాట్ సరిగ్గా మిడిల్ కాకపోవడంతో బంతి అక్కడే పైకి లేచింది. బౌలింగ్ వేసి ఫాలో త్రూ పూర్తయ్యే లోపే బాల్ దూసుకురావడంతో తన ఎడమ వైపునకు డైవ్ చేసి లెఫ్టాండ్‌తో బంతిని ఒడిసిపట్టాడు ఆవేశ్ ఖాన్. అయితే క్యాచ్ పట్టాక అతడి వెరైటీ సెలబ్రేషన్స్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
సాల్ట్ క్యాచ్ అందుకున్నాక వినూత్నంగా సెలబ్రేట్ చేసుకున్నాడు ఆవేశ్ ఖాన్. క్యాచ్ అంటే ఇలా పట్టాలంటూ కెప్టెన్ సంజూ శాంసన్‌కు చూపిస్తూ జోక్ చేశాడు. దీంతో టీమ్మేట్స్ అందరూ వచ్చి అతడ్ని హగ్ చేసుకున్నారు. సూపర్బ్ క్యాచ్ అంటూ మెచ్చుకున్నారు. లేచి నిల్చున్న ఆవేశ్ ఖాన్.. అక్కడే ఉన్న సంజూ చేతుల్లో నుంచి ఒక గ్లవ్ తీసుకున్నాడు. అందులో బంతిని వేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపించాడు. ఆవేశ్ ఇలా చేయడానికి ఓ రీజన్ ఉంది. గత మ్యాచ్ తర్వాత సంజూ క్యాచుల గురించి మాట్లాడుతూ.. గ్లవ్స్‌తో క్యాచులు పట్టడం ఈజీ అని చెప్పాడు.
సంజూ వ్యాఖ్యల్ని గుర్తుపెట్టుకున్న ఆవేశ్.. సాల్ట్ క్యాచ్ పట్టాక ఆ బాల్‌ను గ్లవ్స్‌లో వేసి డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపించాడు. తాను గ్లవ్స్‌తో పట్టలేదని, సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్‌ను అందుకున్నానని సరదాగా జోక్ చేశాడు. ఇక, మ్యాచ్ విషయానికొస్తే.. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ ప్రస్తుతం 12 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 125 పరుగులతో ఉంది. ఓపెనర్ సునీల్ నరైన్ (39 బంతుల్లో 70 నాటౌట్), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2 బంతుల్లో 4 నాటౌట్) క్రీజులో ఉన్నారు. మరి.. ఆవేశ్ ఖాన్ రిటర్న్ క్యాచ్ మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
A brilliant Caught & bowled from Avesh Khan. 💯pic.twitter.com/ZmbiRmOaSO
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2024
Sanju Samson in the last match – it’s easier to take a catch with the gloves.
Avesh Khan took off Sanju’s gloves and showed the dressing room after taking a one handed stunner. 😄👏 pic.twitter.com/gmEK9rmBMl
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 16, 2024