Nidhan
ఐపీఎల్ నయా హీరో శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్‌కు మరో విజయాన్ని అందించాడు. గెలుపు అసాధ్యం అనుకున్న మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్‌ను చిత్తు చేసి తన టీమ్‌కు మరో విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్ ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ రుణాన్ని తీర్చుకున్నాడతను.
ఐపీఎల్ నయా హీరో శశాంక్ సింగ్ పంజాబ్ కింగ్స్‌కు మరో విజయాన్ని అందించాడు. గెలుపు అసాధ్యం అనుకున్న మ్యాచ్‌లో కేకేఆర్ బౌలింగ్‌ను చిత్తు చేసి తన టీమ్‌కు మరో విక్టరీని అందించాడు. ఈ మ్యాచ్ ద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్ రుణాన్ని తీర్చుకున్నాడతను.
Nidhan
డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టి ఐపీఎల్ ఛాన్స్ దక్కించుకున్నాడతను. క్యాష్ రిచ్ లీగ్‌లో రాణించి భారత జట్టులోకి అడుగు పెట్టాలని ఎన్నో కలలు కన్నాడు. అందుకోసం ఎంతో కఠోరంగా శ్రమించాడు. కానీ తీవ్రమైన పోటీ ఉండే ఐపీఎల్లో అతడికి సరైన అవకాశాలు దక్కలేదు. అరకొర ఛాన్సులు వచ్చినా ఒత్తిడి వల్ల అతడు సత్తా చాటలేదు. అలా ఏళ్లు గడిచిపోయాయి. అయితే నిరుడు మినీ ఆక్షన్‌లో పంజాబ్ కింగ్స్ అనుకోకుండా ఇంకొకరి ప్లేస్‌లో అతడ్ని తీసుకుంది. ఆ ప్లేయరే ఇప్పుడు ఆ టీమ్‌కు హీరో అయ్యాడు. వరుసగా విధ్వంసక ఇన్నింగ్స్‌లతో పంజాబ్‌కు విజయాలు అందిస్తున్నాడు. అతడే శశాంక్ సింగ్. ఐపీఎల్-2024లో ఈ బ్యాటర్ హవా నడుస్తోంది. నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్ మీద కూడా 28 బంతుల్లోనే 68 పరుగులతో పంజాబ్‌కు సంచలన విజయాన్ని అందించాడు.
కేకేఆర్ మీద పంజాబ్ సెన్సేషనల్ విక్టరీ సాధించిందంటే అందుకు శశాంక్ ఆడిన తుఫాన్ ఇన్నింగ్సే కారణం. తీవ్ర ఒత్తిడిలోనూ కూల్‌గా తన పని తాను చేసుకుపోయాడతను. ఎడాపెడా భారీ షాట్లు బాది సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పాడు. అయితే ఈ మ్యాచ్‌తో అతడు సన్‌రైజర్స్ హైదరాబాద్ రుణాన్ని కూడా తీర్చుకున్నాడు. ఎస్ఆర్హెచ్కు శశాంక్‌కు మధ్య కనెక్షన్ ఏంటనేగా మీ డౌట్. ఐపీఎల్-2022లో సన్‌రైజర్స్ జట్టుతో ట్రావెల్ అయ్యాడు శశాంక్. బ్యాట్‌తో అంతగా ప్రభావం చూపించలేదు. కానీ టీమ్‌తో ఉంటూ బ్యాటింగ్ మెళకువల్ని మెరుగుపర్చుకున్నాడు. ఇప్పుడు పంజాబ్ తరఫున అదరగొడుగుతున్నాడు. నిన్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రానా బౌలింగ్‌ను ఊచకోత కోశాడు శశాంక్ సింగ్.
హర్షిత్ రానా వేసిన 18వ ఓవర్లో ఏకంగా 25 వచ్చాయి. ఇందులో 17 పరుగులు శశాంక్ బాదగా.. మిగతావి బెయిర్‌స్టో బ్యాట్ నుంచి వచ్చాయి. ఈ ఇన్నింగ్స్‌తో ఎస్ఆర్హెచ్ రుణాన్ని తీర్చుకున్నాడు శశాంక్. ఈ సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో కేకేఆర్‌తో తలపడింది సన్‌రైజర్స్. ఆ మ్యాచ్‌లో 4 రన్స్ తేడాతో ఓడింది కమిన్స్ సేన. అందులో మయాంక్ వికెట్ తీసి హర్షిత్ ఓవరాక్షన్ చేశాడు. ఆ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లతో ప్రవర్తించిన తీరుపై అప్పట్లో అతడు ట్రోలింగ్‌కు కూడా గురయ్యాడు. అయితే టోర్నీ మొత్తం కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ వస్తున్న హర్షిత్‌ను నిన్న శశాంక్ బాదేశాడు. వరుస సిక్సులు, ఫోర్లతో అతడ్ని బెంబేలెత్తించాడు. నిన్న 4 ఓవర్లు వేసిన హర్షిత్ ఏకంగా 61 పరుగులు సమర్పించుకున్నాడు. ఎస్ఆర్హెచ్పై బిల్డప్ ఇచ్చిన అతడి పొగరును నిన్న శశాంక్ అణచాడు. దీంతో ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ తాము కోరుకున్నది ఇదేనంటూ పంజాబ్ బ్యాటర్‌ను మెచ్చుకుంటున్నారు.