iDreamPost
android-app
ios-app

వీడియో: IPL అంతా ఫిక్సింగే.. అందర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారు!

  • Published May 16, 2024 | 8:57 PMUpdated May 16, 2024 | 8:57 PM

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు టైమ్ దగ్గర పడుతోంది. ఇంకొన్ని మ్యాచులతో ప్లేఆఫ్స్ బెర్త్​లపై ఫుల్ క్లారిటీ రానుంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లకు ఇక మీదట జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు టైమ్ దగ్గర పడుతోంది. ఇంకొన్ని మ్యాచులతో ప్లేఆఫ్స్ బెర్త్​లపై ఫుల్ క్లారిటీ రానుంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లకు ఇక మీదట జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది.

  • Published May 16, 2024 | 8:57 PMUpdated May 16, 2024 | 8:57 PM
వీడియో: IPL అంతా ఫిక్సింగే.. అందర్నీ పిచ్చోళ్లను చేస్తున్నారు!

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​కు టైమ్ దగ్గర పడుతోంది. ఇంకొన్ని మ్యాచులతో ప్లేఆఫ్స్ బెర్త్​లపై పూర్తి క్లారిటీ రానుంది. ప్లేఆఫ్స్ రేసులో ఉన్న జట్లకు ఇక మీదట జరిగే ప్రతి మ్యాచ్ కీలకం కానుంది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్, కోల్​కతా నైట్‌ రైడర్స్ క్వాలిఫై అయిపోయాయి. మిగిలిన పొజిషన్ల కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్​రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీపడుతున్నాయి. ఇంకో రెండు, మూడు మ్యాచులతో ప్లేఆఫ్స్ బెర్త్​లపై ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ మ్యాచులన్నీ ఒకదాన్ని మించి మరొకటి ఫుల్ ఎంటర్​టైన్ చేయనున్నాయి. తప్పక గెలవాల్సిన సిచ్యువేషన్ కాబట్టి టీమ్స్ అన్నీ తమ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ తరుణంలో ఐపీఎల్​లో ఫిక్సింగ్ కలకలం రేగింది.

ఈ సీజన్​లో మ్యాచులన్నీ ఫిక్సింగ్ అవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మ్యాచుల్లో టాస్​ విషయంలో ఫిక్సింగ్ జరుగుతోందని, ఇక్కడి నుంచే ఎవరు విజేతనేది ముందే డిసైడ్ అవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టాస్​కు రెండు వైపులా హెడ్స్ ఉండేలా చూసుకుంటున్నారని, ఏ టీమ్ టాస్ నెగ్గాలనేది ముందే ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. లక్నో సూపర్ జియాంట్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టాసే దీనికి బిగ్ ఎగ్జాంపుల్ అంటున్నారు. ఆ మ్యాచ్​కు సంబంధించిన టాస్ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందులో టాస్ కాయిన్​కు రెండు వైపులా హెడ్స్ ఉందని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ అంటున్నారు. ఆడియెన్స్​ను పిచ్చోళ్లని చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.

ఐపీఎల్ మొత్తం ఫిక్సింగేనని విమర్శలు చేస్తున్నారు నెటిజన్స్. ఇంత పబ్లిక్​గా ఫిక్సింగ్ చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎవరెవరి హస్తం ఉందో తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే లక్నో-డీసీ మ్యాచ్ టాస్ వీడియోను సరిగ్గా గమనిస్తే ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదనిపిస్తోందని క్రికెట్ లవర్స్ అంటున్నారు. ఆ టాస్ కాయిన్​కు ఒకవైపు H (హెడ్స్), మరోవైపు T (టెయిల్స్) ఉన్నాయి. అయితే కాయిన్​ను ఫుల్ స్పీడ్​గా తిప్పడంతో అది అర్థం కావట్లేదు. ఇది తెలుసుకోకుండా.. ఫిక్సింగ్ అంటూ ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. ఐపీఎల్​లో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా నిర్వహిస్తున్నారని.. మెగా లీగ్ మీద బురద జల్లడం కరెక్ట్ కాదని అంటున్నారు. మరి.. ఐపీఎల్ అంతా ఫిక్సింగే అనే ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by Memesbroo❤️🤌 (@memeschuseytimeindi_)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి