20 కోట్ల ప్రైజ్ మనీకి 200 కోట్ల ఖర్చు.. IPLలో ఓనర్స్‌కి ఆదాయం ఎలా వస్తుందంటే?

How IPL Teams Make Money: కోట్లు కుమ్మరించి ఐపీఎల్ జట్లను మెయిన్ టైన్ చేస్తుంటారు. కానీ, ఆ లీగ్ ప్రైజ్ మనీ రూ.20 కోట్లు మాత్రమే. మరి.. రూ.20 కోట్ల కోసం రూ.200 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?

How IPL Teams Make Money: కోట్లు కుమ్మరించి ఐపీఎల్ జట్లను మెయిన్ టైన్ చేస్తుంటారు. కానీ, ఆ లీగ్ ప్రైజ్ మనీ రూ.20 కోట్లు మాత్రమే. మరి.. రూ.20 కోట్ల కోసం రూ.200 కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారు?

ఇండియన్ ప్రీమియర్ లీగ్.. గత 16 ఏళ్లుగా క్రికెట్ అభిమానుల నుంచి అత్యంత ఆదరణ పొందుతున్న లీగ్. బీసీసీఐ నిర్వహిస్తున్న ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. 2 నెలలు సాగే ఈ సీజన్ కోసం క్రికెట్ లవర్స్ ఏడాది పొడవునా ఎదురుచూస్తుంటారు. ఒక్కో మ్యాచ్ కి వచ్చే రెస్పాన్స్ చూస్తే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు కూడా ఈ లీగ్ ముందు దిగదుడుపే అనే భావన కలుగుతుంది. వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ ప్లేయర్లు అందరూ ఈ లీగ్ లో ఆడేందుకు క్యూ కడుతుంటారు. దేశీయంగా ఉన్న యంగ్ టాలెంట్ ఈ లీగ్ వల్ల ఎంతో త్వరగా వెలుగులోకి వస్తోంది. టీమిండియాకి ఈ లీగ్ నుంచే ఎక్కువ మంది స్టార్స్ వస్తున్నారు. ఈ లీగ్ లో టీమ్స్ మెయిన్ టైన్ చేయడం చాలా ఖర్చుతో కూడుకున్నది. దాదాపు రూ.200 కోట్లు కావాలి అంటారు. మరి.. రూ.20 కోట్ల ప్రైజ్ మనీ కోసం రూ.200 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? వారికి అసలు ఆదాయం ఎలా వస్తుంది?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో జట్టును పొందడం, దానిని మెయన్ టైన్ చేయడం అంటే అంత తేలిక కాదు. దాదాపు ఒక్కో సీజన్ కి రూ.200 కోట్లు ఖర్చవుతుంది అంటారు. మరి ప్రైజ్ మనీ చూస్తే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.20 కోట్లు దక్కుతుంది. రన్నరప్ గా నిలిచిన వారికి రూ.13 కోట్లు, క్వాలిఫయర్ 2లో గెలిచిన టీమ్ కి రూ.7 కోట్లు, ఎలిమినేటర్ లో ఓడిన జట్టుకు రూ.6.5 కోట్లు అందిస్తారు. ఐపీఎల్ టైటిల్ ప్రైజ్ మనీ చూస్తే.. ఈ ఏడాది వేలంలో మిచెల్ స్టార్క్ అమ్ముడైన రూ.24.75 కోట్లు కూడా లేదు. మరి.. అలాంటి మనీ కోసం రూ.200 కోట్ల ఖర్చుతో జట్టును ఎందుకు ఆడిస్తున్నారు? మరీ ఇంత తక్కువ మనీ కోసం ఎందుకు పోరాటం అని ముక్కున వేలేసుకుంటున్నారా? అక్కడే ఒక మ్యాజిక్ ఉంది. ఐపీఎల్ ప్రైజ్ మనీ అనేది చిన్న చాక్లెట్ లాంటిది. టీమ్ ఓనర్స్ కు ఇవ్వడానికి చాలానే ఆదాయం వస్తుంది. మరి.. ఐపీఎల్ టీమ్స్ సొంతం చేసుకున్న షారుక్ ఖాన్, ప్రీతీజింతా, నీతా అంబానీ, కావ్య మారన్ లాంటి ఓనర్స్ కు ఆదాయం ఎలా వస్తుందో చూద్దాం.

టైటిల్ స్పాన్సర్:

ఐపీఎల్ జట్లకు చాలానే ఆదాయా మార్గాలు ఉంటాయి. వాటిలో ఈ టైటిల్ స్పాన్సర్ కూడా ఒకటి. మీరు ఐపీఎల్ లోగో దగ్గర టాటా ఐపీఎల్ అని చూస్తూనే ఉంటారు. దానినే టైటిల్ స్పాన్సర్షిప్ అంటారు. ఈ ఏడాదికి టైటిల్ స్పాన్సర్షిప్ కోసం టాటా కంపెనీ రూ.330 కోట్ల వరకు బీసీసీఐకి చెల్లించింది. వాటిలో 50 శాతం బీసీసీఐ ఉంచుకుంటుంది. మిగిలిన 50 శాతం టీమ్ ఓనర్స్ కి పంచేస్తుంది. అలా టైటిల్ స్పాన్సర్ రూపంలో ఆదాయం వస్తుంది.

మ్యాచ్ స్పాన్సర్ షిప్స్:

ఐపీఎల్ మ్యాచ్ లో వివిధ రకాల స్పాన్సర్ షిప్స్ ఉంటాయి. ఉదాయహరణకు క్రెడ్ పవర్ ప్లే, సియట్ టైర్స్ స్ట్రాటజిక్ టైమ్ ఔట్, టాటా నియూ వంటివి అనమాట. ఇలా స్పాన్సర్స్ రూపంలో కోట్లలో ఆదాయం వస్తుంది. ఒక్కో స్పాన్సర్ కనీసం రూ.25 కోట్లు చెల్లిస్తాడు. అలా సీజన్ లో వచ్చిన ఆదాయాన్ని 50 శాతం బీసీసీఐ ఉంచుకుంటుంది. మిగిలిన 50 శాతం టీమ్స్ ఓనర్స్ కి ఇచ్చేస్తుంది.

బ్రాడ్ కాస్టింగ్ రైట్స్:

ఐపీఎల్ మ్యాచ్ ని ఏదో ఒక టీవీ ఛానల్ లో ప్రసారం చేయాలి. ఈ మ్యాచ్ ల ప్రసారం కోసం ఎన్నో ఛానల్స్ కోట్లు కోట్లు కట్టేందుకు రెడీగా ఉంటాయి. వాటిలో ఎవరు ఎక్కువ ఇస్తే వారికి ఈ రైట్స్ ఇస్తారు. ఉదాహరణకు 2008 నుంచి 2017 వరకు ఏడాదికి 820 కోట్లు పెట్టి సోనీ నెట్వర్క్ ఐపీఎల్ మ్యాచులు బ్రాడ్ కాస్ట్ చేసింది. 2018 నుంచి 2022 వరకు స్టార్ స్పోర్ట్స్ సంస్థ ఆ రైట్స్ ని రూ.16,400 కోట్లకు కొనుగోలు చేసింది. 2024కి జియో సినిమా+ డిస్నీ కంపెనీ ఏకంగా 24 వేల కోట్లు పెట్టి బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ ఆదాయాన్ని కూడా బీసీసీఐ, టీమ్ ఓనర్స్ 50-50 రేషియోలో పంచుకుంటారు. అయితే అంత పెట్టి కొనుగోలు చేస్తే ఛానల్స్ కి ఏంటి లాభం అనే ప్రశ్న రావచ్చు. వాళ్లు యాడ్స్ రూపంలో పెట్టిన మొత్తం కంటే ఎక్కువ ఆర్జిస్తారు. మ్యాచ్ సమయంలో వచ్చే యాడ్స్ కి ఎంతో డిమాండ్ ఉంటుంది. 10 సెకన్ల టైమ్ స్లాట్ ధర రూ.15 లక్షల వరకు ఉంటుంది. ఈ యాడ్స్ రూపంలో ఛానల్స్ కి ఆదాయం వస్తుంది.

టీమ్ స్పాన్సర్స్:

బీసీసీఐ ఇచ్చే ఆదాయం మాత్రమే కాకుండా.. టీమ్ ఓనర్స్ కి అదనపు ఆదాయ మార్గాలు కూడా ఉంటాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకునేది జెర్సీ స్పాన్సర్స్ గురించి. టీమ్ జెర్సీపై మీకు రకరకాల లోగోలు కనిపిస్తాయి. వాటిని ప్రింట్ చేసేందుకు టీమ్ కు చాలానే చెల్లించాలి. ముందు పక్క లోగో వేసేందుకు రూ.30 కోట్ల వరకు ఛార్జ్ చేస్తారు. అదే వెనుకవైపు కనిపించేలా వేయాలి అంటే రూ.15 కోట్ల వరకు తీసుకుంటారు. టీమ్ కి ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ మీద ఈ ధర ఆధారపడి ఉంటుంది.

టికెట్ సేల్స్:

ఐపీఎల్ మ్యాచ్ లో టీమ్స్ తమ హోమ్ గ్రౌండ్ లో కూడా మ్యాచులు ఆడుతూ ఉంటాయి. ఆ హోమ్ గ్రౌండ్ లో ఆడే మ్యాచులకు సంబంధించి టికెట్స్ రూపంలో వచ్చే ఆదాయంలో 80 శాతం టీమ్ ఓనర్స్ కు వెళ్తుంది. మిగిలిన 20 శాతం ఆ స్టేట్ క్రికెట్ బోర్డు తీసుకుంటుంది. ఈ టికెస్ట్ రూపంలో సీజన్ కి రూ.28 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. వాటిలో 80 శాతం టీమ్ ఓనర్స్ తీసుకుంటారు. ఇలా టికెట్ సేల్స్ రూపంలో కూడా టీమ్ ఓనర్స్ కి ఆదాయం సమకూరుతుంది.

మర్చండైజ్:

మర్చండైజ్ మోడల్ రూపంలో కూడా టీమ్ ఓనర్స్ కి విపరీతమైన ఆదాయం వస్తుంది. ఫ్యాన్స్ తమ అభిమాన టీమ్ జెర్సీలను కొనుగోలు చేస్తుంటారు. అలాగే తాము మెచ్చే టీమ్స్ లోగోలు ఉండే క్యాప్స్, కీ చైన్స్, జెర్సీలను కొంటుంటారు. వీటిలో రూపంలో కూడా టీమ్ ఓనర్స్ కు ఆదాయం వస్తుంది. ముఖ్యంగా జెర్సీలపై టీమ్ ఓనర్స్ కు మంచి ఆదాయం లభిస్తుంది.

ప్రైజ్ మనీ:

ఇంక ప్రైజ్ మనీ రూపంలో కూడా టీమ్ ఓనర్స్ కి ఆదాయం వస్తుంది. టీమ్ కి రూ.20 కోట్లు, రన్నర్ కి రూ.13 కోట్లు ఇస్తారు. ఈ ప్రైజ్ మనీలో సగం టీమ్ ఓనర్స్ కు వెళ్తుంది. మిగిలిన సగాన్ని టీమ్ లో ఉండే మెంబర్స్, ఆటగాల్లకు సమానంగా పంచుతారు. ప్లేయర్లకు వేలంలో దక్కే మొత్తానికి ఇవి అదనం అని చెప్పాలి. అవి మాత్రమే కాకుండా మ్యాచ్ లో ఉత్తమ ప్రదర్శన చేస్తే అవార్డుల రూపంలో కూడా నగదు వస్తుంది. వీటికి అదనంగా ప్లేయర్లకు మ్యాచ్ ఫీజు కూడా ఉంటుంది. ఇలా బీసీసీఐ మొదలు టీమ్ ఓనర్స్, ఆటగాళ్లకు ఆదాయం సమకూరుతుంది. మరి.. ఐపీఎల్ ఆదాయామార్గాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments