Nidhan
ఐపీఎల్ వేదిక మీద ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం దక్కింది. దీని గురించి తెలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ తలెత్తుకుంటారు.
ఐపీఎల్ వేదిక మీద ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం దక్కింది. దీని గురించి తెలిస్తే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ తలెత్తుకుంటారు.
Nidhan
ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదిహేడో సీజన్ ముగిసింది. ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఫైనల్ మ్యాచ్ బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి మెట్టు మీద బోల్తా పడింది. చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన టైటిల్ ఫైట్‌లో కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. 8 వికెట్ల తేడాతో కమిన్స్ సేనను ఓడించి నయా ఛాంపియన్‌గా అవతరించింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్.. 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఆఖర్లో కెప్టెన్ కమిన్స్ (24) పోరాడకుంటే ఆ మాత్రం స్కోరు కూడా చేసేది కాదు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన కోల్‌కతా 10.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను రీచ్ అయింది. గెలిచిన కేకేఆర్ కప్పును కైవసం చేసుకోగా.. ఓడిన ఎస్ఆర్హెచ్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక, ఐపీఎల్ వేదిక మీద ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం దక్కింది.
ఉప్పల్ స్టేడియానికి అరుదైన గౌరవం దక్కింది. ఈ సీజన్లో ఏ ఇతర గ్రౌండ్‌కు దక్కని గౌరవం ఇది. అత్యుత్తమ పిచ్‌ను రూపొందించినందుకు గానూ బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ పురస్కారం ఉప్పల్ స్టేడియానికి దక్కింది. ఈ అవార్డు కింద ప్రోత్సాహకంగా రూ.50 లక్షల నగదు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)కు లభించింది. ఈ పురస్కారాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ఛాముండేశ్వరినాథ్ నుంచి హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు అందుకున్నారు. దీనిపై సన్‌రైజర్స్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మన జట్టు ఫైనల్ వరకు వెళ్లడం, మరోవైపు ఉప్పల్ స్టేడియానికి అవార్డు దక్కడంతో వాళ్లు సంతోషంలో మునిగిపోయారు. ఇక, ఈ సీజన్లో 7 మ్యాచులకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అతిథ్యం ఇచ్చింది.
ఉప్పల్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చిన ఏడు మ్యాచుల్లో గుజరాత్ టైటాన్స్-సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వాన వల్ల రద్దయింది. మిగిలిన మ్యాచులన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా సాగాయి. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో మినహా మిగిలిన అన్నింటా ఎస్ఆర్హెచ్ విజయబావుటా ఎగురవేసింది. ఉప్పల్‌లో భారీ స్కోర్లు నమోదు కావడం, ఒకదాన్ని మించి మరొకటి ఆసక్తికరంగా మ్యాచులు సాగడం తెలిసిందే. ఈ సీజన్లో సన్‌రైజర్స్ హవా నడవడానికి ఈ గ్రౌండ్ ఎంతో హెల్ప్ అయింది. హోమ్ మ్యాచెస్‌లో భారీ విజయాలు సాధించడం వల్లే జట్టును చూసి ప్రత్యర్థులు భయపడ్డారు. ఇదే జోరును ఇతర వేదికల్లోనూ కొనసాగించి ఏకంగా ఫైనల్స్‌కు చేరుకుంది కమిన్స్ సేన. మరి.. ఉప్పల్ స్టేడియానికి అవార్డు దక్కడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Wow! 🎉 We received Rs. 50,00,000 prize money for our Uppal Stadium pitch and ground—awarded Best Pitch and Ground in IPL matches! Huge thanks to Chandu and his team. Congrats to the HCA family! 🙌 #Grateful #HCA #TeamEffort @BCCI @SunRisers @IPL pic.twitter.com/ESMtAXkyd7
— Jagan Mohan Rao Arishnapally (@JaganMohanRaoA) May 26, 2024