Nidhan
ఐపీఎల్-2024లో ఛాంపియన్‌గా అవతరించింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఫైనల్ ఫైట్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి కప్పును సొంతం చేసుకుంది అయ్యర్ సేన. ఈ నేపథ్యంలో ఆ టీమ్‌కు ఎన్ని కోట్లు ప్రైజ్‌మనీగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్-2024లో ఛాంపియన్‌గా అవతరించింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఫైనల్ ఫైట్‌లో సన్‌రైజర్స్‌ను ఓడించి కప్పును సొంతం చేసుకుంది అయ్యర్ సేన. ఈ నేపథ్యంలో ఆ టీమ్‌కు ఎన్ని కోట్లు ప్రైజ్‌మనీగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
ఐపీఎల్ నయా ఛాంపియన్‌గా అవతరించింది కోల్‌కతా నైట్ రైడర్స్. 10 ఏళ్ల కప్పు దాహాన్ని తీర్చుకుంది. చెన్నై వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన సండే ఫైట్‌లో కేకేఆర్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కమిన్స్ సేన 113 పరుగులకే కుప్పకూలింది. స్వల్ప లక్ష్య ఛేదనలో కోల్‌కతా 10.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలను చేరుకుంది. పదేళ్ల తర్వాత ట్రోఫీని ముద్దాడిన కేకేఆర్ సంబురాల్లో మునిగిపోగా.. ఫైనల్ వరకు అద్భుతంగా ఆడుతూ వచ్చిన ఎస్ఆర్హెచ్ ఓటమితో రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్లో టైటిల్ విన్నర్, రన్నరప్‌తో పాటు బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిన ఆటగాళ్లకు భారీ మొత్తం ప్రైజ్‌మనీ దక్కింది. కప్పు గెలిచిన కోల్‌కతాకు ఎన్ని కోట్లు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం..
సన్‌రైజర్స్‌ను ఓడించి కప్పు గెలిచిన కోల్‌కతాకు అత్యధికంగా రూ.20 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది. ఫైనల్లో ఓడినప్పటికీ ఆరెంజ్ ఆర్మీకి కూడా భారీ మొత్తం సొంతమైంది. రన్నరప్‌గా నిలిచిన కమిన్స్ సేన రూ.12.5 కోట్లు అందుకుంది. ఈ ఏడాది బెస్ట్ గ్రౌండ్ అండ్ పిచ్‌గా ఎంపికైంది ఉప్పల్ స్టేడియం. అందుకు గానూ రూ.50 లక్షలు అందుకుంది. ఈ సీజన్ ఆసాంతం బ్యాట్‌తో రఫ్ఫాడించిన కింగ్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు. అందుకు గానూ రూ.10 లక్షలు దక్కించుకున్నాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ అయిన పంజాబ్ కింగ్స్ పేసర్ హర్షల్ పటేల్‌కు రూ.10 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి రూ.10 లక్షలు దక్కాయి.
క్లీన్ హిట్టింగ్తో బంతుల్ని అవలీలగా స్టాండ్స్‌లోకి తరలిస్తూ పోయిన ఢిల్లీ క్యాపిటల్స్ చిచ్చర పిడుకు జేక్ ఫ్రేజర్ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్‌గా నిలిచాడు. ఈ అవార్డు కింద ఫ్రేజర్‌కు రూ.10 లక్షల ప్రైజ్‌మనీ అందింది. ఫాంటసీ ప్లేయర్ అవార్డు కింద కేకేఆర్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌కు రూ.10 లక్షలు దక్కాయి. దీంతో పాటు అత్యంత విలువైన ఆటగాడిగా మరో రూ.10 లక్షల్ని అతడు కొట్టేశాడు. అత్యధిక సిక్సులు (42 సిక్సులు) బాదిన ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ రూ.10 లక్షలు సొంతం చేసుకున్నాడు. అత్యధిక బౌండరీలు కొట్టిన మరో సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ (64 ఫోర్లు) కూడా అంతే మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. కేకేఆర్ బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ కింద రూ.10 లక్షలు అందుకున్నాడు. కప్పు మిస్సైనా ఫెయిర్ ప్లే అవార్డును సొంతం చేసుకుంది సన్‌రైజర్స్. ఈ పురస్కారం కింద రూ.10 లక్షలు కూడా దక్కాయి.
Captain Shreyas Iyer collects the 20cr prize money!! 🏆 pic.twitter.com/fICWwY55VD
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024
Pat Cummins collects Runner Ups prize money of 12.5cr. pic.twitter.com/xRtUWe8hvj
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 26, 2024