Nidhan
ఐపీఎల్-2024 కప్పును ఎరగేసుకుపోయింది కోల్‌కతా నైట్ రైడర్స్. కమిన్స్ సేనను ఓడించి నయా ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో ఆ జట్టు అభిమానులు సంతోషం పట్టలేక సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు.
ఐపీఎల్-2024 కప్పును ఎరగేసుకుపోయింది కోల్‌కతా నైట్ రైడర్స్. కమిన్స్ సేనను ఓడించి నయా ఛాంపియన్‌గా అవతరించింది. దీంతో ఆ జట్టు అభిమానులు సంతోషం పట్టలేక సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు.
Nidhan
కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ప్రతీకారానికి ఇదే సరైన సమయమని అనుకున్నారు. లీగ్ మ్యాచ్‌తో పాటు ప్లేఆఫ్స్‌లో ఓటమికి రివేంజ్ తీర్చుకోవడానికి మళ్లీ ఛాన్స్ దక్కదని భావించారు. అయ్యర్ సేనను ఓడించి పగ తీర్చుకోవడంతో పాటు కప్పును ఎగరేసుకుపోవాలని ప్లాన్ చేశారు. దూకుడైన ఆటతీరుతో ప్రత్యర్థిని బెదరగొట్టాలని ఫిక్స్ అయ్యారు. కానీ అంతా రివర్స్ అయింది. ఫైనల్ ఫైట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అనుకున్నది ఏదీ చేయలేకపోయింది. బలమైన కేకేఆర్ ముందు తలొగ్గింది. కీలక మ్యాచ్‌లో బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో వార్ వన్ సైడ్ అయింది. ఎస్ఆర్హెచ్ సంధించిన 113 పరుగుల టార్గెట్‌ను 10.3 ఓవర్లలో ఇంకో 8 వికెట్లు ఉండగానే ఛేదించి ఛాంపియన్‌గా అవతరించింది కేకేఆర్. తమ జట్టు విజయంతో కోల్‌కతా అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.
2012, 2014లో ఐపీఎల్ కప్పును ఒడిసిపట్టిన కేకేఆర్.. మరోసారి విజేతగా ఆవిర్భవించింది. ఈ సీజన్ మొదట్నుంచి అదరగొడుతూ స్ట్రాంగ్ కంటెండర్‌గా మారిన అయ్యర్ సేన.. ఫైనల్స్‌లోనూ అదే దూకుడైన ఆటతీరుతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. 10 ఏళ్ల తర్వాత తమ జట్టు కప్పు కలను నిజం చేసుకోవడంతో కేకేఆర్ ఫ్యాన్స్ ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. స్టేడియంలో విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ, కేకేఆర్.. కేకేఆర్ అని అరుస్తూ ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే స్టేడియంలో కంటే కోల్‌కతాలో నెక్స్ట్ లెవల్లో సెలబ్రేట్ చేసుకున్నారు అభిమానులు. అక్కడ వర్షాలు, తీవ్ర గాలుల నేపథ్యంలో తుఫాను హెచ్చరికను విధించారు వాతావరణ శాఖ అధికారులు.
తుఫాను ముప్పు నేపథ్యంలో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితి. ఈ తరుణంలోనూ కోల్‌కతాలో అభిమానులు తగ్గేదేలే అంటూ వీధుల్లోకి వచ్చారు. అయ్యర్ సేన విక్టరీని రోడ్డ మీదకు వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. ఒకేసారి వందలాది మంది వీధుల్లోకి వచ్చేశారు. భారీగా వాహనాలతో ర్యాలీలు తీస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. కేకేఆర్ ఫ్యాన్స్ చాలా స్పెషల్ అంటున్నారు. ఇది నెక్స్ట్ లెవల్ సెలబ్రేషన్ అని కామెంట్స్ చేస్తున్నారు. అయితే విక్టరీని ఎంజాయ్ చేస్తూనే తుఫాను నేపథ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. మరి.. ఐపీఎల్-2024లో కేకేఆర్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
Celebrations in Kolkata for the IPL win even when there was a cyclone alert. 🔥🏆pic.twitter.com/NlXjDSwff2
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 27, 2024