iDreamPost
android-app
ios-app

విజృంభించిన కుల్దీప్ యాదవ్.. మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాప్ స్కోరర్ గా..!

DC vs KKR- Kuldeep Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మ్యాచులు అనూహ్యంగా మారుతున్నాయి. ఢిల్లీ జట్టు కేవలం 153 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ జట్టు సరెండర్ అయిపోయింది. కానీ, ఒక్క కుల్దీప్ యాదవ్ మాత్రం బ్యాటుతో గట్టి సమాధానం చెప్పాడు.

DC vs KKR- Kuldeep Yadav: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో మ్యాచులు అనూహ్యంగా మారుతున్నాయి. ఢిల్లీ జట్టు కేవలం 153 పరుగులకే పరిమితమైంది. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ జట్టు సరెండర్ అయిపోయింది. కానీ, ఒక్క కుల్దీప్ యాదవ్ మాత్రం బ్యాటుతో గట్టి సమాధానం చెప్పాడు.

విజృంభించిన కుల్దీప్ యాదవ్.. మ్యాచ్ లో ఢిల్లీ జట్టు టాప్ స్కోరర్ గా..!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఢిల్లీ జట్టు మరోసారి గడ్డుకాలాన్ని ఫేస్ చేస్తోంది. ఆఖరి 5 మ్యాచుల్లో 4 విజయాలతో జోరు మీద ఉన్న ఢిల్లీ జట్టుకు బ్రేకులు పడ్డట్లు అయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ జట్టు టాపార్డ్ నుంచి టెయిలెండర్ల వరకు అంతా కుప్పకూలిపోయారు. కేకేఆర్ బౌలర్లకు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు సరెండర్ అయిపోయారు. ఆఖరికి కెప్టెన్ పంత్ కూడా జట్టును కాపాడలేకపోయాడు. ఇంక యంగ్ అండ్ డైనమిక్ ఫ్రేజర్ కూడా ఈ మ్యాచ్ లో విఫలమయ్యాడు. కానీ, ఒకే ఒక్కడు ఢిల్లీ జట్టును ఆదుకున్నాడు. జట్టు స్కోర్ 120 కూడా దాటదు అనుకుంటుంటే.. 150 దాటించేశాడు. అతనే స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.

ఢిల్లీ జట్టు పరిస్థితి ఈ మ్యాచ్ లో దారుణంగా మారిపోయింది. వచ్చిన ప్రతి బ్యాటర్ అలాగే పెవిలియన్ కి రిటర్న్ వెళ్లిపోతున్నారు. అసలు ఎవరూ కూడా నిలదొక్కులేకపోయారు. పృథ్వీ షా(13), ఫ్రేజర్(12), అభిషేక్ పోరెల్(18), షాయ్ హోప్(6), పంత్(27), అక్షర్ పటేల్(15), స్టబ్స్(4), కుషగ్రా(1), రసిక్ డర్ సలామ్(8), కుల్దీప్ యాదవ్(35*), విలియమ్స్(1*) పరుగులు చేశారు. ఒక్క కుల్దీప్ మాత్రమే స్కోర్ ని 30 దాటించగలిగాడు. ఆఖరికి పంత్ కూడా 27కే పరిమితమైపోయాడు. కుల్దీప్ యాదవ్ 26 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 35 పరుగులు చేశాడు. నిజానికి ఢిల్లీ క్యాపిటల్స్ కు గౌరవప్రదమైన స్కోర్ దక్కిందంటే దానికి కారణం కుల్దీప్ యాదవ్ అనే చెప్పాలి. ఢిల్లీ బౌలర్లు కనీసం పోరాడేందుకు సరిపడా పరుగులు వచ్చేలా చేశాడు.

కేకేఆర్ బౌలర్లు అద్భుతం చేశారు. మొదటి నుంచి ఢిల్లీ బ్యాటర్లపై తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. చక్రవర్తి 3 వికెట్లతో మెరిశాడు. వైభవ్ అరోరా, హర్షిత్ రానాలకు చెరో 2 వికెట్లు దక్కాయి. అలాగే స్టార్క్, నరైన్ లకు చెరో వికెట్ దక్కింది. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్సను నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులు మాత్రమే చేయగలిగేలా కట్టడి చేయగలిగారు. మొత్తానికి కుల్దీప్ యాదవ్ మాత్రం కేకేఆర్ బౌలర్లకు గట్టిగానే సమాధానం చెప్పాడు. వారి బంతులకు వరల్డ్ క్లాస్ బ్యాటర్లు అంతా వెనుదిరుగుతుంటే.. కుల్దీప్ యాదవ్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు.

కుల్దీప్ యాదవ్ వరుసగా పరుగులు చేయడం మాత్రమే కాకుండా.. ఆఖరి బంతి వరకు మ్యాచ్ ని తీసుకెళ్లాడు. 20వ ఓవర్లో ఏకంగా 10 పరుగులు చేశాడు. రస్సెల్ పదునైన డెలివరీలకు అంతే ధీటుగా సమాధానం చెప్పాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక స్కోర్ చేసిన లిస్ట్ లో రెండో స్థానానికి చేరుకున్నాడు. 34*పరుగులతో ఉన్న క్రిస్ మోరిస్ ని దాటేశాడు. ఫస్ట్ ప్లేస్ లో 49*తో హర్భజన్ సింగ్ ఉన్నాడు. మరి.. కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.