iDreamPost
android-app
ios-app

చరిత్ర తిరగరాసిన శుభ్ మన్ గిల్- సాయి సుదర్శన్!

Shubman Gill- Sai Sudharsan created history: చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో జీటీ ఓపెనర్స్ శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ ఐపీఎల్ లో చరిత్రను తిరగ రాశారు.

Shubman Gill- Sai Sudharsan created history: చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ లో జీటీ ఓపెనర్స్ శుభ్ మన్ గిల్, సాయి సుదర్శన్ ఐపీఎల్ లో చరిత్రను తిరగ రాశారు.

చరిత్ర తిరగరాసిన శుభ్ మన్ గిల్- సాయి సుదర్శన్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ప్రతి మ్యాచ్ అంతులేని ఉత్కంఠను అందిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్- గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ అయితే నరాలు తెగే ఉత్కంఠను అందించింది. మొదటి ఓవర్ నుంచి గుజరాత్ ఓపెనర్లు చెన్నై బౌలర్లపై యుద్ధం ప్రకటించారు. ప్రతి బంతిని బౌండరీకి పంపుతూ గిల్- సాయి సుదర్శన్ ఇద్దరూ మైదానంలో మినీ సునామీని సృష్టించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి ఈ రాత్రిని ఒక పీడకలగా మార్చేశారు. ఇద్దరు కలిసి చెరో సెంచరీ చేసేశారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ లో ఈ జోడీ పలు రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా అతి పెద్ద ఓపెనింగ్ ని గుజరాత్ జట్టుకు అందించింది.

గుజరాత్- చెన్నై మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై జట్టుపై సాయి సుదర్శన్- శుభ్ మన్ గిల్ ఇద్దరూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఇద్దరూ కలిసి 17 ఓవర్లు ఆడేశారు. చెన్నై టీమ్ లో ఉన్న ప్రతి బౌలర్ ను ఉతికి ఆరేశారు. శుభ్ మన్ గిల్ కేవలం 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ శతకం చాలా స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఇది 100వ శతకం కావడం విశేషం. ఈ మ్యాచ్ లో గిల్ మొత్తం 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 104 పరుగులు చేశాడు. అలాగే సాయి సుదర్శన్ ఐపీఎల్ లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. సాయి సుదర్శన్ కూడా 50 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సుదర్శన్ మొత్తం 51 బంతుల్లో 7 సిక్సర్స్, 5 ఫోర్ల సాయంతో ఏకంగా 103 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్- శుభ్ మన్ గిల్ కలిసి అరుదైన రికార్డును సమం చేశారు. అదేంటంటే.. ఐపీఎల్ చరిత్రలో ఓపెనర్స్ ఇద్దరూ శతకాలు చేయడం ఇది కేవలం రెండోసారి మాత్రమే. మొదటిసారి డేవిడ్ వార్నర్- జానీ బెయిస్టో ఓపెనర్లుగా వచ్చి శతకాలు నమోదు చేశారు. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత శుభ్ మన్ గిల్- సాయి సుదర్శన్ ఇద్దరూ ఓపెనర్లుగా వచ్చి శతకాలు నమోదు చేసుకుని ఆ అరుదైన ఘనతను సాధించారు. అంతేకాకుండా ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్ లో కీలకం. అలాంటి మ్యాచ్ లో వీళ్లిద్దరూ శతకాలు చేయడంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. వారి బ్యాటింగ్ ను ఆఖరికి చెన్నై టీమ్, చెన్నై ఫ్యాన్స్ కూడా అభినందించారు.

ఇంక ఈ మ్యాచ్ లో సాయి సుదర్శన్ మరో అరుదైన ఘనత సాధించాడు. అదేంటంటే.. ఈ మ్యాచ్ లో ఐపీఎల్ లో తాను 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ సాధించడానికి సాయి సుదర్శన్ కు కేవలం 25 ఇన్నింగ్స్ మాత్రమే పట్టింది. సచిన్ టెండుల్కర్- రుతురాజ్ గైక్వాడ్ పేరిట ఉన్న 31 ఇన్నింగ్స్ లో వెయ్యి పరుగులు చేసిన రికార్డును సుదర్శన్ బద్దలు కొట్టాడు. అలాగే శుభ్ మన్ గిల్ హోం గ్రౌండ్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి చెన్నై సూపర్ కింగ్స్ కు గుజరాత్ జట్టు 232 పరుగుల భారీ లక్ష్యాన్ని అందించింది.