iDreamPost
android-app
ios-app

CSK vs PBKS: ధోని వికెట్ తీసినా సెలబ్రేట్ చేసుకోని హర్షల్ పటేల్.. ఎందుకంటే?

  • Published May 05, 2024 | 6:42 PM Updated Updated May 05, 2024 | 6:42 PM

ఐపీఎల్-2024లో భీకర ఫామ్​లో ఉన్న చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోని పంజాబ్​తో మ్యాచ్​లో ఫెయిలయ్యాడు. సీనియర్ పేసర్ హర్షల్ పటేల్ అతడ్ని వెనక్కి పంపించాడు.

ఐపీఎల్-2024లో భీకర ఫామ్​లో ఉన్న చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోని పంజాబ్​తో మ్యాచ్​లో ఫెయిలయ్యాడు. సీనియర్ పేసర్ హర్షల్ పటేల్ అతడ్ని వెనక్కి పంపించాడు.

  • Published May 05, 2024 | 6:42 PMUpdated May 05, 2024 | 6:42 PM
CSK vs PBKS: ధోని వికెట్ తీసినా సెలబ్రేట్ చేసుకోని హర్షల్ పటేల్.. ఎందుకంటే?

ఐపీఎల్-2024లో భీకర ఫామ్​లో ఉన్నాడు చెన్నై మాజీ సారథి ఎంఎస్ ధోని. ఆఖర్లో రెండు, మూడు ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగ్​కు దిగుతున్న మాహీ క్లీన్ హిట్టింగ్​తో అదరగొడుతున్నాడు. వచ్చిన బాల్​ను వచ్చినట్లు బౌండరీ లైన్​కు పంపిస్తున్నాడు. భారీ సిక్సులు బాదుతూ వింటేజ్ ధోనీని గుర్తుచేస్తున్నాడు. పంజాబ్ కింగ్స్​తో జరుగుతున్న మ్యాచ్​లోనూ అతడు ఇలాగే విధ్వంసం సృష్టిస్తాడని ఎల్లో ఆర్మీ ఫ్యాన్స్ అనుకున్నారు. మాహీ మాస్ హిట్టింగ్ పక్కా అని ఫిక్స్ అయ్యారు. కానీ ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయ్యాడు ధోని.

పంజాబ్​తో మ్యాచ్​లో మాహీ ఫెయిలయ్యాడు. సీనియర్ పేసర్ హర్షల్ పటేల్ బౌలింగ్​లో అతడు గోల్డెన్ డక్​గా వెనుదిరిగాడు. వేలాది మంది చెవులు పగిలిపోయేలా అరుస్తూ చేసిన భీకర సౌండ్ మధ్య బ్యాటింగ్​కు వచ్చిన మాహీ మొదటి బంతికే ఔట్ అవడంతో అభిమానులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. హర్షల్ పటేల్ వేసిన స్లోవర్ ఫుల్ లెంగ్త్ డెలివరీకి స్లాగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించి ధోని బౌల్డ్ అయ్యాడు. అయితే తోపు బ్యాటర్ అయిన మాహీ వికెట్ తీసినా హర్షల్ మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు. జస్ట్ రెండు చేతులు అలా పైకి ఉంచి కామ్ అయిపోయాడు. దీనికి కారణం ఏంటో తెలిస్తే అతడ్ని మెచ్చుకోవాల్సిందే. ధోని అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, అందుకే అతడి వికెట్ దక్కినా సెలబ్రేట్ చేసుకోలేదని పటేల్ తెలిపాడు.