iDreamPost
android-app
ios-app

ఈ ఫొటోలో ఉన్న స్టార్ క్రికెటర్ ని గుర్తు పట్టారా? IPLలో అల్లాడిస్తున్నాడు..

  • Published Apr 10, 2024 | 4:22 PM Updated Updated Apr 10, 2024 | 4:22 PM

IPL 2024- Guess This Star Crickter: ఈ ఫొటోలో నూనూగు మీసాలతో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు ఐపీఎల్ లో ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఇతని పేరు వైరల్ గా మారింది. అలాగే పక్కన ఉన్న అమ్మాయి కూడా స్టార్ క్రికెటరే గుర్తు పట్టారా?

IPL 2024- Guess This Star Crickter: ఈ ఫొటోలో నూనూగు మీసాలతో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు ఐపీఎల్ లో ధనా ధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఇతని పేరు వైరల్ గా మారింది. అలాగే పక్కన ఉన్న అమ్మాయి కూడా స్టార్ క్రికెటరే గుర్తు పట్టారా?

  • Published Apr 10, 2024 | 4:22 PMUpdated Apr 10, 2024 | 4:22 PM
ఈ ఫొటోలో ఉన్న స్టార్ క్రికెటర్ ని గుర్తు పట్టారా? IPLలో అల్లాడిస్తున్నాడు..

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫీవర్లో ఉంది. రోజూ ఈ పొట్టి క్రికెట్ మజాని పొందుతున్నారు. అయితే ఇది క్యాష్ రిచ్ లీగ్ మాత్రమే కాదు.. టీమిండియాకి ఫ్యూచర్ క్రికెటర్లను ఇచ్చే మంచి ప్లాట్ ఫామ్ కూడా. ఎంతో మంది కుర్రాళ్లకు ఈ ప్రీమియర్ లీగ్ వల్ల లైఫ్, టీమిండియాలో చోటు దక్కింది. అలాగే ఈ కుర్రాడు కూడా ఇప్పుడు ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ వల్ల బాగా పాపులర్ అయ్యాడు. ఇండియాలోనే కాకుండా క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఇతని పేరు మారు మోగుతోంది. చూడటానికి ఎంతో క్యూట్ గా, కామ్ గా ఉన్నాడు. కానీ, మైదానంలోకి అడుగుపెడితే పరుగుల వరద పారాల్సిందే. ఎదురుగా ఎంత గొప్ప బౌలర్ ఉన్నా కూడా అతని లక్ష్యం మాత్రం బౌండరీ కొట్టడమే.

పైన ఫొటోలో ఉన్న ఇద్దరూ స్టార్ క్రికెటర్లే. ఆ ఫొటోలో కనిపిస్తున్న యువతి ఎవరో గుర్తు పట్టే ఉంటారు. ఆమె మరెవరో కాదు టీమిండిమా మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మందన్నా. ఆమె ఇటీవల జరిగిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబీ జట్టుకు తొలి ట్రోఫీని అందించింది. స్మృతి మందన్నా ఇచ్చిన గిఫ్ట్ కి ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా సంబరాలు చేసుకున్నారు. పురుషుల జట్టు సాధించలేక పోయినా.. మహిళా జట్టు చేసి చూపించింది అంటూ సంతోషించారు. అయితే ఈ అమ్మడు పక్కన ఉన్న కుర్రాడు కూడా క్రికెటరే. అతను ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో పెద్ద స్టార్ కూడా. అన్ని జట్లు, దిగ్గజ క్రికెటర్లు అంతా ఇతని గురించే మాట్లాడుతున్నారు. మరి.. అతను ఎవరో గుర్తు పట్టారా?

ఇప్పటికీ మీరు గుర్తు పట్టకపోతే.. ఒక క్లూ ఇవ్వచ్చు. ఆ నూనూగు మీసాల కుర్రాడు.. మన తెలుగువాడే. ప్రస్తుతం ఐపీఎల్ లో స్టార్ బౌలర్లకు చమటలు పట్టిస్తున్నాడు. అతను ఆడుతున్న ఫ్రాంచైజీ విజయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒంటిచేత్తో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టిస్తున్నాడు. తాజాగా తన జట్టుకు ఒక అద్భుతమైన విజయాన్ని కూడా అందించాడు. ఇతని ఇన్నింగ్స్ లేకపోతే ఆ జట్టుకు పరాజయమే దక్కేది. ఏంటి ఇంకా గుర్తు పట్టలేదా? అతను మరెవరో కాదండి.. వైజాగ్ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ తరఫున ఈ ఐపీఎల్ సీజన్ లో ధనాధన్ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా నితీశ్ కుమార్ రెడ్డి గురించే టాక్ నడుస్తోంది.

ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ తో వెలగులోకి వచ్చాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆ మ్యాచ్ లో కేవలం నితీశ్ కుమార్ రెడ్డి ఒక్కడే అర్ధ శతకం నమోదు చేశాడు. ఎదుర్కొన్న 37 బంతుల్లో 5 సిక్సులు, 4 ఫోర్లతో చెలరేగాడు. 2 పరుగుల తేడాతో అనూహ్య విజయం హైదరాబాద్ కు దక్కింది అంటే అది నితీశ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వల్లే అని చెప్పాలి. అతను మంచి స్కోర్ చేయబట్టే హైదరాబాద్ కు డిఫెండ్ చేసుకునే ఛాన్స్ దక్కింది. మరి.. ఈ యువ తెలుగు కెరటం గురించి, అతని ప్రదర్శన గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş