iDreamPost
android-app
ios-app

రుతురాజ్ సూపర్ సెంచరీ.. ఇది మాత్రం కాస్త స్పెషల్!

CSK vs LSG- RuturaJ Gaikwad Super Century: చెన్నై వేదికగా లక్నో సూపర్ జయింట్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. అద్భుతమైన శతకంతో చెన్నై ఫ్యాన్స్ కళ్లకు ఫీస్ట్ ఇచ్చాడు.

CSK vs LSG- RuturaJ Gaikwad Super Century: చెన్నై వేదికగా లక్నో సూపర్ జయింట్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ లో కెప్టెన్ ఇన్నింగ్స్ తో రుతురాజ్ గైక్వాడ్ అదరగొట్టాడు. అద్భుతమైన శతకంతో చెన్నై ఫ్యాన్స్ కళ్లకు ఫీస్ట్ ఇచ్చాడు.

రుతురాజ్ సూపర్ సెంచరీ.. ఇది మాత్రం కాస్త స్పెషల్!

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఒక రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. చెన్నై వేదికగా లక్నో సూపర్ జెయింట్స్- చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ బౌలింగ్ ఎంచుకున్న లక్నో చెన్నై జట్టును కట్టడి చేయడంలో కాస్త గాడి తప్పినట్లు కనిపిస్తోంది. ఈ మ్యాచ్ లో చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. ఏకంగా శతకంతో చెలరేగాడు. రుతురాజ్ ముందు లక్నో బౌలర్లు తేలిపోయారు. మనోడి దెబ్బకు ఫీల్డర్లు బౌండరికీ అతుక్కుపోయారు. ఇది నిజంగా గైక్వాడ్ కి స్పెషల్ సెంచరీ అనే చెప్పాలి. సీజన్లో పోటీ ముదురుతున్న సమయంలో మంచి కెప్టెన్ ఇన్నింగ్స్ తో రుతురాజ్ ఆకట్టుకున్నాడు.

టాస్ గెలిచిన లక్నో బౌలింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఛేజింగ్ లో చెన్నైని అది కూడా హోమ్ గ్రౌండ్ లో కట్టడి చేయడం చాలా కష్టం. ప్రస్తుతం ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ పాత లెక్కలను సరిచేయాలని చూస్తోంది. అయితే రహానే(1), డారిల్ మిట్చెల్(11), జడేజా(16) త్వరగా పెవిలియన్ కు చేరడంతో చెన్నై పని అయిపోయింది అనుకున్నారు. కానీ, కెప్టెన్ మాత్రం లక్నో బౌలర్లకు ధీటుగా సమాధానం చెప్తున్నాడు. నిజానికి రుతురాజ్ ని కంట్రోల్ చేయడం వారి వల్ల కాదు అని కాసేపటికే తెలుసుకున్నారు. ఎలాంటి బంతులు వేసినా రుతురాజ్ విజృంభించాడు. బౌండరీలే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు.

ఈ మ్యాచ్ లో రుతురాజ్ కేవలం 56 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడు. చెన్నై టీమ్ తరఫున్ ఐపీఎల్ అత్యధిక సెంచరీలు నమోదు చేసిన లిస్ట్ లో చేరిపోయాడు. గతంలో మురళీ విజయ్, షేన్ వాట్సన్ చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తూ రెండు శతకాలు నమోదు చేశారు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కూడా ఈ శతకంతో ఆ లిస్ట్ లోకి చేరిపోయాడు. అలాగే ఈరోజు జరిగిన మ్యాచ్ తో.. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో కెప్టెన్ గా అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన ఆటగాడిగా రుతురాజ్ నిలిచాడు. ఒక శతకంతో గైక్వాడ్ రెండు అద్భుతాలు చేశాడు. అలాగే లక్నో మీద విజయం సాధించాలని కసిగా ఉన్న మ్యాచ్ లో ఇలాంటి ఇన్నింగ్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.

రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్ లో 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. అలాగే ఈ మ్యాచ్ లో ఫస్ట్ ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ వరకు క్రీజులో ఉన్నాడు. అలాగే సగం ఓవర్లు రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే ఆడాడు. మొత్తాని ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. లక్నో బౌలింగ్ చూస్తే.. మ్యాట్ హెన్రీ, మోహిసన్ ఖాన్, యష్ ఠాకూర్ లకు తలో వికెట్ దక్కింది. నాలుగో వికెట్.. శివమ్ ధూబె రనౌట్ అయ్యాడు. లక్నో మొత్తం ఆరుగురు బౌలర్లను వాడుకుంది. కానీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.