Tirupathi Rao
Hyderabad Rains- SunRisers Hyderabad Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు క్లిష్టంగా మారిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో వరుణుడు గట్టిగానే దెబ్బేసేలా ఉన్నాడు.
Hyderabad Rains- SunRisers Hyderabad Playoffs: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఇప్పుడు క్లిష్టంగా మారిపోయింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో వరుణుడు గట్టిగానే దెబ్బేసేలా ఉన్నాడు.
Tirupathi Rao
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో అభిమానులను అలరిచింది. ప్లే ఆఫ్స్ కు అడుగుదూరంలో నిల్చుని ఉంది. ఈ సీజన్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో మునుపెన్నడూ చూపించని అత్యుత్తమ ప్రదర్శన చేశారు. అయితే గత కొన్ని మ్యాచుల్లో మాత్రం హైదరాబాద్ జట్టు కాస్త తడబడింది. ఆర్సీబీ, ముంబయి మీద జరిగిన మ్యాచుల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటమి పాలైంది. అయితే ఆ ప్రభావం రేపు హైదరాబాద్ వేదికగా జరగబోయే మ్యాచ్ మీద పడింది. ఇది హైదరాబాద్ జట్టుకు తప్పక గెలవాల్సిన మ్యాచ్. అయితే హైదరాబాద్ మ్యాచ్ పై వరుణుడు నీళ్లు జల్లుతున్నాడు.
వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అనే సామెత వినే ఉంటారు. ఇప్పుడు భానుడి భగ భగలు తట్టుకోలేక నగర వాసులంతా వర్షాలు పడాలి అని కోరుకున్నారు. అందరూ కోరుకున్నట్లుగా హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించిన విధంగానే తెలంగాణలోనే కాకుండా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మొదలు అయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్ లో అయితే ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన అతి భారీ వర్షం కురిసింది. ఇప్పుడు ఈ వర్షం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు జల్లేలా కనిపిస్తోంది. బుధవారం హైదరాబాద్ వేదికగా హైదరాబాద్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడనుంది.
ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంలో ఉంటే.. లక్నో సూపర్ జెయింట్స్ నెట్ రన్ రేట్ వల్ల ఐదో స్థానంలో ఉంది. రేపు మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు గనుక విజయం సాధించకపోతే లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో స్థానానికి వచ్చేస్తుంది. ఒకవేళ మ్యాచ్ గనుక డ్రా అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కేవలం ఒక పాయింట్ మాత్రమే వస్తుంది. అది భవిష్యత్ లో ప్లే ఆఫ్స్ ఆశలపై నీళ్లు జల్లే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా హైదరాబాద్ తరహాలోనే పాయింట్స్ కలిగి ఉన్నారు. ఇలా జరిగింతే తర్వాత ప్లే ఆఫ్స్ కు హైదరాబాద్ దూరం కావచ్చు. ఇలా హైదరాబాద్ లో రాక రాక వర్షాలు కురిస్తే అది హైదరాబాద్ జట్టుకే తలనొప్పి తెచ్చి పెట్టడంపై హైదరాబాద్ జట్టు ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఎలాగైనా హైదరాబాద్ జట్టు రేపటి మ్యాచ్ లో విజయం సాధించాలని కోరుకుంటున్నారు.
ఇంక వర్షాల విషయానికి వస్తే.. మంగళవారం హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసిందే. ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. చెట్లు కూడా కూలిపోయాయి. వర్షం అధికంగా పడిన ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నగరంలో జన జీవనం అస్తవ్యస్తం కాకుండా తగిన చర్యలు తీసుకున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అధికారులకు సమాచారం అందించాలంటూ కోరుతున్నారు. హైదరాబాద్ వర్షం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఎసరు తెచ్చి పెట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.