Nidhan
కేకేఆర్-పంజాబ్ మ్యాచ్‌కు కింగ్ ఖాన్ షారుఖ్ కూడా అటెండ్ అయ్యారు. అయితే మ్యాచ్ టైమ్‌లో ఆయన తన కొడుకుతో చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
కేకేఆర్-పంజాబ్ మ్యాచ్‌కు కింగ్ ఖాన్ షారుఖ్ కూడా అటెండ్ అయ్యారు. అయితే మ్యాచ్ టైమ్‌లో ఆయన తన కొడుకుతో చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
Nidhan
ఐపీఎల్-2024 ఎన్నో సంచలనాలకు వేదికగా మారింది. నీళ్లు తాగినంత అలవోకగా ఈ సీజన్లో టీమ్స్ భారీ స్కోర్లు బాదేస్తున్నాయి. రెండు వారాల గ్యాప్‌లో 200 ప్లస్ స్కోర్లు పదిహేను సార్లు నమోదయ్యాయి. ఈ సీజన్లో 250 ప్లస్ స్కోర్లు ఏడుసార్లు నమోదవడం గమనార్హం. ఇంత స్కోరు కొట్టడమే ఒకెత్తు అనుకుంటే దాన్ని ఈజీగా ఛేజ్ చేయడం మరొకెత్తు. నిన్న కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో ఇదే జరిగింది. ఈ రెండు టీమ్స్ తుదివరకు నువ్వానేనా? అంటూ తలపడ్డాయి. అయితే ఎట్టకేలకు విజయం పంజాబ్‌నే వరించింది. కేకేఆర్ సంధించిన 261 పరుగుల టార్గెట్‌ను పంజాబ్ ఇంకో 8 బంతులు ఉండగానే ఛేదించింది. అయితే ఈ మ్యాచ్ టైమ్‌లో కింగ్ ఖాన్ షారుఖ్ తన కొడుకుతో చేసిన పని ఇప్పుడు వైరల్ అవుతోంది.
కేకేఆర్ ఓనర్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఐపీఎల్ మ్యాచులకు తరచూ అటెండ్ అవుతుంటారు. ముఖ్యంగా తన టీమ్ హోమ్ మ్యాచ్‌లను చూసేందుకు ఆయన పక్కా కోల్‌కతా వస్తుంటారు. ఇదే క్రమంలో నిన్న ఈడెన్ గార్డెన్స్‌కు వచ్చి తెగ సందడి చేశారు. అయితే ఈసారి తన చిన్న కొడుకు అబ్రామ్ను కూడా వెంట పెట్టుకొని వచ్చారు కింగ్ ఖాన్. మ్యాచ్ సమయంలో అబ్రామ్ ఫుల్ ఎగ్జయిటెటడ్గా కనిపించాడు. ముఖ్యంగా కేకేఆర్ బ్యాటింగ్ టైమ్‌లో అతడు గట్టిగా అరుస్తూ టీమ్‌ను ఎంకరేజ్ చేశాడు. చేతిలో విజిల్‌తో హల్చల్ చేశాడు. కోల్‌కతా బ్యాటర్లు బౌండరీలు, సిక్సులు కొట్టిన ప్రతిసారి అబ్రామ్ విజిల్ ఊదుతూ వాళ్లను మరింత ఉత్సాహపరిచాడు.
కేకేఆర్ బ్యాటర్లు విజృంభిస్తున్న కొద్దీ అబ్రామ్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తమ టీమ్ ఆటగాళ్లు బాగా ఆడుతుండటంతో అతడు ఎగిరి గంతేశాడు. పదే పదే విజిల్ గట్టిగా ఊదుతూ సంతోషంతో ఊగిపోయాడు. అయితే పక్కనే ఉన్న షారుఖ్ అతడ్ని కంట్రోల్ చేశాడు. ఇక చాలు.. అంటూ విజిల్స్ వేయొద్దని వారించాడు. సైలెంట్‌గా ఉండమని ఆదేశించాడు. షారుఖ్ తన కొడుకును కంట్రోల్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. నిన్నటి మ్యాచ్‌లో మిస్సయిన ఈ వీడియోను ఎవరో రికార్డు చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్.. ఎంత స్టార్ అయినా ఆయన కూడా ఓ తండ్రేనని, కుమారుడికి మంచి చెడు నేర్పించడం ఆయన బాధ్యత అని.. దాన్ని సక్రమంగా నెరవేరుస్తున్నారంటూ మెచ్చుకుంటున్నారు.
Lil AbRam’s uncontrollable excitement and Shah at the end telling him to calm down with the whistle like a typical dad 😂♥️ @iamsrk you both melt my heart! pic.twitter.com/xlV4LEvf5Z
— Samina ✨ (@SRKsSamina_) April 26, 2024