Nidhan
రీఎంట్రీలో రిషబ్ పంత్ రెచ్చిపోతున్నాడు. రెండేళ్లు ఆటకు దూరమైన ఈ స్టైలిష్ బ్యాటర్ ఆ కసిని అంతా బంతి మీద చూపిస్తున్నాడు. బాల్ కనిపించిందే తడవుగా బాదేస్తున్నాడు.
రీఎంట్రీలో రిషబ్ పంత్ రెచ్చిపోతున్నాడు. రెండేళ్లు ఆటకు దూరమైన ఈ స్టైలిష్ బ్యాటర్ ఆ కసిని అంతా బంతి మీద చూపిస్తున్నాడు. బాల్ కనిపించిందే తడవుగా బాదేస్తున్నాడు.
Nidhan
ఘోర ప్రమాదం తర్వాత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ రెచ్చిపోయి ఆడుతున్నాడు. యాక్సిడెంట్ వల్ల రెండేళ్లు ఆటకు దూరమైన ఈ స్టైలిష్ బ్యాటర్.. ఆ కసిని అంతా బంతి మీద చూపిస్తున్నాడు. బాల్ కనిపించిందే తడవుగా బాదేస్తున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ను కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తున్న పంత్.. బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. డీసీ గెలుపోటముల సంగతి పక్కనబెడితే.. ఇప్పుడంతా పంత్ విస్ఫోటనం గురించే మాట్లాడుకుంటున్నారు. ఐపీఎల్-2024లో ఆడిన 4 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 152 రన్స్ చేశాడతను. వరుసగా 2 ఫిఫ్టీలు బాదాడు. డీసీ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉన్న పంత్.. బుధవారం కోల్‌కతా నైట్ రైడర్స్ మీద చెలరేగిపోయాడు. అతడు కొట్టిన ఓ షాట్ చూసి కింగ్ ఖాన్ షారుక్ బిత్తరపోయాడు.
వెంకటేష్ అయ్యర్ వేసిన 12వ ఓవర్లో పంత్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు పంత్. అదే ఓవర్లో అతడు కొట్టిన ఓ ఫ్లిక్ షాట్ వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఫుల్ లెంగ్త్‌లో అయ్యర్ వేసిన బాల్‌ను కాస్త వంగి లెగ్ సైడ్ ఫ్లిక్ షాట్ కొట్టాడు పంత్. నిల్చున్న చోటు నుంచే ఎక్కువ బలం కూడా యూజ్ చేయుకుండా కేవలం తన మోకాళ్లు, చేతుల సాయంతో ఆ బాల్‌ను పర్ఫెక్ట్ టైమింగ్‌తో ఫ్లిక్ చేశాడు పంత్. బాల్ పడుతున్న సమయంలో మాత్రమే దాని వైపు చూసిన పంత్ షాట్ ఫినిష్ అయ్యాక చూడలేదు. ఈ అద్భుతమైన నో లుక్ షాట్‌కు బంతి కాస్తా వెళ్లి స్టాండ్స్‌లో పడింది. ఈ సిక్స్ చూసి కేకేఆర్ యజమాని షారుక్ షాకయ్యాడు. ఇదేం షాట్ రా బాబు అంటూ బిత్తరపోయాడు. వెంటనే తేరుకొని చప్పట్లు కొడుతూ ప్రత్యర్థి టీమ్ బ్యాటర్ అయిన రిషబ్‌ను మెచ్చుకున్నాడు.
కోల్‌కతాతో మ్యాచ్‌లో ఓవరాల్‌గా 25 బంతులు ఎదుర్కొన్న పంత్ 55 పరుగులు చేశాడు. ఇందులో 4 బౌండరీలతో పాటు 5 భారీ సిక్సులు ఉన్నాయి. రిషబ్‌తో పాటు ట్రిస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 54) కూడా తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అయినా కేకేఆర్ సంధించిన 272 పరుగుల భారీ స్కోరును ఛేజ్ చేయలేకపోయింది డీసీ. ఆ టీమ్ 166 పరుగులకే కుప్పకూలింది. ఓడిపోయినా గానీ పంత్, స్టబ్స్ ఆడిన తీరుకు అంతా ఇంప్రెస్ అయ్యారు. ముఖ్యంగా ఈ టోర్నీతో కమ్‌బ్యాక్ ఇచ్చిన రిషబ్ షాట్లు కొట్టిన విధానం, ఫియర్లెస్ అప్రోచ్, ఫిట్నెస్, ఫామ్ చూసి టీమిండియా ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అతడు ఇలాగే ఆడితే టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు తిరుగుండదని చెబుతున్నారు. ఇక, పంత్ షాట్‌కు బిత్తరపోయిన షారుక్.. మ్యాచ్ ముగిశాక అతడ్ని కలసి హగ్ చేసుకున్నాడు. మరి.. రిషబ్ నో లుక్ షాట్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: వీడియో: ఇది కదా డెలివరీ అంటే.. రస్సెల్ పై పగ తీర్చుకున్న ఇషాంత్..
NO LOOK SIX BY RISHABH PANT….!!!! 🔥🫡pic.twitter.com/IXg736aihr
— Johns. (@CricCrazyJohns) April 3, 2024