Nidhan
లెజెండరీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఎంతో పేరు గడించాడు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్‌గా నిలిపిన మాహీ.. ఐపీఎల్‌లోనూ సీఎస్కేకు 5 కప్పులు అందించాడు. అలాంటోడు అభిమానుల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని మరోమారు నిరూపించాడు.
లెజెండరీ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఎంతో పేరు గడించాడు మహేంద్ర సింగ్ ధోని. టీమిండియాను అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్‌గా నిలిపిన మాహీ.. ఐపీఎల్‌లోనూ సీఎస్కేకు 5 కప్పులు అందించాడు. అలాంటోడు అభిమానుల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని మరోమారు నిరూపించాడు.
Nidhan
భారత క్రికెట్లో సువర్ణాక్షరాలతో రాయాల్సిన పేర్లలో ఒకటి మహేంద్ర సింగ్ ధోని. ఎన్నో ఏళ్ల వరల్డ్ కప్ కలను తీర్చిన కెప్టెన్ అతడు. టీ20 ప్రపంచ కప్‌తో పాటు వన్డే వరల్డ్ కప్‌నూ టీమిండియాకు అందించాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఒకమారు మెన్ ఇన్ బ్లూను ఛాంపియన్స్‌గా నిలిపాడు. అతడి సారథ్యంలో జట్టు అన్ని ఫార్మాట్లలోనూ నంబర్ వన్‌గా ఉండేది. భారత జట్టుకే కాదు.. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను కూడా అంతే సక్సెస్‌ఫుల్‌గా నడిపించాడు మాహీ. ఆ టీమ్‌కు ఏకంగా 5 కప్పులు అందించాడు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పి కీపర్, బ్యాటర్‌గానే కొనసాగుతున్నాడు. అయినా అతడిపై విమర్శలు తప్పడం లేదు.
ఐపీఎల్-2024లో ధోని బ్యాట్‌తో చెలరేగుతున్నాడు. ఆఖర్లో వచ్చి ధనాధన్ షాట్లతో అదరగొడుతున్నాడు. టీమ్ భారీ స్కోర్లు అందుకోవడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇంత బాగా ఆడుతున్నోడు బ్యాటింగ్ ఆర్డర్లో పైకి రావొచ్చు కదా? టాపార్డర్‌లో ఆడకపోతే ఇంటికి వెళ్లిపోవడం బెటర్.. చివర్లో వచ్చి ఆడినా టీమ్ గెలవడం లేదు అంటూ మాహీని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ధోని పైకి వచ్చి ఆడుంటే సీఎస్కే ఈపాటికే ప్లేఆఫ్స్ చేరేదని, అతడి నిర్లక్ష్యం వల్లే జట్టు కష్టాలు పడుతోందని అంటున్నారు. అయితే చెన్నై కోసం, తనను ఎంతగానో ప్రేమించే ఆ జట్టు ఫ్యాన్స్ కోసం మాహీ చేస్తున్న త్యాగం గురించి తెలిస్తే ఈ మాట అనలేరు. గతేడాది ఐపీఎల్ టైమ్‌లోనే ధోని గాయపడ్డాడు. ఇంజ్యురీతో బాధపడుతూనే ఆ సీజన్ ఆడేశాడు. ఆ తర్వాత సర్జరీ చేయించుకున్నాడు. కానీ కంప్లీట్‌గా రికవర్ కాలేదు.
సీఎస్కే మేనేజ్మెంట్ తన మీద పెట్టిన బాధ్యత, అభిమానులు తన ఆట కోసం ఎదురుచూస్తుండటంతో పంటి కింద నొప్పిని భరిస్తూనే ఈ సీజన్లో కూడా ఆడుతున్నాడు ధోని. గాయం ఇబ్బంది పెడుతుండటంతో బ్యాటింగ్ సమయంలో ఎక్కువగా పరిగెత్తకుండా షాట్లు మాత్రమే ఆడుతున్నాడు. ఇప్పుడు నెట్టింట ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో బ్యాటింగ్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్తూ కనిపించాడు మాహీ. అతడి చేతిలో నడుముకు పెట్టుకునే బ్యాండ్ ఉంది. దీన్ని బట్టే నడుము నొప్పి ఇబ్బంది పెడుతున్నా ఫ్యాన్స్ కోసం అతడు గ్రౌండ్లోకి దిగాడని చెప్పొచ్చు. ఈ ఫొటో చూసిన నెటిజన్స్.. లెజెండ్ అని ఊరికే అనలేదని అంటున్నారు. మరి.. గాయం వెంటాడుతున్నా, నొప్పి భరిస్తూనే ఫ్యాన్స్ కోసం ధోని గ్రౌండ్లోకి దిగడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Despite facing numerous challenges, MS Dhoni is giving his all for his team and fans🫡
Take a bow, Legend🙇♀️
📸: CSK pic.twitter.com/jFncnFyIis
— CricTracker (@Cricketracker) May 11, 2024