Tirupathi Rao
DC vs RR- Jake Fraser Innings: ఢిల్లీ క్యాపిటల్స్ కు జేక్ ఫ్రేజర్ రూపంలో ఒక యువ బ్యాటింగ్ సంచలనం దొరికాడు. రాజస్థాన్ తో మ్యాచ్ లో కూడా విధ్వంసం సృష్టించాడు. అవేశ్ ఖాన్ ఓవర్లో వరుస బౌండరీలతో చెలరేగాడు.
DC vs RR- Jake Fraser Innings: ఢిల్లీ క్యాపిటల్స్ కు జేక్ ఫ్రేజర్ రూపంలో ఒక యువ బ్యాటింగ్ సంచలనం దొరికాడు. రాజస్థాన్ తో మ్యాచ్ లో కూడా విధ్వంసం సృష్టించాడు. అవేశ్ ఖాన్ ఓవర్లో వరుస బౌండరీలతో చెలరేగాడు.
Tirupathi Rao
వీడియో: అవేశ్ ఖాన్ పై నిప్పులు చెరిగిన జేక్ ఫ్రేజర్.. ఒకే ఓవర్లో విధ్వంసం..ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ విధ్వంసం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ బ్యాటర్లు ప్రత్యర్థులపై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ సెన్సేషన్ జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై విజృంభించాడు. అవేశ్ ఖాన్ ఓవర్లో ఆకాశామే హద్దుగా చెలరేగి ఆడాడు. ఒకే ఓవర్లో మినీ సునామీ సృష్టించాడు. మరోసారి మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేశాడు. తర్వాతి ఓవర్లో పెవిలియన్ కు చేరాడు. కానీ, ఉన్నంతసేపు ఢిల్లీకి చుక్కలు చూపించాడు.
రాజస్థాన్ రాయల్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ జట్టు ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో కాస్త తడబడింది. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు మాత్రం మైదానంలో పెను విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా యువ క్రికెటర్ జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ ఈ మ్యాచ్ లో కూడా తనదైన శైలిలో చెలరేగాడు. ఈ మ్యాచ్ లో 20 బంతుల్లో 50 పరుగులు చేశాడు. వాటిలో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్ లో కూడా కేవలం 19 బంతుల్లోనే అర్ధ శతకం నమోదు చేశాడు. ముక్యంగా అవేశ్ ఖాన్ వేసిన ఓవర్లో రాజస్థాన్ ను వణికించేశాడు. ఆరు బంతుల్ని బౌండరీలుగా మలిచాడు.
అవేశ్ ఖాన్ వేసిన ఓవర్లో తొలి 3 బంతులను ఫోర్లుగా మలిచాడు. ఆ తర్వాత బంతిని భారీ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత బంతిని ఫోర్, ఆఖరి బంతిని సిక్సర్ గా మలిచాడు. ఆ తర్వాతి ఓవర్లో అశ్విన్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ గా పెవిలియన్ కు చేరాడు. ఇంత చిన్న వయసులోనే జేక్ ఫ్రేజర్ రాణిస్తున్న తీరు చూసి దిగ్గజాలు కూడా ముచ్చటపడుతున్నారు. జేక్ ఫ్రేజర్ కు మంచి ఫ్యూచర్ ఉందని చెబుతున్నారు. ఆస్ట్రేలియాకు ఒక మంచి ఓపెనర్ దొరికాడు అంటూ ప్రశంసిస్తున్నారు. అయితే జేక్ ఫ్రేజర్ వచ్చే టీ20 వరల్డ్ కప్ లో మాత్రం ఆస్ట్రేలియా తరఫున ఆడే అవకాశం లేదు. అతనికి ఇంకా అనుభవం కావాలి అంటూ సెలక్టర్స్ అభిప్రాయ పడుతున్నారు.
Welcome back to Kotla, Avesh 👀 pic.twitter.com/L46pXkpde4
— Delhi Capitals (@DelhiCapitals) May 7, 2024
ఇంక ఈ మ్యాచ్ విషానికి వస్తే.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 8 ఓవర్లలోనే 2 వికెట్ల నష్టానికి ఏకంగా 98 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్(50), షాయ్ హోప్(1) పరుగులు చేశారు. అభిషేక్ పోరెల్ విజృంభించాడు. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరే లక్ష్యంగా చెలరేగుతున్నారు. రాజస్థాన్ రాయల్స్ జట్టు దానికి ధీటుగా సమాధానం చెప్తుందో లేదో సెకండ్ ఇన్నింగ్స్ లో చూడాలి. మరి.. జేక్ ఫ్రేజర్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Jake Fraser-McGurk is a crazy kid from Australia. pic.twitter.com/OwQ1PAHbnD
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 7, 2024