Nidhan
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో సూపర్ జియాంట్స్ చేతిలో 6 వికెట్లే తేడాతో ఓటమిపాలైంది రుతురాజ్ సేన.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో సూపర్ జియాంట్స్ చేతిలో 6 వికెట్లే తేడాతో ఓటమిపాలైంది రుతురాజ్ సేన.
Nidhan
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్నో సూపర్ జియాంట్స్ చేతిలో 6 వికెట్లే తేడాతో ఓటమిపాలైంది రుతురాజ్ సేన. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిస సీఎస్కే ఓవర్లన్నీ ఆడి 4 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్నో ఛేజ్ చేయడం కష్టమేనని అంతా అనుకున్నారు. అందుకు తగ్గట్లే ఆ టీమ్‌కు మంచి స్టార్ట్ దొరకలేదు. స్కోరు బోర్డు మీదకు ఒక్క పరుగు కూడా చేరకుండానే ఓపెనర్ క్వింటన్ డికాక్ ఔట్ అయ్యాడు. 88 పరుగులకు 3 వికెట్లతో కష్టాల్లో పడింది లక్నో. కానీ మార్కస్ స్టొయినిస్ (63 బంతుల్లో 124) ఒంటిచేత్తో ఎల్ఎస్జీని ఒడ్డున పడేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇద్దరు లక్నో ఫ్యాన్స్ వేలాది మంది చెన్నై అభిమానుల్ని సైలెంట్ అయ్యేలా చేశారు.
లక్నోతో సీఎస్కే మ్యాచ్. ఎల్లో జెర్సీలతో చెపాక్ స్టేడియం మొత్తం పసుపుమయం అయింది. ఎక్కడ చూసినా చెన్నై అభిమానుల ఈలలు, గోలలు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రుతురాజ్ సేన భారీ స్కోరు బాదడంతో సీఎస్కే ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. వాళ్ల విజిల్స్, చప్పళ్లతో స్టేడియం దద్దరిల్లింది. అయితే ఛేజింగ్‌లో సీన్ పూర్తిగా మారిపోయింది. 12 ఓవర్ వరకు మ్యాచ్ మొత్తం చెన్నై చేతుల్లోనే ఉంది. కానీ అక్కడి నుంచి చెలరేగి ఆడిన స్టొయినిస్ బౌండరీలు, భారీ సిక్సులతో విరుచుకుపడ్డాడు. చూస్తుండగానే మ్యాచ్‌ను లక్నో వైపు తిప్పేశాడు. ఆఖర్లో నికోలస్ పూరన్ (15 బంతుల్లో 34), దీపక్ హుడా (6 బంతుల్లో 17) కూడా రెచ్చిపోయి ఆడటంతో ఎల్ఎస్జీ విజయతీరాలకు చేరుకుంది. ఈ తరుణంలో ఇద్దరు లక్నో ఫ్యాన్స్ చెన్నై అభిమానులకు చుక్కలు చూపించారు.
స్టొయినిస్ భారీ షాట్లతో విరుచుకుపడుతున్న టైమ్‌లో సీఎస్కే ఫ్యాన్స్ మధ్య ఓ లక్నో ఫ్యాన్ హల్చల్ చేశాడు. ఎల్ఎస్జీ జెర్సీలో ఉన్న ఆ యువకుడు డ్యాన్సులు చేస్తూ, అరుస్తూ తెగ సందడి చేశాడు. తన ఫేవరెట్ టీమ్ విజయానికి చేరువగా రావడంతో అతడు విజిల్స్ వేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ టైమ్‌లో సీఎస్కే అభిమానులు మాత్రం తలపై చేతులు వేసుకొని నిశ్శబ్దంగా అతడ్ని చూస్తూ ఉండిపోయారు. ఇంకో స్టాండ్‌లో ఓ పిల్లాడు లక్నో గెలుపును సెలబ్రేట్ చేసుకున్నాడు. పక్కనే ఉన్న సీఎస్కే అభిమానులను రెచ్చగొడుతూ డ్యాన్స్ చేశాడు. ఇలా ఈ ఇద్దరూ కలసి వేలాది మంది చెన్నై అభిమానుల నోళ్లు మూయించారు. సోషల్ మీడియాలో ఆ కుర్రాడు, ఈ పిల్లాడు ఇద్దరూ వైరల్ అయిపోయారు. అంత మంది ముందు కూడా తమ టీమ్ మీద ఉన్న ఇష్టాన్ని భయం లేకుండా చూపించిన వీళ్లను నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. గ్రౌండ్లో స్టొయినిస్ హీరో అయితే, స్టాండ్స్‌లో వీళ్లిద్దరూ హీరోలని ప్రశంసిస్తున్నారు.
A young Lucknow Super Giants fan enjoying the time at Chepauk 😀👌
– Cutest video of the day. pic.twitter.com/PVfanGgq2g
— Johns. (@CricCrazyJohns) April 24, 2024
Stoinis the hero in the pitch & this fan is the hero in the stand for LSG. 👌 pic.twitter.com/vajD1W7pDh
— Johns. (@CricCrazyJohns) April 23, 2024