Nidhan
టాలెంట్ ఉన్న ఆటగాళ్లను కూడా ఒక్కోసారి జట్లు వద్దనుకుంటాయి. కానీ అలా వదిలేసిన వారిలో కొందరు ఇతర జట్లకు మారాక మ్యాచ్ విన్నర్స్‌గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
టాలెంట్ ఉన్న ఆటగాళ్లను కూడా ఒక్కోసారి జట్లు వద్దనుకుంటాయి. కానీ అలా వదిలేసిన వారిలో కొందరు ఇతర జట్లకు మారాక మ్యాచ్ విన్నర్స్‌గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి క్రికెటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Nidhan
ఐపీఎల్లో టాలెంట్ ఉన్న ఆటగాళ్లను కూడా ఒక్కోసారి జట్లు వద్దనుకుంటాయి. ఒక సీజన్లో ఫ్లాప్ అయితే పక్కన బెట్టేస్తాయి. ఒక్కోసారి క్లిక్ అయిన వారిని కూడా వద్దనుకుంటాయి. తమకు నమ్మకం లేని వారిని ఆక్షన్‌లో రిలీజ్ చేసేస్తాయి. కానీ అలా వదిలేసిన వారిలో కొందరు ఇతర జట్లకు మారాక మ్యాచ్ విన్నర్స్‌గా మారిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఫ్రాంచైజీతో లాంగ్ టైమ్ జర్నీ చేయాలనుకునే ప్లేయర్లు మధ్యలో ఇలా హ్యాండిస్తే చాలా బాధపడతారు. తమను తీసేశారనే కసిని నెక్స్ట్ టోర్నీలో చూపిస్తారు. అలా రస్సెల్ నుంచి సూర్యకుమార్ వరకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు వద్దనుకున్న ప్లేయర్లు ఇతర జట్లలోకి చేరాక మ్యాచ్ విన్నర్లుగా మారి కీలకపాత్ర పోషించడం చూస్తున్నాం. మరి.. ఒక టీమ్‌లో క్లిక్ అయినా వదిలివేయబడిన ఆటగాళ్లు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం..
సూర్యకుమార్ వరల్డ్ క్రికెట్లో టీ20ల్లో బెస్ట్ బ్యాటర్‌గా కొనసాగుతున్న ఆటగాడు. కానీ ఒకప్పుడు అతడి గురించి ఎవరికీ తెలియదు. ముంబై ఇండియన్స్‌కు ఆడుతూ టీమ్ విజయాల్లో కీలకంగా మారిన మిస్టర్ 360.. తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్‌కు సెలక్ట్ అయ్యాడు. 2012లో అతడ్ని ఒక్క మ్యాచ్‌లో మాత్రమే ఆడించింది కేకేఆర్. అందులోనూ అతడు డకౌట్ అయ్యాడు. దీంతో అతడ్ని వదిలేసింది. సూర్యలోని టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించడంలో ఆ జట్టు ఫెయిలైంది. ఆ తర్వాత ముంబైకి మారాడు సూర్య. ఆ టీమ్ తరఫున అదరగొడుతూ ఏకంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఈ స్థాయికి ఎదిగాడు.
స్టార్ ఆల్‌రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంటే వెంటనే అందరికీ కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ గుర్తుకొస్తుంది. అంతగా ఆ జట్టుతో అతడు మమేకం అయ్యాడు. ఓటమి ఖాయం అనుకున్న ఎన్నో మ్యాచుల్లో కేకేఆర్‌ను సింగిల్ హ్యాండ్‌తో బయటపడేశాడు రస్సెల్. ఈ సీజన్లో అతడు మంచి ఊపు మీద ఉన్నాడు. అయితే ఈ విండీస్ వీరుడ్ని ఒకప్పుడు వద్దనుకుంది ఢిల్లీ డేర్‌డెవిల్స్. 2012-13 సీజన్లో ఆడించి తప్పించింది. ఢిల్లీ వద్దనుకున్న రస్సెల్ కేకేఆర్‌కు వరంగా మారాడు.
స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. అవసరమైన టైమ్‌లో బ్రేక్ త్రూలు అందిస్తూ రాజస్థాన్‌కు తురుపుముక్కగా మారాడు. అయితే అతడు ఇంతకుముందు రెండు టీమ్స్ మారాడు. 2011లో ముంబై ఇండియన్స్‌కు సెలక్ట్ అయిన ఈ లెగ్ స్పిన్నర్ కేవలం ఒకే మ్యాచ్ ఆడాడు. రెండేళ్ల పాటు అదే జట్టుతో జర్నీ చేశాక.. 2014లో ఆర్సీబీకి షిఫ్ట్ అయ్యాడు. ఆ జట్టు తరఫున 114 మ్యాచ్‌లు ఆడాడు. బెంగళూరుకు సుదీర్ఘ కాలం సేవలు అందించిన చాహల్‌ను 2022లో జరిగిన ఆక్షన్‌లో ఫ్రాంచైజీ రీటెయిన్ చేసుకోలేదు. అతడ్ని రాజస్థాన్ రూ.6.50 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది.
ఐపీఎల్ హిస్టరీలో గ్రేటెస్ట్ ప్లేయర్స్‌లో ఒకడిగా డివిలియర్స్‌ను చెప్పొచ్చు. అయితే ఏబీడీ అంటే అందరూ ఆర్సీబీ ప్లేయర్‌గానే చూస్తారు. ఆ టీమ్‌కే మాత్రమే అతడు ఆడాడని అనుకుంటారు. కానీ మొదట డివిలియర్స్ ఆడింది ఢిల్లీ డేర్‌డెవిల్స్ టీమ్‌కు అనేది చాలా మందికి తెలియదు. తొలి మూడు సీజన్లు ఆ జట్టుకే ఆడాడు. 2011 నుంచి ఆర్సీబీకి ఆడటం స్టార్ట్ చేశాడు ఏబీడీ.
ఐపీఎల్లో వార్నర్ పేరు చెబితే ఠక్కున సన్‌రైజర్స్ హైదరాబాద్ గుర్తుకొస్తుంది. 2016లో ఎస్ఆర్హెచ్కు కప్ అందించాడతను. తెలుగువాళ్లకు ఎంతో దగ్గరైన అతడ్ని ముద్దుగా డేవిడ్ భాయ్ అని పిలుస్తుంటారు. అయితే సన్‌రైజర్స్‌ను వీడి రెండేళ్ల కింద ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లిపోయాడు. ఢిల్లీ టీమ్‌తో అతడిది సుదీర్ఘ ప్రయాణం. ఐపీఎల్ డెబ్యూ కూడా అదే జట్టు తరఫున ఇచ్చాడు. 2009 నుంచి 2013 వరకు ఢిల్లీకే ఆడాడు. ఎస్ఆర్హెచ్ రిటైన్ చేసుకోకపోవడంతో మళ్లీ అదే టీమ్‌కు వెళ్లిపోయాడు.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ తన ఐపీఎల్ జర్నీని కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌తో స్టార్ట్ చేశాడు. 2018 నుంచి 2022 వరకు అదే జట్టుకు ఆడాడు. రెండేళ్ల కింద జీటీ అతడ్ని ఆక్షన్‌లో దక్కించుకుంది. హార్దిక్ పాండ్యా ముంబైకి వెళ్లిపోవడంతో గిల్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో తన ఐపీఎల్ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఆఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్. 2018 నుంచి 2021 వరకు అదే జట్టుకు ఆడాడు. గత మూడేళ్ల నుంచి గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్నాడు.
స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చి 11 ఏళ్లు అవుతోంది. ఈ గ్యాప్‌లో అతడు నాలుగు టీమ్స్ మారాడు. తొలుత ఆర్సీబీకి ఆడిన రాహుల్.. ఆ తర్వాత సన్‌రైజర్స్‌కు షిఫ్ట్ అయ్యాడు. అనంతరం 2018లో పంజాబ్ కింగ్స్ మారి నాలుగేళ్లు ఆ జట్టుతోనే ట్రావెల్ చేశాడు. అయితే 2022లో లక్నో సూపర్ జియాంట్స్‌కు మారాడు. అప్పటి నుంచి ఆ టీమ్‌ను కెప్టెన్‌గా ముందుండి లీడ్ చేస్తున్నాడు రాహుల్.
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జాస్ బట్లర్ 2016లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. రెండేళ్ల పాటు ఆ టీమ్‌కు ఆడిన తర్వాత రాజస్థాన్ రాయల్స్‌కు షిఫ్ట్ అయ్యాడు బట్లర్. అప్పటి నుంచి అదే టీమ్‌కు ఆడుతున్నాడు.
ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ 2012లో ఐపీఎల్లో డెబ్యూ ఇచ్చాడు. 2021 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడుతున్నాడు. పించ్ హిట్టింగ్తో ఎన్నో మ్యాచుల్లో ఆర్సీబీకి విజయాలు అందించాడు మాక్సీ. అయితే బెంగళూరు కంటే ముందు ముంబై ఇండియన్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు మాక్సీ.