iDreamPost
android-app
ios-app

GT vs SRH: గుజరాత్ vs హైదరాబాద్.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

  • Published Mar 30, 2024 | 9:44 PM Updated Updated Mar 30, 2024 | 9:44 PM

ఓడిన బాధలో ఉన్న గుజరాత్​కు, హై స్కోరింగ్ ఫైట్​లో గెలిచి జోష్​లో ఉన్న హైదరాబాద్​కు మధ్య మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. మరి.. ఈ టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఓడిన బాధలో ఉన్న గుజరాత్​కు, హై స్కోరింగ్ ఫైట్​లో గెలిచి జోష్​లో ఉన్న హైదరాబాద్​కు మధ్య మ్యాచ్​కు సర్వం సిద్ధమైంది. మరి.. ఈ టీమ్స్ బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 30, 2024 | 9:44 PMUpdated Mar 30, 2024 | 9:44 PM
GT vs SRH: గుజరాత్ vs హైదరాబాద్.. గెలుపెవరిదంటే? ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..!

టోర్నీలో మంచి స్టార్ట్ అందుకున్నాక కూడా నెక్స్ట్ మ్యాచ్​లో ఓడి నిరాశలో ఉందో టీమ్. ఇంకో జట్టేమో తొలి మ్యాచ్​లో కొద్ది తేడాతో ఓడినా.. రెండో మ్యాచ్​లో అద్భుత విజయాన్ని సాధించి ఫుల్ జోష్​లో ఉంది. ఆ రెండు టీమ్సే గుజరాత్ టైటాన్స్, సన్​రైజర్స్ హైదరాబాద్. ఫస్ట్ మ్యాచ్​లో ముంబై మీద 6 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన జీటీ.. సెకండ్ మ్యాచ్​లో చెన్నై చేతిలో 63 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో సక్సెస్ ట్రాక్​లోకి రావడం ఆ టీమ్​కు కంపల్సరీగా మారింది. మరోవైపు తొలి మ్యాచ్​లో కోల్​కతా చేతితో 4 పరుగుల తేడాతో ఓడింది సన్​రైజర్స్. అయితే ఉత్కంఠభరితంగా సాగిన రెండో మ్యాచ్​లో 31 రన్స్ తేడాతో నెగ్గింది. జీటీ మీద కూడా గెలిచి ఇదే జోరును కంటిన్యూ చేయాలని కమిన్స్ సేన భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు టీమ్స్ మధ్య జరగనున్న సండే ఫైట్​లో ఎవరి విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

గుజరాత్ టైటాన్స్

గుజరాత్​ను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. ఆ టీమ్​లో ప్లస్సుల కంటే మైనస్​లే ఎక్కువగా ఉన్నాయి. ఓపెనింగ్ జోడీ సాహా-గిల్ ఫెయిలవుతున్నారు. శుబ్​మన్ నుంచి ఇప్పటిదాకా భారీ ఇన్నింగ్స్ ఒక్కటీ రాలేదు. విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, ఒమర్జాయి, రాహుల్ తెవాటియా ఇలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్నా ఒక్కరూ స్థాయికి తగ్గట్లు ఆడటం లేదు. సాయి సుదర్శన్ మంచి ఫామ్​లో ఉండటం ఆ టీమ్​కు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్ యూనిట్ ఈ జట్టుకు బిగ్ మైనస్. బౌలింగ్​లో రషీద్ ఖాన్, మోహిత్ శర్మ తప్ప ఎవరూ కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేయడం లేదు.

సన్​రైజర్స్ హైదరాబాద్

ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టాలన్న కసిలో ఉన్న సన్​రైజర్స్ చాలా కొత్తగా కనిపిస్తోంది. ఫస్ట్ బాల్ నుంచి లాస్ట్ బాల్ వరకు ఓడినా, గెలిచినా జట్టు అటాకింగ్ మోడ్​లో ఆడుతూ ఆశ్చర్యపరుస్తోంది. ఆ టీమ్ ప్రధాన బలం బ్యాటింగే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడెన్​ మార్క్రమ్ సూపర్ ఫామ్​లో ఉన్నారు. వీళ్లకు తోడు మయాంక్ అగర్వాల్, అబ్దుల్ సమద్ కూడా రాణిస్తే టీమ్​కు తిరుగుండదు. ముంబైతో హైస్కోరింగ్ మ్యాచ్​లో అభిషేక్, హెడ్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీలతో విధ్వంసం సృష్టించారు. వీళ్లు ఇదే దూకుడును కంటిన్యూ చేయాలని టీమ్ కోరుకుంటోంది. ఎస్​ఆర్​హెచ్​కు మరో బలం కెప్టెన్ కమిన్స్. రెండు మ్యాచుల్లో కలిపి 3 వికెట్లే తీసినా అతడు పరుగులు ఇవ్వకుండా ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నాడు. బౌలింగ్ ఛేంజెస్​లోనూ తన మార్క్ చూపిస్తున్నాడు. కమిన్స్​తో పాటు జయ్​దేవ్ ఉనాద్కట్ కూడా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇతర బౌలర్లు కూడా రిథమ్​ను అందుకుంటే ఎస్ఆర్​హెచ్​ను ఆపలేరు.

ప్రిడిక్షన్

రెండు జట్ల బలాబలాలను బట్టి ఈ మ్యాచ్​లో సన్​రైజర్స్ నెగ్గడం ఖాయం. ఈ ఇరు టీమ్స్ ఇప్పటిదాకా 3 సార్లు తలపడ్డాయి. ఇందులో రెండుసార్లు జీటీ నెగ్గగా.. ఒకమారు ఎస్ఆర్​హెచ్​ గెలిచింది. అయితే హైదరాబాద్ బ్యాటర్లు ఇప్పుడు నెక్స్ట్ లెవల్ ఫామ్​లో ఉన్నారు. బౌలర్లు ప్రత్యర్థులను బాగా కట్టడి చేస్తున్నారు. అటు గుజరాత్ మాత్రం బ్యాటింగ్ ఫెయిల్యూర్​తో ఇబ్బంది పడుతోంది. ఆ టీమ్ బౌలింగ్ కూడా ఏమంత గొప్పగా లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే రేపటి మ్యాచ్​లో జీటీని ఎస్ఆర్​హెచ్​ కుమ్మేయడం పక్కా.

ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

గుజరాత్:
వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), శుబ్​మన్ గిల్ (కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయి, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్.

హైదరాబాద్:
ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనాద్కట్.