Nidhan
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో లక్నో బౌలర్లతో ఆటాడుకున్నాడు ఢిల్లీ హిట్టర్ స్టబ్స్. ఆఖరి ఓవర్లలో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో లక్నో బౌలర్లతో ఆటాడుకున్నాడు ఢిల్లీ హిట్టర్ స్టబ్స్. ఆఖరి ఓవర్లలో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు.
Nidhan
ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో లక్నో బౌలర్లతో ఆటాడుకున్నాడు స్టబ్స్. ఆఖరి ఓవర్లలో తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. 25 బంతుల్లోనే 3 బౌండరీలు, 4 భారీ సిక్సుల సాయంతో 57 పరుగులు చేశాడు. లక్నో పేసర్లను టార్గెట్ చేసుకొని బిగ్ సిక్సెస్ కొట్టాడు స్టబ్స్. బాల్ కనబడితే స్టాండ్స్‌లో పడాలనేంత కసితో బ్యాటింగ్ చేశాడు. అతడే గనుక ఈ రేంజ్లో విధ్వంసం సృష్టించకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ 208 పరుగుల భారీ స్కోరు చేసేది కాదు.
స్టబ్స్‌తో పాటు అభిషేక్ పోరెల్ (33 బంతుల్లో 58) కూడా లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులతో రెచ్చిపోయాడు. బాదడమే పనిగా పెట్టుకొని ఆడాడు. క్రీజులో ఉన్నంత సేపు బిగ్ షాట్స్‌తో అలరించాడు. వీళ్లిద్దరితో పాటు షై హోప్ (27 బంతుల్లో 38), కెప్టెన్ రిషబ్ పంత్ (23 బంతుల్లో 33) కూడా మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆఖర్లో అక్షర్ పటేల్ (10 బంతుల్లో 14) కూడా వేగంగా పరుగులు చేసి టీమ్‌కు బిగ్ స్కోరు అందించడంలో తన వంతు సహకారం అందించాడు. మరి.. స్టబ్స్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Tristan Stubbs with a glorious fifty.
– Mark Howard’s commentary makes it even better. 👌pic.twitter.com/SCEHtIhrpf
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 14, 2024