Nidhan
సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బిగ్ హింట్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని రిటైర్మెంట్ గురించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ బిగ్ హింట్ ఇచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
సీఎస్కే మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అతడి కోసమే స్టేడియాలకు వచ్చే ఫ్యాన్స్‌కు లెక్కే లేదు. అద్భుతమైన బ్యాటింగ్, సూపర్బ్ కీపింగ్, తిరుగులేని కెప్టెన్సీతో అభిమానుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించాడు మాహీ. అయితే చాన్నాళ్ల కిందే ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోని.. ఐపీఎల్లో మాత్రం కంటిన్యూ అవుతున్నాడు. గత మూడేళ్లుగా లీగ్ నుంచి అతడు రిటైర్మెంట్ తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. గతేడాది గాయం అయింది అయినా ఆడాడు ధోని. ఈసారి ఇంజ్యురీ నుంచి పూర్తిగా రికవర్ కాకపోయినా కంటిన్యూ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి అభిమానులకు పిడుగు లాంటి వార్త.
ధోని రిటైర్మెంట్ వార్తల నేపథ్యంలో చెన్నై ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా అభిమానులు స్టేడియంలోనే ఉండాలని కోరింది. వాళ్లకు సర్ప్రైజ్ ఉందని తెలిపింది. అయితే ఇది ధోని రిటైర్మెంట్ గురించేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ అంటున్నారు. ఈ సీజన్లో ఎల్లో ఆర్మీకి హోమ్ గ్రౌండ్లో ఇదే ఆఖరి మ్యాచ్. తనను ఎంతో అభిమానించే ఫ్యాన్స్ నడుమ రిటైర్మెంట్ ప్రకటించాలని ధోని అనుకుంటున్నాడని.. అందుకే ఈ ప్రకటన వెలువడిందని అంటున్నారు. ఇది స్పెషల్ న్యూస్ కాదు.. బ్యాడ్ న్యూస్ అని, మాహీ ఇక మీదట క్రికెట్ ఫీల్డ్‌లో కనిపించడని వర్రీ అవుతున్నారు. అయితే దీనిపై సీఎస్కే ఫ్రాంచైజీ లేదా ధోని క్లారిటీ ఇచ్చేదాకా ఏదీ చెప్పలేం.
🚨🦁 Requesting the Superfans to Stay back after the game! 🦁🚨
Something special coming your way! 🙌🥳#CSKvRR #YellorukkumThanks 🦁💛 pic.twitter.com/an16toRGvp
— Chennai Super Kings (@ChennaiIPL) May 12, 2024