iDreamPost
android-app
ios-app

Shashank Singh: పొరపాటున కొన్న ప్లేయర్ పంజాబ్​ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్?

  • Published Apr 05, 2024 | 8:31 AM Updated Updated Apr 27, 2024 | 10:21 PM

ఆక్షన్​లో ఒకర్ని కొనబోయి మరొకర్ని తప్పుగా కొనుక్కుంది పంజాబ్. కానీ ఆ ప్లేయరే టీమ్​ను సింగిల్ హ్యాండ్​తో గెలిపించాడు. అసలు ఎవరీ శశాంక్ సింగ్? అనేది ఇప్పుడు చూద్దాం..

ఆక్షన్​లో ఒకర్ని కొనబోయి మరొకర్ని తప్పుగా కొనుక్కుంది పంజాబ్. కానీ ఆ ప్లేయరే టీమ్​ను సింగిల్ హ్యాండ్​తో గెలిపించాడు. అసలు ఎవరీ శశాంక్ సింగ్? అనేది ఇప్పుడు చూద్దాం..

  • Published Apr 05, 2024 | 8:31 AMUpdated Apr 27, 2024 | 10:21 PM
Shashank Singh: పొరపాటున కొన్న ప్లేయర్ పంజాబ్​ను గెలిపించాడు! ఎవరీ శశాంక్ సింగ్?

ఆక్షన్​లోకి వెళ్లే ముందు ఏ ప్లేయర్​ను కొనాలనే దాని మీద టీమ్స్ అవగాహనతో ఉంటాయి. వారి డేటాను కూడా తీసి పెట్టుకుంటాయి. ఏ ఆటగాడికి ఎంత ధర చెల్లించాలి? ఎవరి కోసం రిస్క్ చేయాలి? టీమ్​కు ఎలాంటి వాళ్లు ముఖ్యం? అనే కాలిక్యులేషన్స్ అన్నీ ముందే జరిగిపోతాయి. కానీ ఒక్కోసారి పొరపాటు జరగడం కామనే. ఒకర్ని కొనబోయి ఇంకొకర్ని తీసుకున్న సందర్భాలు కొన్ని ఉన్నాయి. అలా తప్పుగా కొన్న ఆటగాడే ఇప్పుడు పంజాబ్​ కింగ్స్​కు వరం అయ్యాడు. ఓటమి అంచున ఉన్న జట్టును ఒంటిచేత్తో ఒడ్డున పడేశాడు. అతడే శశాంక్ సింగ్. కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 28 బంతుల్లోనే 2 ఫోర్లు, 8 సిక్సులతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచి.. టీమ్ కు రికార్డు విజయాన్ని అందించాడు. దీంతో 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో దంచికొట్టింది.

శశాంక్ ఇన్నింగ్స్​లో 2 ఫోర్లతో పాటు 8 భారీ సిక్సులు ఉన్నాయి. దీన్ని బట్టే అతడి బ్యాటింగ్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. కేకేఆర్ నిర్దేశించిన 262 పరుగుల భారీ టార్గెట్​ను ఛేజ్ చేసేందుకు దిగింది పంజాబ్. ప్రభ్ సిమ్రన్ (54), జానీ బెయిర్ స్టో(108*) కు తోడు శశాంక్ సింగ్ థండర్ ఇన్నింగ్స్ తోడవ్వడంతో.. పంజాబ్ ఐపీఎల్ చరిత్రలోనే రికార్డు విజయాన్ని నమోదు చేసింది. పట్టుదలతో శశాంక్ ఆడిన విధానం, ఎలాంటి భయం లేకుండా షాట్స్ కొట్టిన తీరు, గెలవాలనే కసి చూసి అంతా ఆశ్చర్యపోయారు. దీంతో అసలు ఎవరీ శశాంక్? అని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఐపీఎల్-2024 కోసం నిర్వహించిన మినీ ఆక్షన్​లో 32 ఏళ్ల శశాంక్ సింగ్​ను పొరపాటున కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్. 19 ఏళ్ల శశాంక్ సింగ్​ను కొనబోయి.. ఈ శశాంక్​ను టీమ్​లోకి తీసుకుంది. అయితే కొనేశాక పొరపాటును గుర్తించినా ఈ శశాంక్ తమ జాబితాలో ఉన్నాడంటూ పంజాబ్ మేనేజ్​మెంట్ మిస్టేక్​ను కవర్ చేసింది. ఈ శశాంక్​ను రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షల ధరకు 2019లో సొంతం చేసుకుంది. కానీ ఆ సీజన్​తో పాటు తర్వాతి ఏడాది కూడా అతడికి ఆడే ఛాన్స్ రాలేదు. 2022లో రూ.20 లక్షల బేస్ ప్రైజ్​కు సన్​రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఆ సీజన్​లో 10 మ్యాచ్​లు ఆడిన శశాంక్ 69 పరుగులే చేసి నిరాశపర్చాడు. తాజా సీజన్​లో పొరపాటున పంజాబ్ టీమ్​లోకి వచ్చినా బ్యాట్​తో చెలరేగుతున్నాడు. గుజరాత్​తో మ్యాచ్​లో పంజాబ్ గెలిచిందంటే దానికి అతడే ప్రధాన కారణం. మరి.. శశాంక్ బ్యాటింగ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: IPL 2024: ఆందోళనలో ఫ్యాన్స్.. CSK vs SRH మ్యాచ్ జరుగుతుందా? లేదా? కారణం ఏంటంటే?