వరుస ఓటములతో డీలాపడ్డ ముంబై.. ​ప్లేఆఫ్స్​కు వెళ్లాలంటే అదొక్కటే దారి!

ఐపీఎల్-2024ను ఫేవరెట్స్​లో ఒకటిగా స్టార్ట్ చేసింది ముంబై ఇండియన్స్. కానీ ఫస్టాఫ్ ముగిసేసరికి వరుస ఓటములతో డీలా పడింది. అయితే ఇంకా హార్దిక్ సేన ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి.

ఐపీఎల్-2024ను ఫేవరెట్స్​లో ఒకటిగా స్టార్ట్ చేసింది ముంబై ఇండియన్స్. కానీ ఫస్టాఫ్ ముగిసేసరికి వరుస ఓటములతో డీలా పడింది. అయితే ఇంకా హార్దిక్ సేన ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగానే ఉన్నాయి.

ఐపీఎల్-2024ను ఫేవరెట్స్​లో ఒకటిగా స్టార్ట్ చేసింది ముంబై ఇండియన్స్. కానీ ఫస్టాఫ్ ముగిసేసరికి వరుస ఓటములతో డీలా పడింది. కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు మాజీ సారథి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్​ప్రీత్ బుమ్రా, ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, తిలక్ వర్మ వంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్లు ఉన్న టీమ్ ఇంత చెత్తగా ఆడుతుందని ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయలేదు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్​.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు దారుణంగా పెర్ఫార్మ్ చేస్తూ విమర్శల పాలవుతోంది. వరుస ఓటముల నేపథ్యంలో నిన్న లక్నో సూపర్ జియాంట్స్​తో మ్యాచ్​లోనైనా గెలిచి ట్రాక్​లోకి వస్తుందని అనుకుంటే మళ్లీ ఫెయిలైంది. అయితే ఇన్ని ఓటములు ఎదురైనా ఆ టీమ్ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి.

ఈ సీజన్ ఫస్టాఫ్​లో చెత్తగా ఆడిన ముంబై.. సెకండాఫ్​లోనూ అదే ఆటతీరును కంటిన్యూ చేస్తోంది. ఇప్పటిదాకా ఆడిన 10 మ్యాచుల్లో మూడింట గెలిచి, ఏడింట ఓడింది హార్దిక్ సేన. దీంతో ఆ జట్టు ప్లేఆఫ్స్​కు చేరడం కష్టమేనని అంతా అనుకుంటున్నారు. అయితే ఎంఐ ప్లేఆఫ్స్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. పది మ్యాచుల్లో మూడు విజయాలు సాధించిన ఆ జట్టు 6 పాయింట్లతో టేబుల్​లో కింద నుంచి రెండో స్థానంలో ఉంది. ముంబై ఇంకా 4 మ్యాచులు ఆడాల్సి ఉంది. ప్లేఆఫ్స్ చేరాలంటే ఆ నాలుగింట్లోనూ తప్పకుండా నెగ్గాలి. అన్ని మ్యాచుల్లో గెలిస్తే ఆ జట్టు పాయింట్ల సంఖ్య 14కు చేరుతుంది.

ప్లేఆఫ్స్​కు చేరాలంటే కనీసం 16 పాయింట్లు ఉండాలి. అయితే ఒక్కోసారి ఇతర జట్ల గెలుపోటములను బట్టి 14 పాయింట్లు ఉన్నా ప్లేఆఫ్స్​కు చేరుకోవచ్చు. కానీ ఇది ఎప్పుడో ఒకసారి ఏదో ఒక టీమ్ విషయంలో అనూహ్యంగా జరుగుతుంది. తీవ్ర పోటీ ఉంటే మాత్రం ప్లేఆఫ్స్ రేసు నుంచి బయటకు రావాల్సిందే. ముంబై తదుపరి ఆడే అన్ని మ్యాచుల్లో నెగ్గాలి. ఇదొక్కటే వారి చేతుల్లో ఉంది. ప్లేఆఫ్స్​కు వెళ్తుందా? లేదా? అనేది ఇతర టీమ్స్ గెలుపోటముల మీద ఆధారపడి ఉంటుంది. అన్ని మ్యాచులు నెగ్గినా ప్లేఆఫ్స్ బెర్త్ పక్కా అని చెప్పలేం. టెక్నికల్​గా చెప్పాలంటే ముంబై ప్లేఆఫ్స్ రేసులో లేదు. కానీ అదృష్టం కలిసొచ్చి ఏదైనా అద్భుతం జరిగితే చెప్పలేం. మరి.. ముంబై ప్లేఆఫ్స్​కు వెళ్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments