Nidhan
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఆట వల్ల కాదు.. భార్య నటాషాతో విడాకుల అంశంతో అతడు వైరల్ అవుతున్నాడు. అయితే ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది.
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఆట వల్ల కాదు.. భార్య నటాషాతో విడాకుల అంశంతో అతడు వైరల్ అవుతున్నాడు. అయితే ఈ వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది.
Nidhan
టీమిండియా సీమ్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఆట వల్ల కాదు.. భార్య నటాషా స్టాంకోవిక్‌తో విడాకుల వ్యవహారం వల్ల అతడు పాన్ ఇండియా లెవల్లో వైరల్ అవుతున్నాడు. హార్దిక్-నటాషా డివోర్స్ తీసుకోవడం ఖాయమని.. భరణం కింద తన ఆస్తిలో 70 శాతాన్ని స్టాంకోవిక్‌కు పాండ్యా ఇవ్వనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. తమ బంధానికి వాళ్లు ఫుల్స్టాప్ పెట్టాలని ఫిక్స్ అయ్యారని పుకార్లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇదే తరుణంలో ఫిట్నెస్ ట్రైనర్ అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్‌తో కలసి నటాషా కనిపించింది. దీంతో హార్దిక్‌కు డివోర్స్ ఇచ్చి.. అలెక్స్‌తో కొత్త లైఫ్‌ను ఆమె స్టార్ట్ చేయనుందంటూ ఏవేవో రూమర్లు వస్తున్నాయి. ఈ టైమ్‌లో హార్దిక్-నటాషా విడాకుల వ్యవహారంలో ఊహించని ట్విస్ట్.
విడాకుల వ్యవహారంపై ఇటు హార్దిక్ గానీ అటు నటాషా గానీ అధికారికంగా స్పందించలేదు. అయినా డివోర్స్ రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతున్న తరుణంలో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. రెడ్డిట్‌లో ట్రెండింగ్ అవుతున్న ఈ పోస్ట్‌ను చూసినవాళ్లు గందరగోళానికి లోనవుతున్నారు. ఈ పోస్ట్‌తో మరో కోణం వెలుగులోకి వచ్చింది. హార్దిక్-నటాషా డివోర్స్ మ్యాటర్ కేవలం పబ్లిసిటీ స్టంటేనట. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా, ప్లేయర్‌గా ఐపీఎల్లో హార్దిక్ దారుణంగా విఫలమవడంతో అందరి దృష్టిని మరల్చడానికే విడాకుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని సమాచారం. ఫ్యాన్స్ ఆగ్రహాన్ని చల్లార్చేందుకే ఇలా ప్లాన్ చేశారని.. దీంట్లో భాగంగానే హార్దిక్, నటాషా ఇప్పటిదాకా డివోర్స్ గురించి మాట్లాడలేదని ఆ పోస్ట్‌లో రాసి ఉంది.
హార్దిక్-నటాషా విడాకుల వ్యవహారంలో మరో కోణాన్ని వెల్లడించిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందనేది పాండ్యా దంపతుల్లో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తే గానీ చెప్పలేం. ఈ పోస్ట్ గురించి తెలిసిన నెటిజన్స్ సీరియస్ అవుతున్నారు. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారా అని ఫైర్ అవుతున్నారు. ఇక, ఐపీఎల్-2024 ముగిసిపోవడంతో హార్దిక్ టీ20 వరల్డ్ కప్-2024కు సిద్ధమవుతున్నాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో అతడు కెప్టెన్సీతో పాటు బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ దారుణంగా విఫలమయ్యాడు. 14 మ్యాచుల్లో అతడు 216 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్‌లో 10.75 ఎకానమీతో పరుగులు ఇచ్చుకొని, 11 వికెట్లే తీయగలిగాడు. దీంతో మెగా టోర్నీలో అతడు ఎలా ఆడతాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఒకవైపు ఐపీఎల్ ఫెయిల్యూర్, మరోవైపు విడాకుల వ్యవహారం నేపథ్యంలో భారత జట్టులో మిగతా ఆటగాళ్ల కంటే హార్దిక్ పెర్ఫార్మెన్స్ మీదే అందరి ఫోకస్ నెలకొంది. మరి.. పాండ్యా డివోర్స్ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
What a blunder @mipaltan for removing @ImRo45 from captaincy.
Then this Cheap PR stunt ! Where obviously Natasa was Scrutinised and labelled what not!
If this proves to be right, then don’t know where we are heading in future #HardikPandya pic.twitter.com/HIZlJlH5IS— kshama samra (@kshama27) May 28, 2024