Nidhan
కేకేఆర్ పించ్ హిట్టర్ ఆండ్రీ రస్సెస్ మాస్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో హిట్టింగ్‌కు కొత్త డెఫినిషన్ చెబుతూ ఉప్పెనలా చెలరేగిపోయాడు.
కేకేఆర్ పించ్ హిట్టర్ ఆండ్రీ రస్సెస్ మాస్ బ్యాటింగ్‌తో రెచ్చిపోయాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో హిట్టింగ్‌కు కొత్త డెఫినిషన్ చెబుతూ ఉప్పెనలా చెలరేగిపోయాడు.
Nidhan
ఫామ్ టెంపరరీ, క్లాస్ పర్మినెంట్ అని క్రికెట్లో ఓ సామెత ఉంది. దాన్ని మరోమారు ప్రూవ్ చేశాడు కోల్‌కతా నైట్ రైడర్స్ పించ్ హిట్టర్ అండ్రీ రస్సెల్. గత రెండు, మూడు ఐపీఎల్ సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేదతను. అయినా అతడిపై నమ్మకం ఉంచిన కేకేఆర్ మేనేజ్మెంట్ కంటిన్యూ చేస్తూ వచ్చింది. ఎలాగైనా ఈ సీజన్లో రాణించాలని డిసైడ్ అయిన రస్సెల్.. సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో సూపర్బ్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు రస్సెల్. హిట్టంగ్కు కొత్త డెఫినిషన్ ఇస్తూ బౌలర్లను ఊచకోత కోశాడు.
సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో 20 బంతుల్లోనే 50 పరుగుల మార్క్‌ను చేరుకున్నాడు రస్సెల్. మొత్తంగా 25 బంతులు ఎదుర్కొన్న ఈ పించ్ హిట్టర్.. 64 పరుగులు చేశాడు. ఇందులో 3 బౌండరీలు, 7 భారీ సిక్సులు ఉన్నాయి. తాను ఫేస్ చేసిన ప్రతి రెండో బాల్‌కు ఫోర్ లేదా సిక్స్ కొట్టాడతను. అతడి తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఎస్ఆర్హెచ్ బౌలర్లు బేజారైపోయారు. ఒకదశలో 51 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ కేకేఆర్‌ను రమన్‌ప్రీత్ సింగ్ (35) ఆదుకున్నాడు. ఆ తర్వాత రింకూ సింగ్ (23)తో కలసి రస్సెల్ (64 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. వీళ్ల దెబ్బకు బుల్లెట్ వేగంతో పరుగులు తీసింది స్కోరు బోర్డు. మొత్తంగా కేకేఆర్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 7 వికెట్లకు 208 పరుగులు చేసింది. మరి.. రస్సెల్ ఊచకోత మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
A 20 BALL FIFTY BY ANDRE RUSSELL….!!!
– RUSSELLMANIA IS HERE. pic.twitter.com/VFqasvTFAD
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 23, 2024
ANDRE RUSSELL IS UNSTOPPABLE 🔥🤯pic.twitter.com/5VjFhHOKLY
— Johns. (@CricCrazyJohns) March 23, 2024