SRHతో మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్​లో పాండ్యా స్పీచ్.. వింటే ఆశ్చర్యపోతారు!

సన్​రైజర్స్ హైదరాబాద్​తో హైస్కోరింగ్ మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ చతికిలపడింది. భారీ టార్గెట్​ను ఛేజ్ చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్​లో​ స్పీచ్ ఇచ్చాడు ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

సన్​రైజర్స్ హైదరాబాద్​తో హైస్కోరింగ్ మ్యాచ్​లో ముంబై ఇండియన్స్​ చతికిలపడింది. భారీ టార్గెట్​ను ఛేజ్ చేయలేక ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్​లో​ స్పీచ్ ఇచ్చాడు ఎంఐ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.

ఐపీఎల్​లో ఎప్పుడూ చూడని మ్యాచ్​కు ఉప్పల్ వేదికగా నిలిచింది. పరుగుల సునామీలో స్టేడియంలోని ఆడియెన్స్ తడిసి ముద్దయ్యారు. సన్​రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ముంబై ఇండియన్స్ ముందు ఏకంగా 277 పరుగుల బిగ్ టార్గెట్ సెట్ చేశారు. ఐపీఎల్​ హిస్టరీలో భారీ స్కోరు చేసిన టీమ్​గా ఎస్​ఆర్​హెచ్ రికార్డు క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగిన ఎంఐ.. ఆఖరి వరకు పోరాడుతూ 31 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. విజయం కమిన్స్ సేనను వరించినా ముంబై పోరాటాన్ని తక్కువ చేయడానికి లేదు. ఆ టీమ్ బ్యాటర్లు గెలుస్తామనే కాన్ఫిడెన్స్​తో ఆఖరి వరకు ప్రయత్నించడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ తర్వాత ఎంఐ డ్రెస్సింగ్ రూమ్​లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పీచ్ ఇచ్చాడు. అది వింటే ఆశ్చర్యపోతారు.

రికార్డ్ రన్ ఛేజ్​లో ఓడిపోవడంతో ముంబై క్రికెటర్లతో పాటు అభిమానులు కూడా నిరాశలో కూరుకుపోయారు. చివరి వరకు పోరాడినా లక్ష్యాన్ని అందుకోకపోవడం, వరుసగా రెండో ఓటమి, మెగా లీగ్​లో ఇంకా బోణీ కొట్టకపోవడం వారిని మరింత బాధిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్​ఆర్​హెచ్​తో మ్యాచ్ తర్వాత ముంబై డ్రెస్సింగ్ రూమ్​లో కొత్త సారథి హార్దిక్ స్పీచ్ ఇచ్చాడు. టీమ్​మేట్స్, కోచింగ్ స్టాఫ్​ను ఎంకరేజ్ చేస్తూ అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సిసలైన యోధులకు మాత్రమే కఠిన పరీక్షలు ఎదురవుతాయని చెప్పాడు పాండ్యా. లీగ్​లో మనది టఫెస్ట్ టీమ్ అని అన్నాడు. బ్యాటింగ్ యూనిట్​గా, ఒక జట్టుగా ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఆడుతున్న తీరు అద్భుతమని మెచ్చుకున్నాడు. ఇదే ఆటను కంటిన్యూ చేయాలని కోరాడు.

సన్​రైజర్స్​తో మ్యాచ్​లో ముంబై బౌలర్లు పోరాడిన తీరు సూపర్బ్ అని హార్దిక్ ప్రశంసించాడు. వాళ్ల విషయంలో తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు. పరిస్థితులు చాలా టఫ్​గా ఉన్న టైమ్​లో వాళ్లు బాధ్యతల నుంచి పారిపోకుండా నిలబడ్డారని.. ఇది మామూలు విషయం కాదన్నాడు పాండ్యా. తమకు బౌలింగ్ ఇవ్వాలని ప్రతి బౌలర్ అడిగాడని, ఇది గొప్ప విషయమని పేర్కొన్నాడు. టీమ్​లోని ఆటగాళ్లు అందరూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ కలసికట్టుగా ముందుకు వెళ్దామని.. మంచి, చెడు ఏది జరిగినా దాన్ని ఫేస్ చేద్దామని పాండ్యా స్పష్టం చేశాడు. హార్దిక్​తో పాటు ఎంఐ మెంటార్ సచిన్ టెండూల్కర్ కూడా స్పీచ్ ఇచ్చాడు. 277 పరుగులను ఛేజ్ చేస్తూ కూడా ఎలాంటి తడబాటు లేకుండా ముంబై బ్యాటర్లు బ్యాటింగ్ చేశారని మెచ్చుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్​లో తొలి 10 ఓవర్లు ముగిశాక క్లియర్ విన్నర్ ఎవరో చెప్పడం కష్టంగా మారిందన్నాడు. ఇక మీదట కూడా ఇలాగే కలసికట్టుగా ఆడాలని సూచించాడు మాస్టర్ బ్లాస్టర్. మరి.. పాండ్యా, సచిన్ స్పీచ్ మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments